Krishna Mukunda Murari September 27th: మురారితో తాళి కట్టించుకుంటానన్న ముకుంద - కృష్ణ ఏం చేయబోతోంది!
ఆదర్శ్ ని ఇంటికి రాకుండా చేసి మురారీని పెళ్లి చేసుకోవాలని ముకుంద ట్రై చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Krishna Mukunda Murari September 27th: మురారీ గదిలోకి రాగానే కృష్ణ దోమలు చంపుతూ పొరపాటున బ్యాట్ తో మురానిని కొట్టేస్తుంది. కాసేపు దోమల గురించి డిస్కషన్ జరుగుతుంది. ముకుంద ఒంటరిగా గదిలో ఉండి బాధపడుతుంది.
ముకుంద: కృష్ణ మురారీని ప్రేమించలేదు. మురారీ తనకి కావాలని కోరుకోలేదు. అయినా తనకి మురారీని ఇచ్చావ్ నేనేం తప్పు చేశావ్ దేవుడా నాకెందుకు అన్యాయం చేస్తున్నావ్. రోజురోజుకీ నమ్మకం పోతుంది. ఏం చేయాలి నేను. నా ప్రేమని నాకు ఇవ్వు లేకపోతే చావునైనా ఇవ్వు. మురారీ ప్రేమని పొందలేని ఈ జన్మ నాకు అక్కర్లేదు అని బాధపడుతూ ఉండగా అలేఖ్య వస్తుంది.
అలేఖ్య: నీ ప్రేమని గెలిపించుకుంటానని చెప్పి అధైర్యపడితే ఎలా? నమ్మకం కోల్పోతే నీ ప్రేమ గెలుచుకోలేవు. ధైర్యంగా ఉండు
ముకుంద: అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. నా కన్న తండ్రికి నా ప్రేమ అర్థం కాలేదు. చివరికి నేను ప్రేమించిన వాడికి కూడా అర్థం కాకపోతే ఏం చేయాలి
అలేఖ్య: ఇప్పుడు నువ్వు అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నావ్. నువ్వు నీ ప్రేమని నిరూపించుకో
ముకుంద: నా ప్రేమ కోసం నేను చచ్చేవరకు పోరాడతాను
Also Read: కావ్యకి పడిపోయిన రాజ్, రుద్రాణిలో మొదలైన టెన్షన్ - స్వప్న బయటపడుతుందా!
అలేఖ్య: నీ ప్రేమ గెలవాలి. మురారీని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి
మురారీ తన ప్రేమని ఎప్పుడు చెప్తాడా అని కృష్ణ ఎదురుచూస్తుంది. ముకుంద అలేఖ్యని మరొక సాయం చేయమని అడుగుతుంది. భవానీ గదిలోకి వెళ్ళి ఆమె ఫోన్ నుంచి కల్నల్ ఫోన్ నెంబర్ తీసుకురమ్మని అడుగుతుంది. వామ్మో తన వల్ల కాదని అలేఖ్య భయపడిపోతుంది. దీంతో ముకుందనే వెళ్లాలని అనుకుంటుంది. భవానీకి పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపి భవానీకి తాగించి కల్నల్ కి ఫోన్ చేసి ఆదర్శ్ ని ఇంటికి రావొద్దని తన జీవితంలోకి ఇంకెప్పుడు రావొద్దని చెప్పాలని అనుకుంటుంది. అలేఖ్యని పాలు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. అవి తెచ్చిన తర్వాత అందులో స్లీపింగ్ పిల్స్ వేస్తుంది. అది చూసి అలేఖ్య టెన్షన్ పడుతుంది. ముకుంద ఆ పాలు తీసుకుని భవానీ గదిలోకి వెళ్ళాలా వద్దా అని సంకోచిస్తుండగా తనే లోపలికి రమ్మని పిలుస్తుంది.
భవానీ: నాకు రోజు రేవతి కదా పాలు తీసుకొచ్చేది ఈరోజు కొత్తగా నువ్వు తీసుకొచ్చావ్ ఏంటి? నాతో ఏదో మాట్లాడటం కోసం ఇవి తీసుకొచ్చావ్ కదా
కృష్ణ ముకుంద కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. తన గురించి మధుకర్ ని అడిగితే భవానీ గదిలోకి వెళ్తుంటే చూసినట్టు చెప్తాడు. ఎందుకు వెళ్ళిందా అని కృష్ణ వెళ్తుంది.
భవానీ: నీ బాధ అర్థం అయ్యింది ఇంకెన్ని కొన్ని రోజులు ఓపిక పడితే చాలు
ముకుంద: అవసరం లేదు మీకు ఎందుకు శ్రమ. నా పెళ్ళైన మరుసటి రోజు నుంచి ఎదురుచూస్తూ ఉన్నాను. కానీ ఆదర్శ్ మాత్రం రాలేదు
భవానీ: కానీ ఇప్పుడు వస్తాడు
ముకుంద: ఇంతకాలం రానివాడు ఇప్పుడు వస్తాడని నాకు నమ్మకం లేదు
Also Read: అమ్మ కావాలంటూ రిషి కన్నీళ్లు, దేవయానికి షాక్ ఇచ్చిన ధరణి - శైలేంద్ర విశ్వరూపం
తరువాయి భాగంలో..
మన మధ్య ముసుగులు ఎందుకు కృష్ణ. నేను మురారీని ప్రేమిస్తున్నా. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ఒకరంటే ఒకరికి ప్రాణం. నీకు ఇవన్నీ తెలియక ఆదర్శ్ కోసం వెళ్దామని అంటున్నావ్ కదా అంటుంది. తెంపితే తెగిపోయేది కాదు తాళి బంధం. దాని విలువ గురించి నీకేం తెలుసని కృష్ణ చెప్తుంది. నా మెడలో తాళి ఉంది కానీ విలువ లేదు. దానికి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా మురారీ నా మెడలో తాళి కట్టినప్పుడేనని ముకుంద తెగించి చెప్తుంది.