అన్వేషించండి

Karthika Deepam Serial Promo Today March 29th: కార్తీకదీపం 2 సీరియల్: దీప జోలికి వస్తే చంపుతానంటూ కార్తిక్ వార్నింగ్ - చెంప పగలగొట్టిన వంటలక్క

Karthika Deepam 2 Serial Promo Today Episode అప్పు చెల్లించలేదని దీపకు భర్త స్థానం అడిగిన వ్యక్తిని కార్తీక్‌ కొట్టడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Promo Today Episode కార్తీక్‌ దీపలు ఒకరికి ఒకరు ఎదురవుతారు. కార్తీక్ దీప కోసం తన ఊరిలో వెతకడం ప్రారంభిస్తాడు. దీంతో దీప కార్తీక్‌ల మధ్య రిలేషన్ ఏంటా అని క్యూరియాసిటీ పెరుగుతుంది. ఈ తరుణంలో తాజాగా వచ్చిన ప్రోమో సీరియల్‌ మీద ఆసక్తి పెంచేస్తుంది. ఇంతకీ ప్రోమోలో ఏముంది అంటే..

"ఓ వ్యక్తి వైట్ షూట్ బూట్ వేసుకొని దీప దగ్గరకు వస్తాడు. దీప ఏదో పని చేస్తుంటే వెనకాలే వచ్చి నిల్చొంటాడు. దీంతో దీప షాక్ అయి కంగారు పడుతుంది. నీ భర్త నా దగ్గర అప్పు తీసుకున్నాడు తీర్చలేదు. అందుకు మనం ఓ పని చేద్దాం దీపా అని అంటాడు. నువ్వు నన్ను నీ పెనిమిటి అనుకున్నావ్ అనుకో నా అప్పు తీరుతుంది. నా అవసరం తీరుతుందని అంటాడు. దీంతో దీప ఆ వ్యక్తి చెంప పగలగొడుతుంది. అడగ్గానే మంచి నీళ్లు ఇచ్చానని మొగుడి స్థానం కూడా ఇస్తాను అనుకున్నావా.. నాలుక చీరేస్తా ఇలాంటి తప్పుడు కూతలు కూశావంటే అని దీప వార్నింగ్ ఇస్తుంది.

మరోవైపు కార్తీక్ అదే వ్యక్తిని దీప ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. దీంతో ఆ వ్యక్తి ఎట్లా కనిపిస్తున్నాను రా? నీ లాంటి వాళ్లు దాని వెనక వంద మంది ఉన్నా.. నేను దాన్ని వదిలిపెట్టను అని అంటాడు. దీంతో కార్తీక్ బుద్ధి లేకుండా అది ఇదీ అంటారేంటి.. అని అతన్ని ప్రశ్నిస్తాడు. ‘‘నా ఇష్టం వచ్చినట్లు అంటాను. దాన్నిఅయితే విడిచేది లేదు. దాని అంతు చూస్తా. చెప్పు దానికి..’’ అని అంటే కార్తీక్ అతన్ని లాగి ఒక్కటిచ్చి ‘‘ఇంకో సారి దీప జోలికి వస్తే చంపుతా’’ అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ప్రోమో పూర్తవుతుంది. 

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

దీప సైకిల్ పోటీల్లో పాల్గొంటుంది. పోటీల్లో అందరి కంటే ముందంజలో ఉంటుంది. నిర్వాహకులు మొదటి బహుమతి ఫ్రిడ్జ్, రెండో బహుమతి వాషింగ్ మెషిన్, మూడో బహుమతి సైకిల్ అని చెప్తారు. దీంతో దీప సౌర్యకి సైకిల్ ఇవ్వాలని కావాలనే మూడో స్థానం కోసం ఆగిపోయి ఆ స్థానం దక్కించుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న అందాల పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి మిస్ హైదరాబాద్ కిరీటాన్ని సొంతం చేసుకుంటుంది. 

ప్రైజ్‌లు ఇవ్వడానికి బిజినెస్‌మాన్ కార్తీక్ వస్తాడు. మూడో స్థానంలో నిలిచిన దీపక్కకు సైకిల్ బహుమతి తీసుకోమని నిర్వాహకులు పిలుస్తారు. దీప బహుమతి తీసుకోవడానికి వెళ్తూ కార్తీక్‌ను చూసి ఆగిపోతుంది. ఇక కార్తీక్‌ కూడా దీపని చూసి షాక్ అయిపోతాడు. ఇష్టం లేకుండానే దీప బహుమతి తీసుకోవడానికి వెళ్తుంది. కార్తీక్‌ను చూసి చిరాకు ముఖం పెడుతుంది. అక్కడున్న నిర్వాహకులు దీపను కార్తీక్‌కు పరిచయం చేస్తారు. దీపక్క మా ముత్యాలమ్మ ఊరిలో అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణ సార్. వంటలు బాగా చేస్తుందని చెప్తారు. 

కార్తీక్ సైకిల్ దీపకు ఇస్తూ.. ఆ తప్పు నేను చేయలేదు. నన్ను నమ్మండని అంటాడు. దీంతో దీప నేను నమ్మను నన్ను నమ్మించ లేరు బాబుగారు అని హడావుడిగా సైకిల్ తీసుకొని వెళ్లిపోతుంది. ఇక సౌర్య సైకిల్ కోసం నా కోసం కావాలనే మూడో స్థానంలోకి వచ్చావు కదా అని అంటుంది.  

కార్తీక్ దీప గురించి ఆలోచిస్తాడు. దీప మాటలు తలచుకొని మాట్లాడే అవకాశం ఉండి ఉంటే జరిగిందంతా వివరించే వాడిని అని తనలో తాను అనుకుంటాడు. నిర్వాహకులు ఏం మాట్లాడిని కార్తీక్ వినిపించుకోడు. దీప ఇప్పుడే వెళ్లింది కదా ఇక్కడే ఎక్కడో ఉంటుందని తనని ఎలా అయినా కలిసి జరిగిందంతా చెప్పాలని అనుకొని డ్రైవర్‌ని పంపేసి తానే దీప కోసం వెతుకుతాడు. 

దీప కూడా కార్తీక్ మాటలు తలచుకొని బాధ పడుతుంది. మరోవైపు కార్తీక్ కారులో తిరుగుతూ దీప గురించి వెతుకుతూ కనిపించిన వాళ్లను దీప గురించి అడుగుతాడు. దీప కనిపిస్తే కానీ తిరిగి వెనక్కి వెళ్లను అని నిజం దీపకు చెప్పి అప్పుడు తను క్షమిస్తే ఇంటికి వెళ్లనని అనుకుంటాడు. 

మరోవైపు జ్యోత్స్న కిరీటం పెట్టుకొని ఇంటికి వస్తుంది. నానమ్మ పారిజాతం పొగిడేస్తూ దిష్టి తీస్తుంది. జ్యోత్స్నని అందరూ కంగ్రాట్స్ చెప్తారు. కార్తీక్ తల్లిదండ్రులు కంగ్రాట్స్ చెప్పినా జ్యోత్స్న వినిపించుకోదు. దీంతో జ్యోత్స్నపై తన తల్లి సీరియస్ అవుతుంది. ఏమైంది నీకు నువ్వు రాగానే మీ అత్తయ్య మామయ్య విష్ చేశారు నువ్వు రిప్లే ఇవ్వలేదు. మీ శ్రీధర్‌ మామయ్య మాట్లాడాలి అని చూశారు నువ్వు పట్టించుకోలేదని.. కిరీటంతో పాటు కళ్లు కూడా తలకు ఎక్కాయా అని తిడుతుంది. దీంతో తన బావ కార్తీక్ రాలేదు విష్ చేయలేదు అని ఫీలై బుంగమూతి పెట్టుకుంటుంది. దీంతో శివనారాయణ ముందు జ్యోత్స్న అలక తీర్చండి అని చెప్తాడు.  

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ మార్చి 29th: కృష్ణని వదిలేసి తనతో వచ్చేయ్‌మని మురారికి చెప్పిన మీరా, ఆదర్శ్‌నే ఫస్ట్ టార్గెట్!

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget