Karthika Deepam 2 Serial Today April 26th: కార్తీకదీపం 2 సీరియల్: దీప సాక్ష్యంతో జ్యోత్స్న అరెస్ట్, చేతులెత్తేసిన పోలీసులు.. పారిజాతం ఫైర్!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న ఫుల్లుగా తాగి యాక్సిడెంట్ చేయడంతో పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ మాటలకు జ్యోత్స్నను తన ఫ్రెండ్స్ రెచ్చగొడతారు. మీ బావకు నువ్వు అంటే ఇష్టం లేదని ఎక్కిస్తారు. దీంతో జ్యోత్స్న ఫుల్లగా తాగేస్తుంది. మా మైకంలోనే కారు డ్రైవింగ్ చేస్తూ ఇంటికి వస్తుంది. జ్యోత్స్నను దీప చూస్తుంది. జ్యోత్స్న మత్తులో ఉండటం చూసి దీప జ్యోత్స్న దగ్గరకు పరుగు వెళ్లి పట్టుకుంటుంది.
జ్యోత్స్న: నువ్వు పట్టుకున్నావా దీపక్క.
దీప: ఏమైంది జ్యోత్స్న.
జ్యోత్స్న: ఏం కాలేదు అక్క ఐయామ్ స్టడీ.. బావ వచ్చాడా.. రాలేదు కదూ. బావకి నేను అంటే ప్రేమ లేదు.
దీప: నువ్వు మందు తాగావా..
జ్యోత్స్న: ఎస్ తాగాను. బావ కోసమే తాగాను.. పర్వాలేదు అక్క వదిలేయ్.
దీప: వదిలేస్తే నువ్వు పడిపోయేలా ఉన్నావ్ అని లోపలికి తీసుకెళ్లి పెడుకోపెడుతుంది. పారిజాతం అది చూస్తుంది.
పారిజాతం: ఎప్పుడూ లేనిది ఇంత తాగింది ఏంటి పక్కన దీప ఉంది కదా ఇప్పుడు వెళ్లడం కరెక్ట్ కాదు రేపు ఉదయం మాట్లాడుదాం..
జ్యోత్స్న: బావా నన్ను వదిలేసి వెళ్లిపోయావా..
దీప: ఈ అమ్మాయికి తాగే అలవాటు కూడా ఉందా ఈ విషయం రేపు సుమిత్ర అమ్మగారికి చెప్పాలి.
మరోవైపు అనసూయ సిటీకి వచ్చేస్తుంది. టీ తాగుతుంది. తర్వాత తన కొడుకు గురించి అడుగుతుంది. టీ కొట్టు అతను తెలీదు అని అంటుంది. ఇక అనసూయ డబ్బులు ఇవ్వకుండా వెళ్లబోతుంది. దీంతో షాప్ వాడు పిలిచి అడగడంతో అతడిని తిట్టుకొని డబ్బులు ఇస్తుంది.
మరోవైపు బంటు, పారిజాతం బాల్యానీలో ఉంటారు. ఇంతలో పోలీసులు ఇంటికి వస్తారు. ఇద్దరూ తమ కోసమే వచ్చారని టెన్షన్ పడతారు. ఇక దశరథ, సుమిత్రలు అక్కడికి వస్తే జ్యోత్స్న కారుని పరీక్షించి జ్యోత్స్నను పిలవమని పోలీసులు పిలుస్తారు. జ్యోత్స్న వస్తుంది.
జ్యోత్స్న యాక్సిడెంట్ చేసిందని పోలీసులు చెప్తారు. ముగ్గురికి గాయాలు అయ్యాయని ఒకరి కండీషన్ సీరియస్ అని పోలీసులు చెప్తారు. దీంతో పారిజాతం బంటుని కొట్టి వాడే కారు నడిపాడు అని బంటుని అరెస్ట్ చేయమని అంటుంది. ఇంతలో దీప కూడా అక్కడికి వస్తుంది. దీప అడ్డుకొని బంటు నడపలేదు. జ్యోత్స్న కారు నడిపిందని అందరికీ చెప్తుంది.
పారిజాతం: మధ్యలో దూరి సమాధానం చెప్తున్నారు నిన్ను ఎవరు అడిగారు. పో లోపలికి.
సుమిత్ర: అత్తయ్య మీరు ఆగండి. దీప రాత్రి జ్యోత్స్న ఈ కారు తీసుకురావడం నువ్వు చూశావా.
దీప: ఏమైంది అమ్మ. చూశాను అమ్మ.
పారిజాతం: ఇది కొంప ముంచేలా ఉంది.
పోలీసులు: వచ్చినప్పుడు తను ఎలా ఉంది చూశారా.
దీప: చూశాను సరిగా నడవలేకపోతుంటే తీసుకెళ్లి పడుకోపెట్టాను. ఇంతకీ ఏం జరిగింది అండీ.
పోలీసులు: ఈ అమ్మాయి ఫుల్లుగా తాగి యాక్సిడెంట్ చేసింది. నిజం చెప్పినందుకు థ్యాంక్స్ అమ్మా.
దీప పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. దీంతో పోలీసులు దీప మాటలతో యాక్సిడెంట్ చేసింది జ్యోత్స్న నే అని కన్ఫ్మం చేసుకుంటారు. తర్వాత పోలీసులు జ్యోత్స్నను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. పారిజాతం ఏడుస్తుంది. తన మనవరాలిని తీసుకెళ్లొద్దని బతిమాలు తుంది. భర్తతో చెప్పి ఏడుస్తుంది. ఇక వెనకాలే దశరథ్, ఆయన తండ్రి వెళ్తారు. పారిజాతం దీప వైపు కోపంగా చూస్తూ తన చేతిలో చచ్చిందని అనుకుంటుంది. ఇక సుమిత్ర కాంచన వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్తుంది.
కాంచన: కార్తీక్.. కార్తీక్.. ఓరేయ్ యాక్సిడెంట్ చేసింది అని కోడల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటరా..
శ్రీథర్: ఏంటి మన కోడల్ని పోలీసులు అరెస్ట్ చేశారా..
కాంచన: అవునండి.. ఇప్పుడే సుమిత్ర వదిన కాల్ చేసింది.
శ్రీథర్: కోడల్ని అరెస్ట్ చేయడం ఏంటి. కోడలు యాక్సిడెంట్ చేయడం ఏంటి.
కార్తీక్: మీరేం కంగారు పడకండి నేను వెళ్లి కనుక్కొని మీకు కాల్ చేసి చెప్తా.
కాంచన: ఏవండీ ఏం జరిగిందో ఏమో అని టెన్షన్‌గా ఉంది.
శ్రీథర్: ఏం కాదులే కాంచన ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు.
మరోవైపు దశరథ్, శివనారాయణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మాట్లాడుతారు. పోలీసులు కుదరదు పబ్లిక్ ఇష్యూ వల్ల మీడియా మొత్తం ఇక్కడే ఉందని ఏం సాయం చేయలేను అని సీఐ చేతులెత్తేస్తాడు. తన కూతురు కోర్టు బోనులో నిల్చోవడం తమ పరువుకి కూతురి భవిష్యత్‌కు ఇబ్బందని కాంప్రమైజ్ చేస్తాను అంటారు. ఇక మీడియా వాళ్లు మిస్ హైదరాబాద్ తాగి రచ్చ చేసిందని చెప్తారు. మరోవైపు దీప తాను తెలీకుండా చెప్పేశాను అని క్షమాపణ అడుగుతుంది. దీంతో పారిజాతం దీపను తిడుతుంది. నీ ప్రాణాలను కాపాడిందని దీన్ని నెత్తిన పెట్టుకున్నావ్ అని ఇప్పుడు నీ పరువు తీసిందని తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: మృణాల్ ఠాకూర్ 'రాయల్ ఎఫైర్' - ట్రెడిషల్ లుక్‌లో మతిపోగోడుతున్న మారాఠి భామ