అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today June 8th: కార్తీకదీపం 2 సీరియల్: దీపకు ఫోన్ కొనిచ్చిన కార్తీక్.. ఆమెను ఇంటి నుంచి పొమ్మన్న సుమిత్ర, పారిజాతం ప్లాన్ తిప్పికొట్టిన కార్తీక్!

Karthika Deepam 2 Serial Today Episode దీపని ఇంటి నుంచి పంపించడానికి పారిజాతం దీప చేసిన పాయసంతో వాంతులు వచ్చేలా మందు కలపడం అది కార్తీక్ చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ తనని తొంగి తొంగి చూడటం దీప గమనిస్తుంది. తర్వాత కార్తీక్ ఎదురుగా వచ్చి నిల్చొంటుంది. కార్తీక్ షాక్ అవుతాడు. దీప ఏమైంది బాబు నన్ను చూసి నవ్వుతున్నారు. నేను చూస్తుంటే ముఖం తిప్పేస్తున్నారు. ఏమైంది అని అడుగుతుంది. కార్తీక్ మిమల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి అని ఉందని అంటాడు. 

కార్తీక్: రాత్రి రౌడీని నాకు అప్పగించి మీరు ఎక్కడికి వెళ్లారో నాకు అర్థమైంది. మీ అత్తయ్య గారు కనిపించారు. మొత్తం చెప్పారు. రాత్రి వాళ్లకు నవరాత్రులు చూపించారు అంట కదా. బిడ్డ జోలికి వస్తే ఏ ప్రాణి ఊరుకోదు అండి. అదే మీరు వాళ్లకి అర్థమయ్యేలా చెప్పారు. మీలో ఈ మార్పు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మనస్ఫూర్తిగా మెచ్చుకోవడానికి మీ దగ్గరకి రాలేక ఇక్కడ నుంచే ఇలా చూస్తున్నా.
దీప: అది నేను కావాలి అని చేయలేదు బాబు. వాడు నా కూతురిని ఏమైనా చేస్తాడా అని అలా చేశాను. నా బిడ్డ బాధకు వాడు కారణం అయితే వాడు భర్త అయినా సరే నేను ఊరుకోను. వాడు నన్ను బాధ పెట్టాలి అంటే వాడే నా కూతురికి తండ్రి అని చెప్తే చాలు నా కూతురు నన్ను ప్రశ్నిస్తుంది. నేను సమాధానం చెప్పలేను. దాని వయసుకి తండ్రి గురించి కొన్ని కలలు ఉంటాయి. అవన్నీ తప్పు అని తెలిస్తే అది ఏమైపోతుందో. నేను వాడికి చెప్పాల్సిన పద్ధతిలోనే చెప్పాను. వాడు నా జోలికి రాడు. మీరు ఈ విషయం వదిలేయండి.
కార్తీక్: ఈ సమస్య మీ వల్లే దీప. అందుకు దీనికి నేను ఓ పరిష్కారం చూశా.. మీకోసం నేను ఓ ఫోన్ తీసుకొచ్చాను. మీకు రౌడీ ఫోన్ చేయొచ్చు. మీరు రౌడీకి ఫోన్ చేయొచ్చు.
దీప: నాకు వద్దు బాబు నేను కొనుక్కుంటాను.
కార్తీక్: నేను కొన్నాను. తయారు చేయలేదు. మీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నాకు తెలుసు దీప. కానీ ఈ ఫోన్ లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది. ఇదే ఉంటే ఏం అవ్వదు కదా. ఒక పని చేయండి నా దగ్గరే మీరు ఈ ఫోన్ కొనుక్కోండి. 

దీప వద్దు అనడంతో తనకు ఇవ్వాల్సిన డబ్బులతో కలిపి ఈ డబ్బులు కూడా ఇవ్వండి అని అంటాడు కార్తీక్. దీప సరే అని తీసుకుంటుంది. ఇక శౌర్య కార్తీక్ దీపకి ఫోన్ ఇవ్వడం చూసి బర్త్‌డే జ్యోగ్రానీది అయితే కార్తీక్ మా అమ్మకి సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు ఏంటి. తర్వాత కార్తీక్ దీపకు కాల్ చేసి అది తన నెంబరే అని సేవ్ చేసుకోమని అంటాడు. దీప అలాంటి అవసరం రాకూడదు అంటుంది.

పారిజాతం బర్త్‌డేకి కేకు రెడీ చేస్తారు. ఇక శివనారాయణ పారు కోరిక ఏంటని అడుగుతాడు. పారిజాతం దీపని కూడా పిలుస్తుంది. పాయసం తీసుకురమ్మని అది తిన్నాక కేక్ కట్ చేస్తాను అని అంటుంది. మనసులో.. నీ స్పెషల్ పాయసానికి ఇదే ఆఖరి రోజు అనుకుంటుంది. దీప అందరికీ పాయసం ఇస్తుంది. సుమిత్ర పాయసం నోట్లో పెట్టి అది చెండాలంగా ఉందని చేయడం ఇష్టం లేకపోతే మానేయ్ మని సుమిత్ర తిడుతుంది. అందరూ తమకు కూడా వాంతులు వచ్చేలా ఉన్నాయని అనుకుంటారు. సుమిత్ర కోప్పడుతూ దీపని ఇంటి నుంచి వెళ్లిపోమని అంటుంది. అయింది బాగా అయింది అని పారు గంతులేస్తుంది. తీరా చూస్తే అదంతా పారు కల. 

పారుని చూసి అందరూ షాక్ అవుతారు. శివనారాయణని పారుని తట్టి లేపి ఏమైందని అడుగుతాడు. జరగబోయేది ముందే ఊహించుకున్నాను అన్నమాట అనుకుంటుంది. తర్వాత దీప అందరికీ పాయసం తీసుకొని వచ్చి ఇస్తుంది. అందరూ తెగ పొగిడేస్తారు. అందరూ రెస్టారెంట్ స్టైల్ వచ్చిందని అంటారు. కార్తీక్ పారు దగ్గరకు పాయసం తీసుకెళ్లి తినమంటాడు. పారు తినను అంటే భయపడుతున్నావా ఇందులో ఎవరైనా ఏమైనా కలిపి ఉంటారని అని అడుగుతాడు. ఇక ఫ్లాష్‌బ్యాక్‌లో పారిజాతం దీప చేసిన పాయసంలో వాంతులు రావడానికి ఏదో కలుపుతుంది. అది కార్తీక్ చూస్తాడు. దీపని పంపడానికే ఇలా చేస్తుందని ఆరోజు డైమండ్ నెక్లస్ కూడా పారిజాతమే దీప మీద నింద వేసుంటుందని అనుకుంటాడు. ఇక పారుతో నువ్వు ఇలా చేస్తావ్ అనుకోలేదు. మనం తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. 

దీప కూడా నేను చేసిన పాయసంలా లేదే అనుకుంటుంది. ఇక జ్యోత్స్న పారు దగ్గరకు వచ్చి ఏదో చేస్తాను అన్నావ్ ఏంటి అది అని అడుగుతుంది. ఇక పాయసం అయిన తర్వాత కేక్ కట్ చేయమని అందరూ అడిగితే కోరిక అడుగుతాను అని పారిజాతం అంటుంది. ఇక పారిజాతం కార్తీక్, జ్యోత్స్నలను ఒక్క దగ్గరకు పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ గ్లౌజ్ వేసిన చేతిని తాకిన గాయత్రీపాప.. ఉలూచి కాళ్లకు ఉన్న సాక్స్‌ల వెనక రహస్యం ఉందన్న విక్రాంత్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
NEET Row: లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్
లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
NEET Row: లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్
లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్
Vijay Devarakonda: 'నాకు ఇష్ట‌మైన వాళ్ల కోసం ఈ సినిమా చేశాను'.. అర్జునుడి పాత్ర‌పై దేవ‌ర‌కొండ‌ రియాక్ష‌న్
'నాకు ఇష్ట‌మైన వాళ్ల కోసం ఈ సినిమా చేశాను'.. అర్జునుడి పాత్ర‌పై దేవ‌ర‌కొండ‌ రియాక్ష‌న్
Andhra Pradesh : ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
Telangana : తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
Jay Shah: తదుపరి కోచ్‌పై జై షా కీలక వ్యాఖ్యలు,  ఛాంపియన్స్‌ ట్రోఫీకి సీనియర్లు
తదుపరి కోచ్‌పై జై షా కీలక వ్యాఖ్యలు, ఛాంపియన్స్‌ ట్రోఫీకి సీనియర్లు
Embed widget