News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brahmamudi August 28th: సహనంతో ఇంట్లో ఉంటానంటూ రుద్రాణికి మాటిచ్చిన కావ్య.. ఫేక్ ప్రెగ్నెన్సీ కోసం తిప్పలు పడుతున్న స్వప్న?

స్వప్న ఫేక్ ప్రెగ్నెన్సీ కోసం కొన్ని ప్లాన్స్ చేయటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

Brahmamudi August 28th: కావ్య ఇంట్లో వాళ్ళందరికీ టీ ఇస్తుండగా అందరూ తనను పట్టించుకోనట్లు ప్రవర్తిస్తారు. ఇక అపర్ణ అక్కడికి రాగా తనకి కూడా టీ ఇస్తుంది. అదే సమయంలో ధాన్యలక్ష్మి ఎవరి పనిలో వాళ్లే చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు పడితే వాళ్ళు టీ ఇస్తే తీసుకొని అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళు తనని దూరం పెడుతున్నారు అని కావ్య అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత అప్పు కళ్యాణ్ బైకు ని వేలం వేస్తూ ఉండగా అక్కడికి కళ్యాణ్ వచ్చి ఏం చేస్తున్నావంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు.

బండి వేలం వేస్తున్నాను అని అనటంతో అది నా బండి అంటూ కంగారు పడుతూ ఉంటాడు కళ్యాణ్. దాంతో అప్పు కాస్త వెటకారం చేస్తూ ఉంటుంది. ఇక తనకు సారీ చెప్పటంతో దానికి అప్పు ఒప్పుకుంటుంది. ఇక మీ సువర్ణ సుందరి కథ చెప్పు అని అప్పు అడగటంతో.. సువర్ణ సుందరి కాదు మరొక సుందరి అంటూ జరిగిన విషయాలన్నీ చెబుతాడు. దాంతో అప్పు నవ్వుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆటోలో అక్కడి నుంచి బయలుదేరుతారు.

మరోవైపు కావ్య రుద్రాణి దగ్గరికి వెళ్లగా ఇక తను నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి.. ఒకటి మా వదిన కాళ్ళ కింద బానిసలాగా బతకడం.. మరొకటి పుట్టింటికి వెళ్ళిపోయి మట్టి పిసుకుంటూ బ్రతకడం అని అంటుంది. దాంతో కావ్య రెండు ఆప్షన్లు కాదు మూడో ఆప్షన్ కూడా ఉంది అంటూ అది సహనం అని.. ఆ సహనంతోనే నేను అన్ని సాధిస్తాను అని ధైర్యంగా చెబుతుంది. ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ సహనంతో ఎన్నాళ్లు కాపురం చేస్తావో చూస్తాను అని అనుకుంటుంది రుద్రాణి.

ఇక స్వప్న డాక్టర్ కి ఫోన్ చేసి తనకి ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాలేదు అని మళ్లీ చెక్ చేసుకోవాలా అని అడగటంతో.. నువ్వు ఎన్నిసార్లు చెక్ చేసిన లాభం లేదు.. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాలేదు.. ప్రెగ్నెన్సీ రావాలి అంటే మళ్ళీ రాహుల్ తో కమిట్ అవ్వాలి అని చెబుతుంది. ఇక తనకు అంత టైం లేదు అని అనటంతో.. లేదంటే పొట్ట పెద్దదిగా కనిపించేలాగా ప్రయత్నించు అంతేకానీ నా టైం వేస్ట్ చేయొద్దు అని ఫోన్ కట్ చేస్తుంది ఆ డాక్టర్.

దాంతో ఇప్పుడు పొట్ట పెద్దదిగా కనిపించాలంటే ఏం చేయాలి అని ఆలోచనలను పడుతూ ఉండగా తనకు ఒక ఐడియా వస్తుంది. ఇక కావ్య తన గదిలోకి వెళ్ళాక రాజ్ సీరియస్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడడు. దాంతో కావ్య మీ అమ్మగారు మాట్లాడుతూ ఉన్నారా అని ప్రశ్నించడంతో.. అలా ఏమీ లేదు అంటూ పేపర్ల మీద రాసి గోడ మొత్తం నింపుతాడు. చివరికి కావ్య మొహానికి కూడా అంటించి అక్కడి నుంచి వెళ్తాడు.

దాంతో కావ్య ఆఫీస్ లో ఏమైనా ప్రాబ్లమేమో అని శృతికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక తను జరిగిన విషయం చెబుతుంది. దాంతో కావ్య ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారో చేయని ముందైతే డీటెయిల్స్ పంపించు అని అంటుంది. ఇక కావ్య తన కడుపు పెద్దదిగా కనిపించడం కోసం 5 కేజీల బిర్యానీని ముందర పెట్టుకొని బాగా తింటూ ఉంటుంది. అది చూసి ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. ఇక తరువాయి భాగంలో కావ్య దంపతుల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. వెంటనే రాజ్ నీకు నాకు వాదన ఏంటి నేను నీ భర్తని అనటంతో వెంటనే కావ్య సంతోషంగా కనిపిస్తుంది.

also read  it : Trinayani August 26th: పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న సుమన.. విశాల్ ను చంపే ప్రయత్నంలో తిలోత్తమా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 28 Aug 2023 11:00 AM (IST) Tags: Brahmamudi Serial Brahmamudi Telugu Serial Brahmamudi star maa serial Brahmamudi star maa serial.

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్

Brahmamudi September 28th: కనకమా మజాకా, స్వప్న సేఫ్- అమ్మాకొడుక్కి అదిరిపోయే షాక్!

Brahmamudi September 28th: కనకమా మజాకా, స్వప్న సేఫ్- అమ్మాకొడుక్కి అదిరిపోయే షాక్!

Guppedanta Manasu September 28th: KGF బ్యాంగ్రౌండ్ తో పిండేశారు, అమ్మా అని పిలిచిన రిషి - శైలేంద్ర దొరికిపోతాడా

Guppedanta Manasu September 28th: KGF బ్యాంగ్రౌండ్ తో పిండేశారు, అమ్మా అని పిలిచిన రిషి - శైలేంద్ర దొరికిపోతాడా

Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్

Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్

టాప్ స్టోరీస్

TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

TS Cabinet Agenda :  ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన