అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today June 28th: కార్తీకదీపం 2 సీరియల్: బిజినెస్ బాబుకి ఎన్ని తిప్పలొచ్చాయ్.. తండ్రి గురించి చెప్తూ దీపని చూపించి ఏడిపించేసిన శౌర్య!

Karthika Deepam 2 Serial Today Episode ఫాదర్స్ డే ఫంక్షన్‌లో శౌర్య తన తండ్రి గురించి అద్భుతంగా చెప్పి చివర్లో తన తల్లే తనకు తండ్రి అని అందరినీ ఏడిపించేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శౌర్య స్కూల్‌ దగ్గర ఫాదర్స్‌డే సెలబ్రేషన్స్ మొదలవుతాయి. జ్యోత్స్న కూడా వస్తుంది. దీప పక్కనే కూర్చుంటుంది. కార్తీక్ గురించి శౌర్య జ్యోత్స్నని అడుగుతుంది. నర్శింహ కూడా స్యూల్ దగ్గరకు వస్తాడు. నర్శింహ ఫాదర్స్ డే రోజే తానే శౌర్యకి తండ్రి అని చెప్పడం చాలా బాగుందని అనుకుంటాడు. దీప వాళ్లని చూస్తాడు..

నర్శింహ: దీప, పాప వచ్చారు సార్ ఇంకా రాలేదు ఏంటి. ఈపాటికే గురువుగారి దర్శనం అవ్వాలి కదా. మనం టైం చూసి తగులుకుందాంలే. అని దీప వాళ్లకి దగ్గర్లో కూర్చొంటాడు.
కార్తీక్: అప్పుడే వస్తూ.. జ్యోత్స్న, నర్శింహని చూస్తాడు.. జ్యోత్స్న వచ్చిందే ఇప్పుడు నన్ను చూస్తే అపార్ధం చేసుకుంటుంది. ఆ నర్శింహ గాడు ఇక్కడే ఉన్నాడు. వీడికి ఎదురు పడితే కచ్చితంగా గొడవ అవుతుంది. శౌర్య ఇక్కడే ఉంది కాబట్టి నర్శింహ తండ్రి అని తెలిసిపోతుంది. దీప ఏదైతే తన బిడ్డకు తెలీకూడదు అనుకుంటుందో అది నా వల్లే తెలిసిపోతుంది. అలా జరగకూడదు. అని శౌర్య దగ్గరకు వెళ్లకుండా దక్కుంటాడు. ఇక్కడ నేను ఉండకూడదు సారీ శౌర్య.

ఇక తండ్రి గురించి చక్కగా రాసి శౌర్య మొదటి ప్లేస్ దక్కించుకుంటుంది. శౌర్య భయపడుతూనే పైకి వెళ్తుంది. ఇక ప్రిన్సిపల్ శౌర్యకి తన తండ్రి గురించి రాసింది చెప్పమని అంటాడు. దానికి దీప తన తండ్రి మంచోడు అని తప్ప ఇంకేం చెప్పలేదు కదా అంత చక్కగా శౌర్య ఏం రాసుంటుందని దీప అనుకుంటుంది. 

శౌర్య: అందరికీ ఉన్నట్లే నాకు నాన్న ఉన్నాడు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ప్రేమగా చూసుకుంటాడు. 
నర్శింహ: ప్రేమగా చూసుకుంటాడు.
జ్యోత్స్న: తండ్రి ఎవరో తెలీదు అన్నావ్ మరి తండ్రి గురించి ఎలా చెప్తుంది.
నర్శింహ: దీనికి నేను తెలీనప్పుడు మరి ఏ తండ్రి గురించి చెప్తుంది. 
దీప: శౌర్య ఎవరి గురించి చెప్తుంది. 
శౌర్య: నేను అలిగితే మా నాన్న నన్ను బుజ్జగిస్తాడు. అడిగితే నా కోసం ఏదైనా సరే వెంటనే కొనిస్తాడు. నాకు చీకటి అంటే భయం కానీ మా నాన్న చేయి పట్టుకుంటే చీకటిలో కూడా నడుస్తాను. మా నాన్న నన్ను తన భుజాలు మీద ఎక్కించుకొని తిప్పుతాడు.
జ్యోత్స్న: ఇది ఎవరి గురించి చెప్తుంది. 
దీప: శౌర్య ఎవరి గురించి మాట్లాడుతుంది.
నర్శింహ: నేను కాకుండా ఆ ఇంకో నాన్న ఎవరబ్బా.
శౌర్య: నాకు ఆకలి అని చెప్పకుండానే కథలు చెప్పి తినిపిస్తాడు. నిద్ర పుచ్చుతాడు. కళ్లు తెరిచి చూస్తే మా నాన్న ఒడిలో పడుకుంటాను. మా నాన్న ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు. నన్ను నవ్విస్తాడు. మా నాన్న సూపర్ మ్యాన్. మా నాన్న హీరో. 
ప్రిన్సిపల్: నువ్వు చెప్తుంటే మీ నాన్నని చూడాలి అని ఉంది. మీ నాన్న ఎక్కడ ఉన్నారు.
శౌర్య: ఇక్కడే ఉన్నాడు.
దీప: ఇక్కడే ఉండటం ఏంటి. కార్తీక్ బాబు శౌర్యతో నర్శింహ తండ్రి అని చెప్పేశాడా. 
నర్శింహ: నేను తండ్రి అని తెలియనప్పుడు మరి దీనికి తెలిసిన తండ్రి ఎవరు. కొంపతీసి దీప కార్తీక్ తండ్రి అని చెప్పిందా ఏంటి. 
కార్తీక్: రౌడీకి తండ్రి ఎవరో తెలిసిపోయిందా.
శౌర్య: నాన్న నువ్వు ఇక్కడికి రా నాన్న. 

నేనే మా నాన్నని వెళ్లి తీసుకొస్తాను అని శౌర్య దీప దగ్గరకు వెళ్తుంది. దీపని తీసుకొని స్టేజీ మీదకు వెళ్తుంది.  తనని మంచిగా చూసుకొనే తన తండ్రి తన తల్లే అని శౌర్య చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఏం ట్విస్ట్ ఇచ్చావే అని జ్యోత్స్న అనుకుంటుంది. తనకు తండ్రి, సూపర్ మ్యాన్, హీరో అన్నీ తనకు తన తల్లే అని శౌర్య అంటుంది. తనకు తండ్రి ఎలా ఉంటాడో తెలీదని తనకు అమ్మ అయినా నాన్న అయినా అన్నీ తన తల్లి అని అంటుంది. తన తల్లి టిఫెన్ సెంటర్‌లో పని చేస్తుందని తన తల్లి కష్టాలు అందరికీ చెప్తుంది. 

శౌర్య: అమ్మ నన్ను ఆటోలో స్కూల్‌కి దింపి తాను నడిచి వెళ్లుంది. ఆ మిగిల్చిన డబ్బులతో సాయంత్రం నన్ను ఆటోలో ఇంటికి తీసుకెళ్తుంది. నాకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ తినిపిస్తుంది. తనకి తినమంటే ఇప్పుడే తిన్నాను అని అబద్ధం చెప్పి మొత్తం నాకే తినిపిస్తుంది. నాకు కొత్త షూ కొంటుంది. తను మాత్రం తెగిపోయిన పాత చెప్పులు వేసుకుంటుంది. నాకు కొత్త బట్టలు కొంటుంది. తను మాత్రం పాత చీరలే కట్టుకుంటుంది. తర్వాత కొనుక్కుంటా అంటుంది. కానీ అది అబద్ధం అని నాకు తెలుసు. మా అమ్మ ఒక్కర్తే కూర్చొని బాధ పడుతుంది. ఏమైంది అమ్మ అని అడిగితే వెంటనే నవ్వేసి ఏం లేదు అని నన్ను గట్టిగా పట్టుకొని అటు తిరిగి నవ్వేస్తుంది. నేను ఒకసారి అద్దంలో చూశాను. అమ్మ నా కోసం చాలా కష్ట పడుతుంది. అవి నాకు తెలీకూడదు అనుకుంటుంది. కానీ అవన్నీ నాకు తెలుసు. నా కోసం ఇన్ని చేసే నువ్వే నాకు సూపర్ హీరో.. హ్యాపీ ఫాదర్స్ డే అమ్మ. 

దీప ఎమోషనల్ అయిపోతుంది. ఇక దీప ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అని అడుగుతుంది. దానికి శౌర్య కార్తీక్ అని చెప్తుంది. అమ్మ తర్వాత కార్తీక్‌నే అన్నీ తనకని చెప్తుంది. కార్తీక్‌కి తను అంటే చాలా ఇష్టమని తనని రమ్మన్నాను అని కార్తీక్ నువ్వు ఇక్కడికి వచ్చావా నా మాట వింటున్నావా.. వస్తే ఇక్కడికి రావా అని పిలుస్తుంది. శౌర్య మాటలకు కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. ఇక జ్యోత్స్న శౌర్య, కార్తీక్‌ల మధ్య స్నేహాన్ని అడ్డు పెట్టుకొని దీప కార్తీక్‌ని దగ్గర చేసుకుంటుందని అనుకుంటుంది. ఇక జ్యోత్స్న శౌర్య, కార్తీక్‌లను విడదీయాలి అనుకుంటుంది. టీచర్స్ దీపని పొగిడేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: లలితాదేవి రూపంలో వచ్చింది తిలోత్తమ అని కనిపెట్టేసిన నయని.. గన్‌తో హల్‌చల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget