Karthika Deepam 2 Serial September 25th: కార్తీకదీపం 2 సీరియల్: స్వప్న, కాశీల పెళ్లి చేసిన దీప.. కొత్త జంటని చూసి టైం దగ్గర పడిందంటోన్న కార్తీక్, ఎంత పని చేశావ్ దీప!
Karthika Deepam 2 Serial Episode కాశీ, స్వప్నల పెళ్లి చేసిన దీప కొత్త జంటని కార్తీక్ ఇంటికి తీసుకొచ్చి కాంచనతో ఆశీర్వాదం ఇప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode సుమిత్రని గుడికి రప్పించి శ్రీధర్‌ని తప్పించి స్వప్న పెళ్లి దీప తెలివిగా ఆపేస్తుంది. స్వప్న దీపతో ఇప్పుటికి పెళ్లి ఆగిపోయినా మళ్లీ మా నాన్న మరో ముహూర్తం పెట్టించి పెళ్లి చేసేస్తారని ఇది ఇక్కడితో ఆగాలి అంటే మా ఇద్దరి పెళ్లి ఇక్కడే చేయమని కాశీ, స్వప్నలు దీపని అడుగుతారు.
దీప: మనం కార్తీక్ బాబుతో మాట్లాడి ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుందాం.
కాశీ: మాకు బావ ఎంతో నువ్వు అంతే అక్క. ఇప్పుడు అవ్వకపోతే స్వప్న నాకు దక్కుతుందన్న నమ్మకం లేదు. చావు అయినా బతుకు అయినా కలిసే ఉంటాం అక్క మమల్ని చావమంటావో బతకమంటావో నీ ఇష్టం అక్క.
స్వప్న: ఇక్కడ నుంచి బయటకు వెళ్తే కాశీ భార్యగానే వెళ్లాలి. లేదంటే నన్ను మా డాడీ తర్వాత కలవనిస్తారో లేదో తెలీదు దీప. నేను మీ ఇద్దరినే నమ్ముకున్నాను. మా డాడీ వచ్చినా మమ్మీ వచ్చినా మళ్లీ ఈ ఛాన్స్ రాదు ప్లీజ్ అర్థం చేసుకో మేం కలిసి ఉండాలో చావాలో.
దీప: ఈ పెళ్లి జరిగితే నిజం బయట పడుతుంది అప్పుడు కాంచన గారు బతకరు. చేయకపోతే వీళ్ల పరిస్థితి ఏంటి. ముందు వీళ్ల పెళ్లి చేస్తే కాంచన గారికి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా.
స్వప్న: నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావ్ అంటే నీకు కూడా మా పెళ్లి ఇష్టం లేదు. సరే మేం ఎక్కడికైనా వెళ్లిపోతాం. మా డాడీ కాశీని కలిస్తే చంపేస్తా అన్నారు. మమల్ని చంపేస్తారో వదిలేస్తారో వాళ్ల ఇష్టం. మేం అన్నింటికి తెగించే ఉన్నాం. కానీ అందరినీ దూరం చేసుకుంటాం అని ఒక బాధ ఉంది. నువ్వు అన్నయ్య మా పెళ్లి చేసి మాకు మంచి ఫ్యామిలీ ఇస్తారు అనుకున్నాం.
కాశీ: నా ప్రాణం కాపాడావు మా ప్రేమని కూడా కాపాడు అక్క. ప్లీజ్ అక్క మాకు బతకడానికి ఒక ఆశ ఉంది కానీ బతికించడానికి ఒక ధైర్యం ఇవ్వు అక్క.
దీప: దేవుడా నీ మీదే భారం వేసి ఈ పని చేస్తున్నా.
దీప తన చేతితో తాళి కాశీకి ఇచ్చి తాళి కట్టమని అంటుంది. ఇక కావేరి శ్రీధర్ దగ్గర వెళ్లి పెళ్లి దగ్గరకు రమ్మంటుంది. శ్రీధర్ సుమిత్రని చూపించి తను చెల్లి అని తనకు తెలిస్తే ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుందని చెప్తాడు. మరోవైపు దీప కాశీకి తాళి కట్టమని అంటుంది. పంతులుని పిలిచి వేదమంత్రాలు చదమని అంటుంది. దగ్గరుండి ఇద్దరికీ పెళ్లి చేస్తుంది దీప. ఇంతలో శ్రీధర్, కావేరి రావడం దీప చూస్తుంది. కాశీ వాళ్లతో చెప్పి వాళ్ల కంట పడటం మంచిది కాదని ముందు ఈ విషయం కార్తీక్ బాబుకి చెప్పాలని ముందు అక్కడికి వెళ్లాలని వాళ్లకి కనిపించకుండా వెళ్లిపోతారు. శ్రీధర్ వాళ్లు వచ్చే సరికి ఎవరూ లేకపోవడంతో ఏమైందో అని టెన్షన్ పడతారు. ఇక స్వప్న ఇంటికి వెళ్లుంటుందని ఇంటికి బయల్దేరుతారు. ఇక దీప సుమిత్రని కలుస్తుంది. ఇక సుమిత్ర జ్యోత్స్న, కార్తీక్‌ల పెళ్లి ముహూర్తాలు గురించి పంతులుతో మాట్లాడుతానని సుమిత్ర అంటే దీప ఇంటికి వెళ్తానని చెప్తుంది.
కార్తీక్ స్వప్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర కార్తీక్‌కి కాల్ చేసి పెళ్లి ముహూర్తాలు గురించి మాట్లాడటానికి తాత మిమల్ని పిలుస్తున్నారని నువ్వు అమ్మ వెంటనే రండి అని సుమిత్ర చెప్తుంది. ఇంతలో దీప కార్తీక్ ఇంటికి వస్తుంది. కాశీ, స్వప్నలను తీసుకొస్తుంది. ఇద్దరికీ పెళ్లి అయిందని తెలిసి కార్తీక్‌తో పాటు కాంచన కూడా షాక్ అయిపోతుంది.
కార్తీక్: మనసులో ఎంత పని చేశావ్ దీప.
కాంచన: ఓరేయ్ కాశీ ఏంట్రా ఇది. ఒక పక్క మీ బావకి పెళ్లి ముహూర్తం పెడుతుంటే మరోపక్క పెళ్లి చేసుకొని వచ్చావేంట్రా. నిన్ను ఎక్కడో చూసినట్లు ఉంది అమ్మ. ఓరేయ్ కార్తీక్ ఈ అమ్మాయి స్వప్న కద.
స్వప్న: అవును పెద్దమ్మ నేను స్వప్నని.
కార్తీక్: దీప నిజం చెప్పేసిందా
కాంచన: పెద్దమ్మ అని సొంత పెద్దమ్మని పిలిచినట్లు పిలిచావ్.
స్వప్న: బాస్‌ని నేను అన్నయ్య అని పిలుస్తా అంటే మీరు పెద్దమ్మే కదా.
కార్తీక్: ఇప్పుడు నిజం చెప్పకపోతేనేం కాసేపు అయిన తర్వాత తెలియాల్సిందే కదా. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావ్ దీప. ఇప్పుడు మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మా అమ్మ పరిస్థితి ఏంటి. ఇప్పుడు మా నాన్న ఇంటికి రారు కదా.
కాశీ: సారీ అత్తయ్య మాది ప్రేమ పెళ్లి దీప ఆశీర్వాదంతో జరిగింది.
కాంచన: అర్థమైంది కానీ తొందరపడ్డారేమోరా. పెద్దవాళ్లకి ఒక మాట చెప్పుంటే బాగుండేది.
స్వప్న: బలవంతంగా నాకు వేరే పెళ్లి చేస్తుంటే ఇలా అయింది పెద్దమ్మ
కార్తీక్: అయిపోయింది అంతా అయిపోయింది ఇక ఈ బాంబ్ పేలడానికి ఎంత టైం పట్టదు.
కాశీ, స్వప్నలు కాంచన ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తారు. స్వప్న కాంచనతో పెద్దమ్మ పెద్దనాన్నని పిలవండి ఇద్దరి ఆశీర్వాదం తీసుకుంటామని అంటుంది. కార్తీక్ చాలా టెన్షన్ పడతాడు. స్వప్నతో అన్నయ్య నేను ఇంత వరకు పెద్ద నాన్నని చూడలేదు అంటుంది. దాంతో కార్తీక్ టైం దగ్గర పడింది చూస్తావ్‌లే అంటాడు. ఇక కాంచన ఇద్దరినీ ఆశీర్వదిస్తుంది. కార్తీక్ కూడా ఆశీర్వదిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.