(Source: ECI/ABP News/ABP Majha)
Krishna mukunda murari November 2nd : మురారి అమెరికా వెళ్లిపోతాడా? కృష్ణను ఔట్ హౌస్ నుంచి భవాని వెళ్లగొడుతుందా?
మురారిని బెటర్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా పంపాలనుకున్నట్లు భవాని చెప్తుంది. దీంతో అయోమయంలో పడిపోతుంది రేవతి. ఇప్పుడు కృష్ణ పరిస్థితి ఏంటని కంగారు పడుతుంది. దీంతో ఎపిసోడ్ మరో మలుపు తీసుకుంటుంది.
మురారిని బెటర్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా పంపాలనుకున్నట్లు భవాని చెప్తుంది. దీంతో అయోమయంలో పడిపోతుంది రేవతి. ఇప్పుడు కృష్ణ పరిస్థితి ఏంటని కంగారు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్ మరో మలుపు తీసుకుంటుంది.
మురారి తల పట్టుకుని కూర్చుండిపోతాడు. ముకుంద కంగారుగా ఏమైంది మురారి అంటూ పరుగెత్తుకు వస్తుంది. ముకుంద అరుపులకు ఇంట్లో వాళ్లందరూ మురారి దగ్గరకు వస్తారు. ఏమైందని కంగారు పడుతూ అడుగుతారు. మురారి వాంప్టింగ్ అయ్యేటట్లుందని చెప్తాడు. ఇంతలో మురారి, ముకుంద చేతుల్లో వాంప్టింగ్స్ చేసుకుంటాడు.
ముకుంద: ఇప్పుడెలా ఉంది.
మురారి: పర్వాలేదు..
భవాని : ముకుంద వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకో.. మురారి నాన్న
మురారి : నాకేం కాలేదమ్మ జస్ట్ తల తిరిగిందంతే.. ఎవరో గుర్తు వచ్చినట్లు అనిపించింది. ఎవరో అమ్మాయి ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు గుర్తుకు వచ్చింది.
అని చెప్పగానే ఇంకేం ఆలోచించకు మురారి ప్రశాంతంగా ఉండు అని ముకుంద చెప్తుంది. దీంతో మురారి బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు.
కృష్ణ వాకిట్లో కూర్చుని భవాని తిట్టిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మధు అక్కడికి వస్తాడు.
కృష్ణ : ఓదార్చడానికి వచ్చావా? ఏమని ఓదార్చుతావు..? వద్దు కృష్ణ ఇక నీ జీవితంలో ఏబీసీడీల అబ్బాయి లేడు. ఆతనిపై ఆశలు వదులుకో.. ఇక నీ జీవితం ఇంతే ఒంటరిగానే బతుకు ఇక మీ ఊరు వెళ్లిపో అని చెప్పడానికి వచ్చావా?
మధు : అవును కృష్ణ
కృష్ణ : మధు ఏమంటున్నావ్ నేను ఏసీపీ సార్ ను వదిలి ఇంటికి వెళ్లిపోవాలా? తల తిరుగుతుందా? లేదంటే పెద్దత్తయ్య కబురు పెట్టిందా? ఏసీపీ సార్ ను వదిలి పోవాలా?
మధు: అవును కృష్ణ నిన్ను మురారి నుంచి దూరం చేయడానికి ముకుంద చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నీ మీద జాలిగా ఉంది. ఆ వార్త వింటే నువ్వేమైపోతావోనన్న భయం కలుగుతుంది కృష్ణ.
అంటూ మురారి, ముకుంద చేతుల్లో వాంప్టింగ్ చేసుకున్న విషయం మొత్తం చెప్పేస్తాడు మధు. ఈ విషయాన్ని టేకిట్ ఈజీగా తీసుకున్న కృష్ణ నవ్వుతూ మధు నువ్విలా ఆలోచిస్తే జన్మలో డైరెక్టర్ కాలేవని.. మురారి ఎప్పటికీ ముకుందను ప్రేమించడని.. నాకు నిన్ననే అర్థం అయ్యిందని చెప్తుంది. మధు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కృష్ణ లోపలికి వెళ్లి దేవుడి దగ్గర నిల్చుని
కృష్ణ : ఎందుకు స్వామి ఇంత పరీక్ష పెడుతున్నావు. నీవు తలుచుకుంటే నా సమస్య తీర్చడం నిమిషం పట్టదు.
ముకుంద : శబాష్ కృష్ణ నా దెబ్బకు భయపడి దేవుడికి మొరపెట్టుకుంటున్నావా? కొద్ది రోజుల క్రితం ఏమ్మన్నావ్ గుర్తొచ్చిందా? మళ్లీ ఆ దేవుడికి ఎందుకు మొక్కుతున్నావ్.
కృష్ణ : ఇదేనా నువ్వు చెప్పాలనుకున్నది. ఇంకా వేరే ఎమైనా ఉందా? అందరూ పుట్టేటప్పుడు కాస్తో కూస్తో వెర్రితనంతో పుడతారు. చాలా మంది వెర్రిని సరిచేసుకుంటారు. కొంతమంది అలాగే ఉండిపోతారు నీలాగే
ముకుంద: మాటలు మర్యాదగా రాని
కృష్ణ : రానివ్వను ఇలాగే మాట్లాడతాను చూడు నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా స్వయంగా ఏసీపీ సారే నన్ను ఆ ఇంటికి తీసుకొచ్చేలా చేస్తాను.
అనగానే ముకుంద చూద్దాంలే అనుకుంటూ వెళ్తుంది. కృష్ణ తనను పెద్దత్తయ్య భవాని ఎందుకు ఇంత ధ్వేషిస్తుందని ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇంతలో రేవతి భోజనం తీసుకుని అక్కడకు వస్తుంది. రేవతిని చూడగానే కృష్ణ ఏడుస్తూ ఆమెను హగ్ చేసుకుని బాధపడుతుంది. రేవతి అన్నింటికి పరిష్కారం లభిస్తుందని నిన్ను పూర్తిగా నమ్ముతున్నానని చెప్పి వెళ్లిపోతుంది.
రేవతి విండో దగ్గర నిలబడి ఆలోచిస్తుంటే.. భవాని వచ్చి అక్కడేం చేస్తున్నావని అడుగుతుంది.
రేవతి : మొన్న వినాయక చవితి రోజు అందరం ఎంత సంతోషంగా ఉన్నామో కదా.. అది తలుచుకుని
భవాని : షటప్ రేవతి అసలు ఆ పెద్దపల్లి ప్రభాకర్ రాకపోయుంటే ఇదంతా జరిగేదా? మనమే ఎంతో సంతోషంగా పూజ చేసుకునే వాళ్లం. అందరం హ్యాపీగా ఉండే వాళ్లం.
అని బెటర్ ట్రీట్‌మెంట్ కోసం మురారిని అమెరికా పంపిచాలనుకున్నట్లు భవాని చెప్తుంది. ఇంతలో మురారి అక్కడకి వచ్చి బిర్యాని వాసన వస్తుందని ఎవరు చేశారని అడుగుతాడు. అది డాక్టర్ వేణి చేస్తుందని మధు చెప్తాడు. అయితే అందరం అక్కడికే వెళ్దాం పద అని మురారి వెళ్తాడు. భవాని, రేవతి, మధు, ముకుంద అందరూ కృష్ణ ఉన్న ఔట్ హౌస్‌కు వెళ్తారు. కృష్ణ సంతోసంగా అందరికీ స్వాగతం చెబుతుంది. దీంతో ఇవాళ్లి ఏపిసోడ్ అయిపోతుంది.