అన్వేషించండి

Karthika Deepam Today March 28th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ను అసహ్యించుకున్న దీప - బావ కోసం జ్యోత్స్న అలక!

Karthika Deepam 2 Serial: జాతరలో దీపని చూసిన కార్తీక్ తన కోసం ఊరంతా గాలించడంతో ఇవాళ్టి ఎసిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode: దీప సైకిల్ పోటీల్లో పాల్గొంటుంది. అందరూ మగవాళ్లలో తానొక్కర్తి ఆడది అని అక్కడ ఉన్న వారు అంతా దీపని చులకన చేసి మాట్లాడుతారు. అవేవీ దీప పట్టించుకోకుండా పోటీల్లో పాల్గొని అందరి కంటే ముందంజలో ఉంటుంది. అయితే పోటీ నిర్వాహకులు మొదటి బహుమతి ఫ్రిడ్జ్, రెండో బహుమతి వాషింగ్ మెషిన్, మూడో బహుమతి సైకిల్ అని చెప్తారు. అది వినగానే సౌర్య సైకిల్ కొనమన్న మాట గుర్తొచ్చి దీప కావాలనే మూడో స్థానం కోసం ఆగిపోయి ఆ స్థానం దక్కించుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న అందాల పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి మిస్ హైదరాబాద్ కిరీటాన్ని సొంతం చేసుకుంటుంది. 

ఇక బహుమతులు ఇవ్వడానికి బిజినెస్‌మాన్ కార్తీక్ బాబు వస్తాడు. దీపకు కార్తీక్ కనిపించడు. ఇక మూడో స్థానంలో గెలిచిన దీపక్కకు సైకిల్ బహుమతి తీసుకోమని నిర్వాహకులు పిలుస్తారు. దీప బహుమతి తీసుకోవడానికి వెళ్తూ కార్తీక్‌ను చూసి ఆగిపోతుంది. ఇక కార్తీక్‌ కూడా దీపని చూసి షాక్ అయిపోతాడు. ఇష్టం లేకుండానే దీప బహుమతి తీసుకోవడానికి వెళ్తుంది. కార్తీక్‌ను చూసి చిరాకు ముఖం పెడుతుంది.

నిర్వాహకుడు: సార్ దీపక్క మా ముత్యాలమ్మ ఊరిలో మా అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణ సార్. వంటలు బాగా చేస్తుంది.
కార్తీక్: సైకిల్ దీపకు ఇస్తూ.. ఆ తప్పు నేను చేయలేదు. నన్ను నమ్మండి.
దీప: నేను నమ్మను నన్ను నమ్మించలేరు బాబుగారు. అని హడావుడిగా సైకిల్ తీసుకొని వెళ్లిపోతుంది.
సౌర్య: సైకిల్ కోసం నా కోసం కావాలనే మూడో స్థానంలోకి వచ్చావు కదా..

కార్తీక్ దీప గురించి ఆలోచిస్తాడు. దీప మాటలు తలచుకొని మాట్లాడే అవకాశం ఉండి ఉంటే జరిగిందంతా వివరించే వాడిని అని తనలో తాను అనుకుంటాడు. నిర్వాహకులు ఏం మాట్లాడిని కార్తీక్ వినిపించుకోడు. 
కార్తీక్: తను ఇప్పుడే వెళ్లింది కదా ఇక్కడే ఎక్కడో ఉంటుంది. తనని ఎలా అయినా కలిసి జరిగిందంతా చెప్పాలి. సైట్‌ని రేపు విజిట్ చేద్దాం. అని నిర్వాహకులకు చెప్పి డ్రైవర్‌ని పంపేసి తాను దీప కోసం వెళ్తాడు.

ఇక దీప కూడా కార్తీక్ మాటలు తలచు కొని బాధ పడుతుంది. ఇక దీప సౌర్యకు జాగ్రత్తలు చెప్తుంది. మరోవైపు కార్తీక్ కారులో తిరుగుతూ దీప గురించి వెతుకుతాడు. దీప వాళ్లు కూడా అటుగా వస్తారు. కానీ ఒకరికి ఒకరు ఎదురవ్వరు.

కార్తీక్: ఇటే వచ్చారు కదా ఇంతలో ఎటు వెళ్లిపోయారు. వెతుకుతా.. తను కనిపిస్తే కానీ నేను వెళ్లలేను. మనసులో మాట చెప్పి అప్పుడు తను నన్ను క్షమిస్తే కానీ ఇంటికి వెళ్లను. 

మరోవైపు జ్యోత్స్న కిరీటం పెట్టుకొని ఇంటికి వస్తుంది. ఇక తన నానమ్మ పారిజాతం పొగిడేస్తుంది. 

శివనారాయణ: చక్కగా నడిచావ్.. చక్కగా మాట్లాడావ్ అందుకే గెలిచావ్ మనవరాలా.. 
జ్యోత్స్న: థ్యాంక్యూ తాతయ్య... ఇక పారిజాతం మనవరాలికి దిష్టి తీస్తుంది. 
శివనారాయణ: సైదులు గాడు ఇలాగే అమ్మగారు అమ్మగారు అని తిరిగాడు కానీ లారీ గుద్ది చనిపోయాడు. ఇప్పుడు వాడి కొడుకు నీ దగ్గర మళ్లీ అదే నామస్మరణతో తిరుగుతున్నాడు.
పారిజాతం: మనసులో.. వాడిని నేనే చంపించా అది ఇప్పుడు వాడి కొడుకును నా కాళ్ల దగ్గర పెట్టుకున్నా ఈ విషయం ఎవరికీ తెలీదు మిస్టర్ శివనారాయణ.

జ్యోత్స్నకు కార్తీక్ తల్లిదండ్రులు కంగ్రాట్స్ చెప్పినా వినిపించుకోదు. దీంతో జ్యోత్స్నను తన తల్లి సీరియస్‌గా పిలుస్తుంది. ఏమైంది నీకు నువ్వు రాగానే మీ అత్తయ్య మామయ్య విష్ చేశారు నువ్వు రిప్లే ఇవ్వలేదు. మీ శ్రీధర్‌ మామయ్య మాట్లాడాలి అని చూశారు నువ్వు పట్టించుకోలేదు. కిరీటంతో పాటు కళ్లు కూడా తలకు ఎక్కాయా అని అడుగుతుంది. దీంతో కార్తీక్ తల్లి వదినా నా కోడల్ని ఏమీ అనొద్దు అని అంటుంది. దీంతో జ్యోత్స్న అవును అనాల్సింది నన్ను కాదు మిమల్ని అంటుంది. అందరూ షాక్ అవుతారు.
శ్రీధర్: మేమేం తప్పు చేశాం అమ్మ.
జ్యోత్స్న: అవును చాలా పెద్ద తప్పు చేశారు. బావ ఎక్కడ. మీ ముద్దుల కొడుకు కార్తీక్ ఎక్కడ. ఇక్కడ మనమే పెద్ద బిజినెస్ చేస్తుంటే సార్ లండన్‌లో కూడా బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ చేస్తున్నారు. నాకు మాత్రం మెసేజ్ చేయడు. 
శివనారాయణ: వాడు ఏం చేసినా డబ్బు కోసమే కదా అమ్మ. ఆ డబ్బుతో పది మందికి సాయం చేస్తాడు. 
జ్యోత్స్న: అవన్నీ నాకు తెలీదు తాతయ్య నాకు విష్ చేయడానికి ఇక్కడ బావ లేడు. దట్స్ ఆల్.. మిస్ హైదరాబాద్ కాదు తాతయ్య, మిసెస్ కార్తీక్ కావడమే నా ఎచీవ్ మెంట్.
శ్రీధర్: నా కోడలు అలిగింది బాబు అంటే ఆ అలక నీ కొడుకే తీర్చాలి బావ అని దశరథ అంటాడు. మరోవైపు జ్యోత్స్న అలక తీర్చమని శివనారాయణ ఇంట్లో వాళ్లకి చెప్తాడు.

ఇక సౌర్య సైకిల్‌తో ఇంటికి వచ్చి నా కొత్త సైకిల్ ఎలా ఉంది అని అంటుంది. ఈ సైకిల్ కొనడానికి డబ్బు ఎక్కడిది అని అనసూయ అడుగుతుంది. దీంతో సౌర్య పోటీల గురించి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎసిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సిద్ధార్థ్, అదితి: ట్విస్ట్ ఇచ్చిన సిద్ధూ, అదితి - పెళ్లి కాదు, కానీ పెళ్లికి ముందు ఓ అడుగు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Embed widget