అన్వేషించండి

Karthika Deepam 2: కార్తీకదీపం 2 - ఇదేం ట్విస్టు సామి - ఆ తప్పు తాను చేయలేదన్న కార్తీక్‌, అంత పెద్ద తప్పు ఏం చేశాడో మరి!

Karthika Deepam 2 Serial Promo: జాతరలో దీపని చూసిన కార్తీక్ తాను ఏ తప్పు చేయలేదు అని దీపతో చెప్పడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Promo Today Episode: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కార్తీకదీపం సీజన్ 2 మంచి మంచి ట్విస్ట్‌లతో స్టార్ట్ అయింది. మార్చి 25న ప్రారంభమైన ఈ సీరియల్‌ ప్రేక్షకుల్ని ఊహించని ట్విస్ట్‌లతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఇవాళ్టి ప్రోమో వచ్చింది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉంది అంటే..

ముత్యాలమ్మ జాతరలో జరిగిన సైకిల్ పోటీల్లో విజేతలకు బహుమతులు ఇవ్వడానికి కార్తీక్ వస్తాడు. కార్తీక్‌ను చూసి దీప కోపంతో రగిలిపోతుంది. దీపని చూసిన కార్తిక్ షాక్ అవుతాడు. ఇక దీపకు సైకిల్ బహుమతిగా ఇవ్వబోయిన కార్తీక్ దీపతో ‘‘ఆ తప్పు నేను చేయలేదు నన్ను నమ్మండి’’ అని చెప్తాడు. దానికి దీప ‘‘నేను నమ్మను. నన్ను నమ్మించలేరు బాబు’’ అని అంటుంది. దీంతో ప్రోమో పూర్తవుతుంది.

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే.. 

అనసూయ పక్కన కూర్చొంటుంది సౌర్య. బడి అయిపోయిందా ఇలా తగలబడ్డావ్ అని సౌర్యని అనసూయ అడిగితే నువ్వేంటి నా మంచం మీద కూర్చొన్నావ్ అని సౌర్య అనసూయని ప్రశ్నిస్తుంది. దీంతో అనసూయ ఎంత ధైర్యమే నీకు ఇది నా తమ్ముడు ఇళ్లు. నీ బాబు ఇళ్లు అంతే కానీ తేరగా వచ్చింది కదా అని అడుక్కు తినేవాళ్లది కాదు అని దీపని ఉద్దేశించి అంటుంది. దీంతో సౌర్య నానమ్మ అమ్మ వైపు చూసి తిడతావేంటి అని అడుగుతుంది. దానికి అనసూయ నా ఇష్టమే. ఈ అనసూయకు ముత్యాలమ్మ కూడా గజగజ వణికిపోతుంది. అలాంటిది నువ్వేంటి ప్రశ్నిస్తావ్ అంటుంది.

దీప సౌర్యని తిట్టి జాతరకు వెళ్దామనుకున్నాం కదా బయల్దేరు అంటుంది. ఇక సౌర్య నానమ్మతో ఇదిగో మేం జాతరకు వెళ్లి సైకిల్ కొంటున్నాం. నువ్వు సైకిల్ మీద ఎక్కినావనుకో అని అంటుంది. దీప కలుగజేసుకొని సౌర్య వెళ్లమని చెప్పానా అలా అనకు తప్పు అని వారిస్తుంది. దీంతో అనసూయ దీప అలా తనని అనమంది అని దీపని తిడుతుంది. దీంతో అనసూయ కోడలి మీద రేగిపోతుంది. నీ మాటలకే నీ మొగుడు ఊరు రావడం మానేశాడు. వాడు ఊరి నిండా చేసిన అప్పులకు నన్ను అడుగుతున్నారు. వాడు ఎక్కడికి వెళ్లాడో ఏంటో అంతా నా ఖర్మ అని అంటుంది. తర్వాత దీపని ఇష్టం వచ్చినట్లు తిట్టి దీప సౌర్యకు సైకిల్ కొనడానికి దాచుకున్న డబ్బును లాక్కుంటుంది.  

మరోవైపు కార్తీక్, జ్యోత్స్న తల్లిదండ్రులు అందరూ జ్యోత్స్న కోసం ఎదురు చూస్తారు. జ్యోత్స్న ఫ్యాషన్ రంగంలో నెంబర్ వన్‌గా నిలవాలి అని ప్రయత్నిస్తుంటుంది. జ్యోత్స్న కార్తీక్‌కి కాల్ చేస్తే తాను బిజీగా ఉన్నాను అని ఆల్ దీ బెస్ట్ అని కార్తీక్ వాయిస్ మెసేజ్ పంపుతాడు. అందరూ జ్యోత్స్నతో బావకి అందరి కంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అని అంటారు. ఇక జ్యోత్స్న తన తాత దగ్గర ఆశీర్వాదం తీసుకొని మిస్ హైదరాబాద్ పోటీలకు వెళ్తుంది. 

దీప సౌర్యని తీసుకొని జాతరకు వస్తుంది. కూతుర్ని భుజాల మీద కూర్చొపెట్టి జాతరలో తిప్పుతుంది. జాతరకు అందరూ వస్తారు అని దీప అంటే నాన్న కూడా వస్తారా అని సౌర్య అడుగుతుంది. దీప మెల్లగా మాట మార్చుతుంది. సౌర్య అందరూ తమ తల్లిదండ్రులతో వచ్చారు. నేను మాత్రం నీ ఒక్కదానితో వచ్చాను అని చెప్పి బాధ పడుతుంది. ఇక సౌర్య తల్లికి సైకిల్ కొనమని అడుతుంది. దీప అత్త అనసూయ డబ్బులు తీసుకోవడంతో నోట మాటరాక సైలెంట్ అయిపోతుంది.  

చేసేది ఏం లేక దీప సౌర్యని ఇంటికి వెళ్లిపోదామని పిలుస్తుంది. సౌర్య రాను అని మారాం చేస్తుంది. నాన్న ఉంటే తనకు సైకిల్ కొనిచ్చేవాడు అని అంటుంది. దీప కన్నీళ్లు పెట్టుకుంటే అమ్మా ఏంటి కళ్లలో నీళ్లు వస్తున్నాయ్. ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. దానికి దీప మనసులో.. నాకు తగిలిన దెబ్బ నీకు కనిపించదు అమ్మ. నా దురదృష్టం కళ్లలో నీళ్లలా బయటకు వస్తుంది అనుకొని బయటకు మాత్రం ఏదో దుమ్ము పడింది అమ్మ అని కవరింగ్ ఇస్తుంది. ఇక సౌర్య అమ్మా ఇలా రా అని దీపని పిలిచి ముద్దు పెట్టి కన్నీళ్లు తుడుస్తుంది. నాకు ఏమీ వద్దమ్మ వెళ్లిపోదాం పద అని చెప్తుంది.

ఇంతలో జాతరలో సైకిల్ పోటీలు జరుతాయని అనౌన్స్ మెంట్ వస్తుంది. సౌర్య తన తల్లిని పోటీల్లో పాల్గొనమని చెప్తుంది. దీంతో దీప సైకిల్ పోటీలే కదా మనల్ని ఆపేది ఎవడు పద అని వెళ్తుంది. మరోవైపు జ్యోత్స్న ర్యాంప్ వాక్ చేసి అలరిస్తుంది. చివరకు చారుశీల, జ్యోత్స్నలు మిగులుతారు. అందరూ చారుశీల గెలుస్తుంది అని అనుకుంటారు. జ్యోత్స్న జడ్జిలు తనకు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలకు అందరూ ఫిదా అయిపోతారు. దీంతో నిన్నటి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: త్రినయని సీరియల్ మార్చి 28th: గాయత్రీ పాప కోసం ఊలూచి మీద ఒట్టేసిన సుమన.. ప్రాణాపాయస్థితిలో పెద్దబొట్టమ్మ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, భారీ పేలుడుతో చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Embed widget