Krishna Mukunda Murari Serial Today December 18th Episode జైలులో పెద్దపల్లి ప్రభాకర్‌ని కలిసిన కృష్ణ, మురారి.. ముకుందకు అండగా దేవ్!
Krishna Mukunda Murari Today Episode ముకుంద దేవ్‌ని కలిసి మురారికి గతం గుర్తొచ్చింది ఎంక్వైరీ ప్రారంభించాడు అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Serial Today Episode: కృష్ణ, మురారిలు బైకు మీద వెళ్తుంటారు. కృష్ణ సరదాగా సినిమాకు వెళ్దామని మురారిని అడిగితే మురారి కృష్ణకు చీవాట్లు పెడతాడు. ఇక పక్కనే ఐస్ క్రీమ్ బండి వెళ్తే ఐస్ క్రీమ్ తిందామని కృష్ణ మురారిని అడుగుతుంది. మురారితో వాదిస్తుంది. మొత్తానికి ఐస్ క్రీమ్ కొని తాను తినడమే కాకుండా మురారితోనూ తినిపించేస్తుంది. మరోవైపు ముకుంద కూడా జైలు దగ్గరకు వస్తుంది.
ముకుంద: ఇక నాకు కౌంట్ డౌన్ స్టార్ అయింది. ఏ క్షణంలో అయినా నిజాన్ని మురారి భయటపెట్టొచ్చు. దేవుడా ఏంటయ్యా ఇది మా పెళ్లి అయిన తర్వాత అయినా మురారికి గతం గుర్తు చేయొచ్చు కదా అప్పుడు నా పాట్లు నేను పడేదాన్ని.
దేవ్: ఏంటి ముకుంద..
ముకుంద: నా ఖర్మరా ఎలా ఉండేవాడివి.. నా కోసం ఇలా ఖైదీలా
దేవ్: ముకుంద ఏంటిది నీ కోసం కాకుంటే నేను ఎవరి కోసం చేస్తా చెప్పు. సరే ఎలా ఉన్నావు.
ముకుంద: బాలేను దేవ్.. అస్సలు బాలేను.. మురారికి గతం గుర్తొచ్చింది. అవును ఇప్పుడు తనకు సర్జరీ చేసింది నేరం తనమీద వేసుకున్న ప్రభాకర్ కాదు. ఇంకెవరో అన్నాడు. ప్రభాకర్ అయితే నాకు గుర్తొచ్చేది కదా అన్నాడు. ఎంక్వైరీ మొదలు పెట్టాడు. ఇప్పుడే ఇక్కడున్న ప్రభాకర్‌ని కలవడానికి వచ్చాడట. నాకు చాలా భయంగా ఉంది దేవ్.
దేవ్: భయపడకు ముకుంద అవును నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చే శుక్రవారం పెళ్లి అన్నావు కదా దానికి ఏం అన్నాడు.
ముకుంద: వద్దు అన్నాడు ఈలోపే అసలైన వాడిని పట్టుకుంటా అన్నాడు. దానికి పెద్ద అత్తయ్య పట్టుకోలేకపోతే అనుకున్న మూహూర్తానికే పెళ్లి అంటే దానికి సరే అని ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసుకున్నారు.
దేవ్: సూపర్.. నువ్వు ఏం భయపడకు. లక్కీగా నాకు రేపో ఎల్లుండో బెయిల్ రానుంది. వచ్చి నేను చక్రం తిప్పుతా.
ముకుంద: ఈలోపు నిన్ను ట్రేస్ అవుట్ చేస్తే..
దేవ్: అంత ఈజీ కాదు ముకుంద. పెళ్లి రోజు వచ్చే వరకు నేను దొరకను. ఏమాత్రం నా గురించి క్లూ దొరకదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నీ పెళ్లి గ్యారెంటీగా అవుతుంది అనే సంతోషంలో ఉండు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నీ మొహంలో టెన్షన్ బయటపెట్టకు. సరేనా ఇక వెళ్లు.
మరోవైపు రేవతి, మధు కలిసి శకుంతల ఇంటికి వస్తారు. ఇక రేవతి శకుంతలతో నీ బిడ్డ, అల్లుడు బయటకు వెళ్లారు కదా ఆ తింగరి ఏం చెప్పింది అని అడుగుతుంది. దీంతో శకుంతల బయటకు వెళ్తున్నాం తినటానికి వస్తామో రామో అని చెప్పింది అని అడుగుతుంది.
శకుంతల: అవును వదినా లగ్గం లోపే ఈ కేసు తేలుతుంది కదా.. అలా జరిగితేనే బాగున్ను వదిన.
రేవతి: అవును కానీ నెలరోజుల గడువు ఉన్నా బాగున్ను కానీ చాలా తక్కువ టైం ఉంది. ఈ కొద్ది టైంలో పిల్లలు కేసు తేలుస్తారా లేదా అని టెన్షన్‌గా ఉంది.
మధు: పెద్దమ్మ ప్రతీదీ భూతద్దంలో చూడకు. నీ కొడుకు పెద్ద పోలీస్ అధికారి. ఇక నీ కోడలు పెద్ద డాక్టర్. ఇద్దరూ అమాయకులు అన్నట్లు మీరు మాట్లాడకండి అని చెప్తాడు.
మరోవైపు మురారి, కృష్ణలు పోలీస్ స్టేషన్‌కు వస్తారు. వాళ్లని చూసి ముకుంద చాలా టెన్షన్ పడుతుంది. మురారి వాళ్లు తనని చూడకుండా దాక్కుంటుంది. ఇక కృష్ణ, మురారి ఇద్దరూ ప్రభాకర్ దగ్గరకు వెళ్తారు.
మురారి: ఏంటి మామ అలా చూస్తున్నావ్..
కృష్ణ: అవును చిన్నాన్న మీ అల్లుడికి గతం గుర్తొచ్చేసింది.
ప్రభాకర్: అల్లుడు గతం గుర్తొచ్చిందా.. నాకు ఎంత సంబరంగా ఉందో తెలుసా ఇప్పుడు నాకు మాటలే రావడం లేదు.
కృష్ణ: చిన్నాన్న నువ్వు ఇక ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేరం చేసింది నువ్వు కాదని మా ఏసీపీ సార్ పెద్దత్తయ్యతో చెప్పేశారు.
మురారి: అవును మామ. నువ్వు త్వరలోనే బయటకు వస్తావు. అసలైన వారిని కూడా పట్టుకుంటా.
ప్రభాకర్: అవునా అలా అయితే ఆ లగ్గం లేనట్లేగా.. ఏంటి బిడ్డా అలా చూస్తున్నావు. ఆ పెళ్లి ఆగిపోలేదా..
కృష్ణ: లేదు చిన్నాన్న అసలు ఏం జరిగింది అంటే మా పెద్దత్తయ్య కళ్లముందే నువ్వు జైలుకి వెళ్లావు. మా అత్తయ్య ఇదే నిజం అనుకుంటుంది. అప్పుడు అసలైన వారిని పట్టుకుంటే పెళ్లి ఉండదు అని ఏసీపీ సార్ అత్తయ్యకు చెప్పారు. కచ్చితంగా పట్టుకుంటారు.
మురారి: నువ్వు బయపడకు మామ. నా మీద నమ్మకం ఉంచు. నీ కూతురు నా భార్య వేరే ఎవరూ కాదు. కానివ్వను. చెయ్యని నేరాన్ని మీ మీద వేసుకొని ఈ జైలుకి వచ్చారు. అందుకే మిమల్ని చూడాలని ముందుగా వచ్చాను.
ప్రభాకర్: అంటే అల్లుడు ఆ దినం నేను రాకపోతే నా బిడ్డను లోపలు వేస్తారు అనే భయంతో నేనే ముందుకు వచ్చాను. అందుకే నింద నా మీద వేసుకున్నాను. నా బిడ్డ నీ దగ్గరే ఉంటుంది. అంటే జీవితాంతం ఇలాగే ఇక్కడే ఉంటాను.
మురారి: మీ అమ్మాయి నా దగ్గరే జీవితాంతం ఉంటుంది. ఇక మీరు తొందర్లేనే బయటకు వస్తారు. అవును మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా..
ప్రభాకర్: అదే ఉంటే ఆరోజే వాళ్ల అంతు చూసేవాడిని. వాళ్లు ఎవరు ఏంటి అనేది నాకు అర్థం కావడం లేదు. అల్లుడూ నా బిడ్డకు ఏం కాదు కదా..
మురారి: మామ నువ్వేం టెన్షన్ పడకు కృష్ణ ఎప్పటికీ నా భార్య. ఇక మేము వెళ్తాం మామ.
మరోవైపు ముకుంద చాలా టెన్షన్ పడుతుంది. నిజం తెలిస్తే తన పరిస్థితి అంటే ఏమిటి అని చెమటలు పట్టేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.