Krishna Mukunda Murari July 5th: కృష్ణకి తల్లిలా మారి గోరుముద్దలు తినిపించిన రేవతి- భార్య కోసం కన్నీళ్ళు పెట్టుకున్న మురారీ
కృష్ణని ప్రేమిస్తున్నానని మురారీ ముకుందకి చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ అనవసరంగా డైరీ చదివాను అప్పుడు ఆ అమ్మాయి గురించి తెలిసేది కాదని అనుకుంటూ ఇంట్లోకి వస్తుంటే గుమ్మంలో చెప్పులు చూసి షాక్ అవుతుంది. ఫామ్ హౌస్ లో చూసిన చెప్పులని గుర్తు పడుతుంది. అవే చెప్పులు ఆ డైరీ అమ్మాయి ఇంటికి వచ్చింది తను ఎవరో తెలుసుకోవాలని ఇంట్లోకి వస్తుంది. రేవతి ఎదురుపడితే మన ఇంటికి ఎవరైనా కొత్తగా వచ్చారా అని ఇల్లంతా పిచ్చి పిచ్చిగా చూస్తూ వెతుకుతుంది. ఎవరూ రాలేదని చెప్తుంది. తనని తీసుకుని బయటకి వెళ్ళి చెప్పులు చూపించి ఎవరివని అడుగుతుంది. ఏమైంది ఎందుకు డిస్ట్రబ్ గా ఉన్నావని రేవతి అడుగుతుంది. ముందు ఆ చెప్పులు ఎవరివని మళ్ళీ అడుగుతుంది. అవి ముకుందవి అని చెప్పేసరికి షాక్ అవుతుంది. ఎందుకు వాటి గురించి అంతగా కంగారుపడుతున్నావని రేవతి అంటుంది.
Also Read: ప్రాణాపాయ స్థితిలో రాజ్- అప్పుని విడిపించేందుకు వచ్చి ఇరుక్కుపోయిన మీనాక్షి
ముకుంద ఫామ్ హౌస్ కి వచ్చిందా? వాళ్ళ అమ్మకి బాగోలేదని హాస్పిటల్ కి కదా వెళ్ళిందని ఆలోచిస్తూ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. చెప్పుల గురించి అడిగి అంత కంగారుగా వెళ్ళిపోయింది ఏం జరిగి ఉంటుందని రేవతి ఆలోచిస్తుంది. ముకుంద గదిలో నుంచి తీసుకొచ్చిన బుక్, డ్రాయింగ్ చూసి మధుకర్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సాక్ష్యాలు ఉన్నాయి కదా వీటిని బయట పెట్టేద్దామని అనుకుంటారు. అప్పుడే రేవతి వచ్చి ఇద్దరినీ వాయించేస్తుంది. చేసిన తప్పు ఎన్ని సార్లు చేస్తారని కొడుతుంది. క్షమించండి అత్తయ్య అని అలేఖ్య వేడుకుంటుంది. ఇంకోసారి ఇలాంటి ఆలోచన వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చేసి డ్రాయింగ్, బుక్ తీసుకుని వెళ్ళిపోతుంది. కృష్ణ బాధగా నిలబడి ఏడుస్తుంటే రేవతి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది.
రేవతి: ముకుందతో ఏదైనా సమస్య..? ఎందుకు తన గురించి అడిగావ్
కృష్ణ: ఫామ్ హౌస్ లో ఎవరూ ఉండరని మీరు చెప్పారు కదా.. కానీ ఉన్నారు నేను చూశాను. ఒక గది బయట లేడీస్ చెప్పులు చూశాను. ఎవరో అని తలుపు తట్టాను ఎవరూ రాలేదు
రేవతి: అంటే వాళ్ళు ఎవరూ రాలేదు
కృష్ణ: అలాంటి చెప్పులే మన ఇంటి ముందు చూశాను అవి ఎవరివి అంటే ముకుందవి అన్నారు
రేవతి: అంటే ముకుంద ఫామ్ హౌస్ కి వెళ్ళిందా? వాళ్ళ అమ్మకి బాగోలేదని హాస్పిటల్ కి వెళ్లలేదా అని మనసులో అనుకుని అలాంటి చెప్పులు వంద ఉంటాయని సర్ది చెప్తుంది.
Also Read: నిజం తెలుసుకున్న వేద, సవతితో సమరం మొదలైంది - పెళ్ళాన్ని చూసి వణికిపోతున్న అభిమన్యు
ముకుంద ఫామ్ హౌస్ కి వెళ్ళి ఉంటుంది ఈ విషయం ఖచ్చితంగా తేల్చుకోవాలని అనుకుంటుంది. మురారీ గోపి దగ్గరకి వస్తాడు. తను బాధగా ఉండేసరికి ఏమైందని అడిగి మందు తాగడానికి కూర్చుంటారు. మురారీ తన బాధ చెప్పుకుంటాడు. నేను తప్పు చేశానా? అని అడుగుతాడు. తప్పే కాదు ముకుంద విషయం లైట్ తీసుకోమని గోపి చెప్తాడు. కృష్ణకి తన ప్రేమ విషయం చెప్పలేకపోయాను తనని హర్ట్ చేశాను. తన దగ్గర నిజం దాచి తప్పు మీద తప్పు చేస్తున్నానని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. కృష్ణకి నిజం చెప్పేయమని గోపి సలహా ఇస్తాడు. చెప్పేస్తాను తను కోపంతో ఎలాంటి శిక్ష వేసినా భరిస్తానని చెప్తాడు. నేను చెప్పింది అది కాదు నీ ప్రేమ సంగతి చెప్పు ఆ తర్వాత ముకుంద గురించి చెప్పవచ్చని అనుకుంటాడు.