అన్వేషించండి

Karthika Deepam 2 September 2nd: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నతో నిజం చెప్పిన దాసు.. పని మనిషి కూతురివని, పారిజాతం నిన్ను మార్చేసిందని చెప్పిన కన్నతండ్రి!

Karthika Deepam 2 Today Episode జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదని పనిమనిషి కూతురని తన కూతురని దాసు జ్యోత్స్నతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప కార్తీక్‌కి కాల్ చేసి ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది. కార్తీక్ కూడా దీపతో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు. ఇక కార్తీక్ దగ్గరకు శౌర్య వచ్చి అమ్మ కాల్ చేసిందా అని అడిగితే కొద్ది సేపటిలో వచ్చేస్తుందని చెప్పి శౌర్యని బయటకు తీసుకెళ్తాడు. మరోవైపు 
సుమిత్ర దాసు మాటల్ని తలచుకొని బాధ పడుతుంది. పారిజాతం అటుగా వెళ్తుంటే ఆపి జ్యోత్స్న గురించి మీతో మాట్లాడాలి అని అంటుంది. ఇంతలో జ్యోత్స్న కూడా అక్కడికి వస్తుంది.

జ్యోత్స్న: నా గురించి గ్రానీతో ఏం మాట్లాడాలి. 
సుమిత్ర: మనం చేసే చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద శిక్షలు పడుతుంటాయి.
జ్యోత్స్న: అవును మమ్మీ నిజమే నిన్ను కాపాడిన దీపకి ఆరోజే థ్యాంక్స్ చెప్పి వదిలేసి ఉంటే బాగుండేది. వదలకుండా చేయి పట్టుకొని తీసుకొచ్చి నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకున్నట్లుంది ఇప్పుడు నా పరిస్థితి. 
సుమిత్ర: నువ్వు ఇలా అనడానికి అతను అలా అనడానికి సరిగ్గా సరిపోయింది.
జ్యోత్స్న: ఎవరు ఏమన్నారు.
సుమిత్రా: నువ్వు ఇలా ఉంటే అందరూ అన్నీ అంటారు.
జ్యోత్స్న: అదే ఎవరు ఏమన్నారు. 
సుమిత్ర: రోజూ చూసే వాళ్లకే కాదే ఒక్క రోజు చూసిన వాళ్లకి కూడా నువ్వేంటే అర్థమైపోతుంది. అత్తయ్య మీరు చేసిన గారాభం మమల్ని అందరిలో తల దించుకునేలా చేస్తుందని ముందే తెలిసుంటే అసలు మిమల్ని నా కూతురు దగ్గరకు రానిచ్చే దాన్ని కాదు. ఎప్పుడూ నోరు తెరిచి ఎవర్నీ పెళ్లెత్తి మాట అనని మాట కూడా అనని దాసు నీ పద్ధతి చూసి జ్యోత్స్నని ఇలా పెంచారేంటి అని అడిగాడే. అణుకవ లేదు డబ్బు ఉందన్న అహంకారం తప్ప ఇంకేం లేదు మీ పెంపకం ఇలా ఉండదు అని అన్నాడు. కానీ తనకి తెలీదు కదా నువ్వు మీ గ్రానీ వల్ల ఇలా తయారయ్యావని.
పారిజాతం: సుమిత్ర వాడేదో తింగరోడు ఏం మాట్లాడుతాడో వాడికే తెలీదు.
సుమిత్ర: దాసు ఏం చిన్న పిల్లోడు కాదు అత్తయ్య డైరెక్ట్‌గా నన్నే ప్రశ్నించాడు. 
జ్యోత్స్న: అసలు నా గురించి చెప్పడానికి వాడు ఎవడు.
సుమిత్ర: ఏయ్ నోర్ముయ్. నీలో లోపాన్ని నీకు చెప్తే అరవడం కాదు సరిచేసుకోవాలి. నువ్వు ఇలా మాట్లాడటానికి కారణం ఎవరు మీ గ్రానీనే కదా. అయినా నేను తప్పు చేశా నిన్ను నా దారిలో ముందే పెట్టుకోవాల్సింది. పెద్దావిడ కదా మంచి చెప్తుంది అంటే ఇలా చేసింది. దయచేసి మీరు నా కూతురికి జోలికి రావొద్దు.
జ్యోత్స్న: నీ కొడుకు ఎక్కడ గ్రానీ..
పారిజాతం: జ్యోత్స్న వాడు అమాయకుడే.
జ్యోత్స్న: నీ కొడుకు ఎక్కడున్నాడో ముందు అది చెప్పు.

దాసుని వెతుక్కుంటూ జ్యోత్స్న బయటకు వెళ్తుంది. దాసుని కలిసి నువ్వు కేవలం మా గ్రానీ కొడుకువి మాత్రమే. నేను ఎలా ఉంటే నీకు ఎందుకు అడగడానికి నువ్వు ఎవరు? దానికి దాసు నువ్వు ఎవరో చెప్తాను. నేను ఎవరో చెప్తాను వచ్చి కారు ఎక్కు అని జ్యోత్స్న కారు తాను డ్రైవ్ చేస్తాడు. తప్పక జ్యోత్స్న కారు ఎక్కుతుంది. మరోవైపు దీప, అనసూయలు శౌర్య కోసం సైకిల్ తీసుకొని వస్తారు. ఇద్దరూ మన కష్టాలు అన్నీ తీరిపోయాయని అనుకుంటారు. ఇంతలో ఓ స్వామిజీ వచ్చి కష్టాలు తీరలేదు ఇంకా ఎక్కవు అవుతాయి అని అంటాడు. అయిన వాళ్ల మధ్య ఒంటరిగా ఉన్నావని త్వరలోనే నీ భవంతికి చేరుకుంటావని అంటాడు. నీకు అందరూ ఉన్నారు. నీకు అన్నీ ఉన్నాయని అంటాడు. కానీ కష్టాలు తప్పవని చెప్పి వెళ్లిపోతాడు. దీప ఆలోచనలో పడతుంది. 

జ్యోత్స్న: ఇక్కెడికెందుకు తీసుకొచ్చావ్.
దాసు: కథ మొదలైన చోటు ఇదే.
జ్యోత్స్న: నీకు ఇప్పుడు బుర్ర బాగానే పని చేస్తుందా. 
దాసు: నాకు బాగానే ఉంది పద.
జ్యోత్స్న: నన్ను హాస్పిటల్‌కి ఎందుకు తీసుకొచ్చావ్. హలో నిన్నే.. 
దాసు: ఒక బిడ్డ తల రాత మారిపోయింది ఇక్కడే. నేల మీద ఉండాల్సిన బిడ్డ అందలం ఎక్కింది ఇక్కడే. ఆకాశంలో ఉండాల్సిన బిడ్డ నేల మీదకు వచ్చింది ఇక్కడే.
జ్యోత్స్న: ఏమైంది ఈ మనిషికి.
దాసు: ఇద్దరు బిడ్డలు ఇద్దరు తల్లులకు దూరం అయ్యారు. నేను నీకు ఓ కథ చెప్తాను విను.
జ్యోత్స్న: నువ్వు చెప్పబోయే చెత్త కథ వినడానికి నేను లేను వస్తా.
దాసు: జ్యోత్స్న నేను చెప్పేది విను. కొన్నేళ్ల క్రితం వర్షం పడిన రాత్రి ఇద్దరు ఆడవాళ్లకు ఇక్కడే ప్రసవం అయింది. ఒకరు పనావిడ, ఒకరు యజమాని అదే సమయంలో ఇద్దరికీ ఆడపిల్లలు పుట్టారు. ఓకావిడకు దుర్బుద్ధి పుట్టింది. యజమాని కూతుర్ని చంపేయమంది. ఏం జరిగిందో తెలియని యజమానురాలు పనిమనిషి కూతుర్ని తన కూతురు అనుకుంది. అందరూ అదే నమ్మారు. ఇప్పటికీ అదే నమ్ముతున్నారు. ఈ కథలో నువ్వు ఉన్నావు.
జ్యోత్స్న: నేను ఉన్నానా.
దాసు: అసలు అదంతా జరిగింది నీ కోసమే. ఆ రాత్రి హాస్పిటల్‌లో చేరిన ఇద్దరు ఆడవాళ్లలో ఒకరు సుమిత్ర, ఒకరు మా ఆవిడ కల్యాణి. సుమిత్ర కూతుర్ని ఆ రోజే గేటు దాటించింది. పని మనిషి కూతుర్ని సుమిత్ర కూతురు చేసింది. ఇంకా అర్థం కాలేదా. సుమిత్ర కూతురిగా పెరుగుతున్న పని మనిషి కల్యాణి కూతురు ఇంకెవరో కాదు నువ్వే. పని మనిషి కల్యాణి ఇంకెవరో కాదు నా భార్య. నేనే నీ కన్న తండ్రిని. 
జ్యోత్స్న: లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావ్. నువ్వు నా తండ్రివి ఏంటి ఛీ. నేను పని మనిషి కూతుర్ని ఏంటి చీ.
దాసు: నిన్ను మార్చేసింది ఎవరో కాదు మా అమ్మ మా అమ్మ పారిజాతం. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: పేపర్ల కాఫీలు విసిరిన గాయత్రీ పాపని చూసేసిన నయని.. ఇప్పటికైనా తొలిబిడ్డ అని కనిపెడుతుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget