Karthika Deepam 2 Serial Today April 11th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌తో దీప షాపింగ్, ఐడియా సూపర్.. భార్యబిడ్డని చూసిన నరసింహకు ఆ డౌట్ ఎందుకొచ్చిందబ్బా!
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode తన అత్త చెప్పింది అని దీపని కార్తీక్ షాపింగ్‌కు తీసుకెళ్లి ఓనర్‌ని లైన్‌లో పెట్టి బట్టలు కొనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam 2 Serial Today Episode : సౌర్య తనకు బట్టలు లేవు అని శివనారాయణతో చెప్పడంతో దీప సౌర్యకు క్లాస్ ఇస్తుంది. ఇక సౌర్య పండక్కి తన తండ్రి వస్తాడా అని ప్రశ్నిస్తుంది. దీంతో దీప తన తండ్రి రాడని మనమే వెళ్తామని చెప్తుంది. ఇప్పుడైతే మనం షాపింగ్‌కు వెళ్తామని అంటుంది. లోపలికి వెళ్లి చూస్తే దీప దగ్గర సరిపడా డబ్బులు ఉండవు. ఏం చేయాలా అనుకుంటుంది. ఇక సౌర్య తనకు ఎన్ని జతలు కొంటావు అంటే ఒక్కటే అని అది కూడా తనకి నచ్చిందే తీసుకుంటానని అల్లరి చేయొద్దని కూతురుకి చెప్తుతుంది. దీప తన దగ్గరున్న డబ్బులు సరిపోవు సౌర్యకి మాత్రమే తీసుకోవాలి అనుకుంటుంది.
ఇక సౌర్యని తీసుకొని రోడ్డు పక్కన ఉన్న షాపింగ్‌కు వెళ్తుంది. అక్కడ సౌర్యకు ఓ డ్రస్ సెలక్ట్ చేస్తుంది. ఇక ఆ డ్రస్ 350 అంటే దీప బేరాలు అడి 200 వందలకు ఇవ్వమని అంటుంది. షాప్ వాడు డబ్బులుండవు కానీ బేరాలు ఆడుతున్నారు అని గొడవ పడతాడు. పక్కకెళ్లమని తిడతాడు. దీంతో సౌర్య తన తల్లిని తిడతావా అని షాప్ వాడిని తిట్టి వాడి మీదకు రాయి విసరడానికి రెడీ అవుతుంది. అదంతా దూరం నుంచి కార్తీక్ చూస్తాడు. వచ్చి సౌర్య చేయిపట్టుకొని ఆపుతాడు. బట్టలు అమ్మేవాడిని తిడతాడు.
దీప: మేం బట్టలు కొనుక్కోవడానికి వెళ్లాలి. సౌర్య రా..
కార్తీక్: మేం వచ్చింది మీ కోసమే..
దీప: మేం రాం.
కార్తీక్: నన్ను మీ కోసమే అత్త పంపించింది.
సౌర్య: అమ్మమ్మ పంపిందా..
కార్తీక్: అవును. మీరు ఎండన పడి తిరుగుతున్నారు అని మీకు తీసుకెళ్లమని చెప్పింది. సరే మీరు వెళ్లండి నేను ఫోన్ చేసి అత్తకి చెప్తా ఆవిడే మీ కోసం వస్తుంది. ఇక్కడకు దగ్గరలోనే షాపింగ్ మాల్ ఉంది. అక్కడ ఇక్కడికంటే తక్కువ రేట్లు ఉంటాయి.
సౌర్య: అమ్మ తక్కువ అంట మనం కూడా వెళ్దాం పద అమ్మ.
కార్తీక్: ఇంత ఎండలో ఎక్కడ తిరుగుతారు. మీ కోసం మా అత్త కారు పంపింది. తక్కువ రేటులోనే మంచి బట్టలు వస్తాయి. ఓ దారిన పోయే ఆటో ఎక్కా అని ఆటో ఎక్కొచ్చు కదా..
సౌర్య: రా అమ్మ.. రా ..
కార్తీక్: నువ్వు రా మనం వెళ్దాం.
కార్తీక్ దీప, సౌర్యలను షాపింగ్ మాల్‌కి తీసుకెళ్తాడు. మాల్ చూసి సౌర్య నోరెళ్ల బెడుతుంది. ఇక దీప అయితే కార్తీక్‌తో మమల్ని అవమానించడానికి కాకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకొస్తారు అని అంటుంది. దీంతో కార్తీక్ మీరు కొనాలి అన్న రేట్ల కంటే ఎక్కువ ఉంటే వెళ్లిపోదురు రండి అని లోపలికి తీసుకొస్తాడు. సౌర్య షాపింగ్ మాల్ లోపల చూసి షాక్ అయిపోతుంది. ఇక మాల్‌లో ఉన్న దేవుడి విగ్రహం చూసి మన ముత్యాలమ్మ తల్లి మన కోసం ఇక్కడికి వచ్చిందని చెప్తుంది. ఇక సౌర్య అయితే అమ్మ దేవుడికి గుడిలో కాకుండా బట్టల షాపులో కూడా దేవుడు ఉంటాడా అని అమాయకంగా ప్రశ్నలు అడుగుతుంది.
కార్తీక్ షాపు ఓనర్ నెంబరు తీసుకొని దీప వాళ్లు ఏ బట్టలు తీసుకున్నా 90 శాతం డిస్కౌంట్ ఇవ్వమని అంటాడు. దీంతో దీప రెండు వేల రూపాయల డ్రస్‌ని రెండు వందలకు తీసుకుంటుంది. ఇక చీరలు కూడా తీసుకోమని చెప్పమని కార్తీక్ ఓనర్‌కి సైగ చేస్తాడు. ఓనర్ దీప చీరల దగ్గరకు తీసుకొని వెళ్తాడు. కార్తీక్ దీపని ఫాలో అవుతాడు.
కార్తీక్: ఇది నీ మీద జాలితో చేయడం లేదు దీప కొంతైనా మీరు హ్యాపీగా ఉంటారు అని చేస్తున్నా. నువ్వు క్షమించలేదు అని చెప్పి నీ పరిస్థితి చూసి ఏమీ చేయలేకపోతున్నందుకు ఇంకా బాధగా ఉంది.
ఇక దీప తనకు చీర, సౌర్యకు డ్రస్ తీసుకుంటుంది. ఓనర్‌కు కార్తీక్ డబ్బు ఆన్‌లైన్‌లో పంపిస్తాను అని సైగ చేస్తాడు. ఇక సౌర్య కార్తీక్‌ను సార్ సార్ అని పిలిస్తే కార్తీక్ సౌర్యను ఆపి తనని పేరుతో పిలవమని చెప్తాడు. సౌర్యను కార్తీక్ రౌడీ అని పిలుస్తా అంటాడు. ఇక దీప వాళ్లు బయటకు వెళ్తుంటే అదే మాల్‌కి నరసింహ వస్తాడు. దీప వాళ్లని చూస్తాడు. తన కూతురు వీడెవడితో ఎందుకు ఉంది. ఊరు వెళ్లకుండా వీళ్లు ఇక్కడేం చేస్తున్నారు అనుకుంటాదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీ దేవి ఆచూకి చెప్పేసిన గురువుగారు.. తల పట్టుకున్న విశాల్!