అన్వేషించండి

Karthika Deepam 2 September 6th: కార్తీకదీపం 2 సీరియల్: ఎల్లుండే కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి.. దీపకు దీపం పెట్టిస్తానంటోన్న నర్శింహ! 

Karthika Deepam 2 Today Episode కార్తీక్, జ్యోత్స్నలకు ఎల్లుండే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయడం దీపకు జ్యోత్స్న ఆ విషయం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode తన పేరు మీద ఇళ్లు రాయమని నర్శింహ గొడవ చేస్తాడు. అనసూయ కత్తి పీట పట్టుకొని  వస్తుంది. దానికి నర్శింహ దీపతో నువ్వు కత్తి పీటలు ఎత్తడం మా అమ్మకి కూడా నేర్పించావా అని అడుగుతాడు. తనకి డబ్బు ఇళ్లు ఇవ్వకపోతే తల్లి, పెళ్లాం, కూతురు అని చూడను చంపేస్తా అంటే దీప సంబంధం తెగిపోయింది తెగిపోయినట్లే ఉండు హద్దు దాటి  ప్రవర్తిస్తే గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చిరిస్తుంది. నర్శింహని ఇంటి నుంచి వెళ్లమని చెప్తుంది. నర్శింహని చాటుగా శౌర్య చూస్తుంది. భయపడుతుంది. ఆ మాటలు అన్నీ జ్యోత్స్న వింటుంది. 

నర్శింహ: వీళ్లంతా ఏకమై బెదిరిస్తే నేను భయపడతా అనుకున్నారేమో డబ్బు, ఇళ్లు ఇచ్చే వరకు ఎవర్నీ వదిలిపెట్టను. ఇంతలో అక్కడికి జ్యోత్స్న వస్తుంది. ఓ మీరా.
జ్యోత్స్న: నేనే నీతో కొంచెం మాట్లాడాలి. నీకు అంత సీన్ లేదు అని కోర్టులోనే తెలిసింది. నీ పెళ్లాం నిన్ను వదిలేసి నీ ముందే తనకు నచ్చినట్లు బతుకుతుంది ఏమైనా చేయగలిగావా. మీ అమ్మ నిన్ను మోసం చేసింది ఏమైనా చేయగలిగావా. ఇళ్లు కూడా నీకు దక్కకుండా చేసింది ఏమైనా చేయగలిగావా. చివరకు నీ కూతుర్ని కూడా నీకు దూరం చేసింది నువ్వు ఏమైనా చేయగలిగావా ఎప్పటికీ నువ్వు దీపని ఏం చేయలేవు.
నర్శింహ: నువ్వు ఇలా రెచ్చగొడితే దాన్ని చంపేస్తా చెప్తున్నా అది బతికి ఉంటే నాకు ఎప్పటికైనా ఇబ్బందే అదే దీప చస్తే కూతురు నా సొంతం అవుతుంది. ఈ ఇళ్లు నాకు దక్కుతుంది. అప్పుడు నా రెండో పెళ్లం కూడా నేను చెప్పినట్లు చేస్తుంది. 
జ్యోత్స్న: ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నావ్ కానీ నీకు అంత సీన్ లేదు.
నర్శింహ: ఉంది చంపేస్తా దాన్ని అలా చేస్తే నీకు లాభమే. ఏదైనా కేసు అయితే సాయం చేస్తారా. చచ్చినా మీ పేరు చెప్పను మొత్తం నేనే చూసుకుంటా మీరు సరే అనండి చాలు. ఈ నర్శింహ అంటే ఏంటో చూపిస్తా. తొందర్లోనే దీప తల దగ్గర దీపం పెట్టిస్తా. నా పేరు బైరి నర్శింహ ఈ పేరు గుర్తు పెట్టుకోండి.
జ్యోత్స్న: సరే.

బూచోడు ఎందుకు వచ్చాడని శౌర్య భయంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అనసూయ ట్యాబ్లెట్ తీసుకురమ్మని చెప్పి శౌర్యకి ట్యాబ్లెట్ వేస్తుంది. ఇక బూచోడు రాడని అనసూయ మనవరాలికి ధైర్యం చెప్తుంది. పాపని పట్టుకొని ఏడుస్తుంది. మరోవైపు దీప ఈ విషయం పాప కార్తీక్‌కి చెప్పేస్తుందని కార్తీక్‌ బాబుని గొడవ పడొద్దని చెప్పాలని అనుకుంటుంది. ఇక నర్శింహ మందు తాగుతూ తనకి జరిగిన అవమానం గుర్తు చేసుకుంటూ మాటలన్నీ తలచుకుంటాడు. ఇక నర్శింహ శోభకి ఆమ్లెట్ తీసుకురమ్మని చెప్తే శోభ అవమానిస్తుంది. రేపు ఒక్క రోజు ఆగితే నీ మొగుడు ఏం చేస్తాడో నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. నేను చేసే పనితో మన ఇద్దరి జాతకాలు మారిపోతాయని నర్శింహ శోభతో చెప్తాడు. 

మరోవైపు జ్యోత్స్న కార్తీక్ ఫ్యామిలీతో పాటు అందర్ని హాల్‌లోకి పిలుస్తుంది. ఇంతలో పంతులు ఇంటికి వస్తాడు. పెళ్లి ముహూర్తం పెట్టించడానికి పిలిపించానని అంటుంది. ఇక ఇప్పుడు అంత తొందర ఎందుకు అని కాంచన అడిగితే నేను తొందర పడకపోతే దీప, కార్తీక్‌లు తొందర పడతారని మనసులో జ్యోత్స్న అనుకుంటుంది. ఇక పంతులుకి పెళ్లి ముహూర్తం పెట్టమని పెద్దలు చెప్తారు. ఈ జంటకి అన్ని ముహూర్తాలు కుదరవని ఎల్లుండి ఉదయం మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్తాడు. అయితే జ్యోత్స్న ముందే పంతులుకి అలా చెప్పమని చెప్తుంది. రెండు రోజుల్లో పెళ్లా అని కార్తీక్ షాక్ అవుతాడు. ఇక పంతులు ఈ ముహూర్తం తప్పితే దగ్గర్లోనే లేదు అని అంటాడు. ఇక కార్తీక్ జ్యోత్స్న తల్లిదండ్రులకే నిర్ణయం తీసుకోమని అంటాడు. జ్యోత్స్న పెళ్లి ఏర్పాట్లు కష్టం అయితే నేను రెజిస్టర్ పెళ్లికి అయినా ఓకే అని అంటుంది. ఇక అందరూ ఆ ముహూర్తం ఫిక్స్ చేస్తారు. 

జ్యోత్స్న కార్తీక్‌తో మాట్లాడాలి అనుకుంటుంది. కార్తీక్ వెళ్తూ ఓ చోట కూర్చొని ఉంటే చూసి ఏమైందని అడిగితే పాప నర్శింహ గురించి చెప్తుంది. కార్తీక్ దీపని కలవడానికి వెళ్తాడు ఇక జ్యోత్స్న కూడా కార్తీక్‌ని ఫాలో అవుతుంది. దీప ఇళ్లు డబ్బు కోసం వచ్చాడని చెప్తుంది. వాడితో గొడవ పెట్టుకోవద్దని దీప అంటుంది. ఇంతలో జ్యోత్స్న వచ్చి నువ్వు వదిలేయమన్నా మా బావ వదలడు దీప అని చెప్తుంది. ఇక దీపకి గుడ్ న్యూస్ చెప్పావా అని కార్తీక్‌ని జ్యోత్స్న అడిగి తన పెళ్లి గురించి చెప్తుంది. దీప సంతోషిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: సాహసం చేసి పంచకమణిని దక్కించుకున్న నయని.. కుట్ర చేసిన గజగండ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget