Karthika Deepam 2 Serial October 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని ఈడ్చుకెళ్లిన అనసూయ.. వ్రతం దగ్గర రచ్చ రచ్చ చేసిన శివనారాయణ!
Karthika Deepam 2 Serial Today Episode వ్రతం దగ్గరకు వచ్చిన శివనారాయణ జ్యోత్స్న కనిపించలేదని కాంచనతో గొడవ పెట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప, కార్తీక్‌లు పీటల మీద కూర్చొని వ్రతం ప్రారంభిస్తారు. ఇంతలో జ్యోత్స్న గుడికి చేరుకుంటుంది. అనసూయ, కాంచనలు జ్యోత్స్ని చూస్తారు. వ్రతం ఆపడానికే వచ్చింది ఏదో ఒకటి చేయ్ అనసూయ అని కాంచన చెప్తుంది. దాంతో అనసూయ జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది. జ్యోత్స్నని ఆపుతుంది. నీ కోడలు నాకు కాబోయే భర్తతో ఎలా వ్రతం చేస్తుందో అడగటానికి వచ్చానని అంటుంది. దానికి అనసూయ దీప నా కోడలు కాదు కాంచన గారి కోడలు అని అంటుంది.
అనసూయ: కార్తీక్ భార్య భార్య. ఈ వ్రతం జరిగితే వాళ్లు పూర్తి భార్యాభర్తలు అయిపోయినట్లే మీరు ఇంటికి వెళ్లండమ్మా ఇక్కడ గొడవ వద్దు.
జ్యోత్స్న: మీరు మా ఇంటి చుట్టూ చేరి నాకే గోతులు తీశారు కదా ఎవర్ని వదిలిపెట్టను. దీపని అయితే అస్సలు వదలను అడ్డు లే.
మీరు మాట వినడం లేదు వ్రతం జరగాలి అంటే ఏం చేయాలో నాకు తెలుసు అని జ్యోత్స్నని పట్టుకొని లాక్కెళ్లి ఒక గదిలో పెట్టి తలుపు గడియ పెట్టేస్తుంది. జ్యోత్స్న ఎంత తలుపు కొట్టినా ఎవరూ చూడరు. ఇక వ్రతం దగ్గర కాశీ ఫొటోలు తీస్తుంటాడు. అనసూయ జ్యోత్స్ని ఆపానని చెప్తుంది. ఇక శ్రీధర్ రాకపోతే దీప దగ్గర నా మాట పోతుందని అనుకుంటుంది. ఇంతలో శ్రీధర్ వస్తాడు. వెనకాలే పెద్దాయన, సుమిత్ర, దశరథ్‌లు వస్తారు. శ్రీధర్‌ని చూసి అందరూ వీళ్లంతా కలిసిపోయారా అనుకుంటాడు. వ్రతానికి పిలవగానే వచ్చావంటే నీకు సిగ్గు బుద్ధి లేదని పెద్దాయన అంటాడు. దాంతో శ్రీధర్ నాకు బుద్ధిలేదు ఒకే కానీ మీ మనవరాలిని అన్యాయం చేసిన వాళ్ల వ్రతానికి రావడానికి మీకు సిగ్గు లేదా అని అంటాడు. దానికి శివనారాయణ మాటలు మర్యాదగా రాని ఈ శివనారాయణ పరువు కోసం ప్రాణాలైనా వదిలేస్తాడు కానీ తగ్గడు అని అంటాడు. మేం వ్రతానికి రాలేదు నా మనవరాలి కోసం వచ్చామని అంటాడు. అందరూ వ్రతం దగ్గరకు వస్తారు. జ్యోత్స్న గురించి అడుగుతారు.
మా అమ్మని ఎందుకు అడుగుతారు అని అంటే శివనారాయణ నా మనవరాలు ఎక్కడ అని అడుగుతాడు. జ్యోత్స్న ఇక్కడికి రాలేదు అత్త అని కార్తీక్ చెప్తాడు. వచ్చింది అనిపిస్తే వెళ్లి వెతుక్కోండి వ్రతానికి ఇబ్బంది కలిగించొద్దని అంటాడు. ఇక పెద్దాయన జ్యోత్స్నని వెతకమని చెప్పి జ్యోత్స్నకి ఏమైనా అయితే అప్పుడు మీ సంగతి చెప్తా అంటాడు. నేను ఇరుక్కుపోయేలా ఉన్నానని అనసూయ అనుకుంటుంది. వ్రతం అయితే తలుపు తీస్తానని తర్వాత పారిపోతానని అనసూయ అంటుంది. ఇక దీప ఏదో గొడవ అయ్యేలా ఉందని శౌర్యని తీసుకొని వెళ్లిపోమని అనసూయతో చెప్తుంది. జ్యోత్స్న కోసం అందరూ వెతుకుతుంటారు. జ్యోత్స్న తలుపు కొడుతూనే ఉంటుంది. ఆ సౌండ్ విన్న పారిజాతం తలుపు తీస్తుంది. జ్యోత్స్న బయటకు వచ్చి వ్రతం ఆపాలని పరుగులు తీస్తుంది. అందరూ చూసి పరుగులు తీస్తారు.
జ్యోత్స్న: నీతో కలిసి పెద్దల దగ్గర ఆశీర్వాదం దీపకు లేదు.
కాశీ: అక్కా.
జ్యోత్స్న: అక్కా లేదు గాడిద గుడ్డు లేదు నోర్ముయ్‌రా ఈ మహానుబావుడు నా మెడలో కట్టాల్సిన తాళి దాని మెడలో కట్టాడు కాదు కాదు మేడం కట్టించుకుంది.
దీప: జ్యోత్స్న తెలియకుండా మాట్లాడకు.
జ్యోత్స్న: నీ స్వార్థం కోసం పక్కవాళ్ల అదృష్టాన్ని లాక్కుపోయే నీచమైన మనిషివే నువ్వు.
కార్తీక్: జ్యోత్స్న నా భార్యని ఏమైనా అంటే చెంప పగులుతుంది.
శివనారాయణ: కొట్టరా నువ్వు నా మనవరాలిని కొడుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా.
కాంచన: నాన్న
శివనారాయణ: నువ్వు నన్ను అలా పిలవకు నీకు ఆ అర్హత లేదు. నేను నా మనవరాలితో నీ కొడుకు పెళ్లికి ఒప్పుకున్నాక నువ్వు నీ కొడుకుకు దీపతో పెళ్లి చేశావు అంటే నీ దృష్టిలో నీ తండ్రి చచ్చినట్లే కదా.
కాంచన: నాకు తెలీదు నాన్న
శివనారాయణ: నీ కొడుకుకి తెలుసు.
కార్తీక్: దీపని పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ముందే తెలిసున్నా నేను దీపనే పెళ్లి చేసుకునే వాడిని.
జ్యోత్స్న: విన్నావా తాత బావ ఏమన్నాడో.
శ్రీధర్ తన రెండో పెళ్లి విషయంలో కలుగజేసుకోవద్దని శివనారాయణ్ని అంటే నీ వల్ల అడ్డమైన వాళ్లతో మాటలు పడుతున్నానని పెద్దాయన అంటే ఆయన్ను నేను పిలిచా అవమానించవద్దని కాంచన అంటుంది. దానికి దశరథ్ అయన నాన్నని అవమానించవచ్చా అంటే స్వప్న మరి మా వదినని జ్యోత్స్న అంటుందని అంటుంది. నా కూతురి పేరు తీసి మాట్లాడుతున్నావేంటి అని సుమిత్ర అంటుంది. దానికి దాసు నా కోడలిని ఏం అనొద్దు మాకు సంబంధం లేదు అంటాడు. దానికి కాశీ దీప మా అక్క నాన్న అక్కకి నేను అండగా ఉన్నానని అంటాడు. జ్యోత్స్న కార్తీక్‌తో నువ్వు నా ఫ్యామిలీని అవమానిస్తున్నావ్ అంటాడు. జ్యోత్స్నని ఇంటికి వెళ్దామని అంటే కాంచన తన కొడుకు కోడల్ని దీవించమని అంటాడు.
దానికి పెద్దాయన ఏం దీవించాలి బావ బావ అని రోడ్డున తిప్పిస్తున్నావ్ బాగానే నా మనవరాలి జీవితం నాశనం చేశావు సంతోషంగా ఉండు అనాలా లేక నీ కోడలికి తిండి పెట్టినందుకు మాకు బాగా బుద్ధి చెప్పావ్ నీ వల్ల మేం ఇంటిళ్ల పాది ఏడుస్తున్నాం నువ్వు మాత్రం సంతోషంగా ఉండు అని దీవించాలా అంటాడు. కాంచన ఆశీర్వదించమని అంటే స్వప్న అక్షింతలు తీసుకొస్తుంది. దాంతో పెద్దాయన వాటిని విసిరి కొడితే వెళ్లి కార్తీక్, దీపల మీద పడతాయి. నీ కోపాన్ని దేవుడు దీవెనలా మార్చేశాడు అని కాంచన అంటే ఇది నా దౌర్భాగ్యం అని ఆయన వెళ్లిపోతాడు. జ్యోత్స్న తీసుకొని పారు వెళ్లిపోతుంది. సుమిత్ర ఇద్దరినీ దీవిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.