అన్వేషించండి

Karthika Deepam 2 Serial October 1st: కార్తీకదీపం 2 సీరియల్: బావ కావాలి.. బావ కావాలని ఇంట్లో వాళ్లని బతిమాలుతోన్న జ్యోత్స్న.. అత్తాకోడళ్ల ఏడుపు చూస్తే కన్నీరు తప్పదు!

Karthika Deepam 2 Serial Episode బావని పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న ఇంట్లో వాళ్లని బతిమాలడం, కాంచన అందరూ తనని అనాథ చేశారని ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కాశీ, స్వప్నలకు నువ్వు పెళ్లి చేయడం వల్లే కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి ఆగిపోయిందని పారిజాతం దీపతో చెప్తుంది. తన తాతయ్య సంబంధం వద్దని చెప్పారని చెప్పి జ్యోత్స్న ఏడుస్తుంది. బావతో నా పెళ్లి జరగదని జ్యోత్స్న ఏడుస్తుంది. దీప షాక్ అయిపోతుంది.

జ్యోత్స్న: ఈ కుటుంబాన్ని నాశనం చేయాలి అనుకున్నావ్ చేశావ్. నా జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నావ్ చేశావ్. ఇంకెందుకు ఆలస్యం పో  పోయి మా బావని పెళ్లి చేసుకో. దాని కోసమే కదా ఈ నాటకాలు అన్నీ ఆడింది.
సుమిత్ర: ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడటానికి సిగ్గుండాలి జ్యోత్స్న.
పారిజాతం: నీ కూతురి పెళ్లి ఆగిపోయింది సుమిత్ర
సుమిత్ర: దానికి కారణం దీప కాదు.. తప్పు చేసింది అన్నయ్య దానికి శిక్ష అనుభవిస్తుంది జ్యోత్స్న. దీన్ని కన్నందుకు లేనిపోని ఆశలు కలిగించినందుకు మేం ఇప్పుడు ఆ శిక్ష అనుభవించాలి. దీప పెళ్లి చేయకపోతే స్వప్న, కాశీ పెళ్లి చేసుకోరా. ఈ నిజం తర్వాత అయినా ఈ నిజం తెలిసిపోదా. ఇప్పుడు కూతుర్ని వద్దనుకున్న ఆ మనిషి రేపు మనవరాలిని కూడా వద్దునేస్తారు. ఇందులో దీప తప్పేముంది. తప్పు చేసిన మనిషిని వదిలేసి సాయం చేసిన మనిషిని తిడుతున్నారు. నువ్వు లోపలికి వెళ్లు జ్యోత్స్న.
జ్యోత్స్న: వెళ్లను మమ్మీ నువ్వు ఇప్పుడు నన్ను కొట్టినా నాకు దెబ్బ తగలదు ఎందుకంటే ఈ దీప నా గుండెల మీద దెబ్బ కొట్టింది. నా జీవితం మీద కొట్టింది. నా ప్రేమ మీద కొట్టింది. బతికుండగానే నన్ను చంపేసింది.  
పారిజాతం: నా జీవితానికి ఇది చాలు అనుకున్నా దీని అదృష్టానికి ఎవరి దిష్టి తగిలిందో ఇలా అయింది. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో ఈ దరిద్రం ఇంట్లో ఉంటే ఈ ఇళ్లు మనస్సాంతిగా ఉండదు. దీన్ని పంపేయ్.
జ్యోత్స్న: పోతుందిలే గ్రానీ వచ్చిన పని అయిపోయింది కదా. నా చేతులతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు నా జీవితం నాశనం చేశావ్ దీప. నిన్ను నమ్మాను దీప నట్టింట్లో ముంచేశావ్ అని ఏడుస్తుంది. సుమిత్ర జ్యోత్స్నని తీసుకెళ్లి పోతుంది.
దీప: మనసులో తాతయ్య గారి ఇంత పెద్ద శిక్ష తీసుకుంటారని అనుకోలేదు జ్యోత్స్న తప్పు చేసిన వాళ్లకి కదా శిక్ష వేయాలి. కార్తీక్ బాబు, కాంచనమ్మలకు శిక్ష వేశారు. కుటుంబంలో ఒకరు తప్పు చేస్తే జీవితాలు తలకిందులైపోతాయని అనడానికి ఇదో ఉదాహరణ. కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి ఎలా చేయాలి. పెళ్లి జరగకపోతే జ్యోత్స్న పరిస్థితి ఏంటి.

కార్తీక్ తల్లికి కాఫీ ఇస్తాడు. కార్తీక్‌ని కాంచన లండన్ వెళ్లిపోమని అంటుంది. నీతో పాటు నేను వచ్చేస్తా అంటుంది. నీకు ఒక్కరే మిగిలారు అది నేను నాకు ఒక్కరే మిగిలారు అది నువ్వే అని ఏడుస్తుంది. మీ నాన్న చేసిన ఒక్క తప్పు నన్ను అందిరికీ దూరం చేసిందిరా అని ఏడుస్తుంది. దీపని చూసి జాలి పడే తనకు తన దీప పరిస్థితే వచ్చిందని అంటుంది. 

కాంచన: ఈ రోజే ఇలా ఉంటే రేపు ఎలా ఉంటుందో అని భయంగా ఉందిరా మనం ఎక్కడికైనా వెళ్లిపోదాం. వెళ్లిపోదాంరా 
కార్తీక్: మనం ఇక్కడి నుంచి వెళ్లిపోతే నువ్వు మామయ్యని, తాతయ్యని మర్చిపోగలవా.
కాంచన: ఎందుకు మర్చిపోవాలిరా ఒక ఆడది కానీ మగాడు కానీ ఏ దేశం పోయినా కలిసి బతకడానికి ఒక తోడు దొరకొచ్చు. సంపాదించాలి అనుకుంటే సంపాదించుకోవచ్చు. పిల్లల్ని కనాలి అంటే కనొచ్చు కానీ జన్మనిచ్చిన తల్లిన తల్లిదండ్రులు, రక్తం పంచుకొని పుట్టిన తోడ బొట్టిన వాళ్లు ప్రపంచంలో ఎక్కడా దొరకరు. దొరకరురా. భగవంతుడిచ్చే బంధాలురా ఇవి. ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఎందుకు బతికుండాలో కారణం కూడా లేదురా.
కార్తీక్: మామయ్య వాళ్లకి నువ్వు ఎందుకు నిలదీయలేదు. వాళ్ల మనసులో మాటలు కూడా నువ్వే అర్థం చేసుకుంటే ఎలా వాళ్లకీ నీ మనసులో మాటలు అర్థం కావు. మనిషి పెరిగారే కానీ తాతయ్యకు బుద్ధి లేదమ్మా.
కాంచన: వద్దురా మా నాన్నని ఏం అనుకు. వద్దు అన్నందుకు నేను ఎంత బాధ పడుతున్నానో వాళ్లు కూడా అంతే బాధ పడుతుంటారు. మొదటి సారి నేను అవిటి దాన్ని అన్న బాధ కలుగుతుందిరా. అందరూ ఉండి మనల్ని అనాథల్ని చేశారు. 

జ్యోత్స్న: (హాల్లో కూర్చొన్న జ్యోత్స్నకి తల్లి కాఫీ ఇస్తుంది. జ్యోత్స్న కోపంతో కాఫీ కప్పు విసిరి కొడుతుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు.) ఒక కాఫీ కప్పు పగిలితేనే మీరు ఇంతలా బాధ పడితే మరి నేను ఎంత బాధ పడాలి ఎన్ని ముక్కలు అవ్వాలి. నేనే ఏ తప్పు చేశాను డాడీ నాకు ఎందుకు ఈ శిక్ష. బావతో పెళ్లి జరగదని నువ్వు, తాత వెళ్లి చెప్పొచ్చారు కదా డాడీ. 
దశరథ్: అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో నీకు తెలుసు కదా.
జ్యోత్స్న: మీరు నిర్ణయాలు మార్చుకున్నంత తేలికగా నేను మనసు మార్చుకోలేను.
శివనారాయణ: అలా అని ఈ ఇంటి పరువు పోగొట్టిన ఆ ఇంటికి కోడలిగా పంపాలా.
జ్యోత్స్న: నాకు తెలిసి తెలియని వయసులో బావని పట్టుకొని అందరూ నీ మొగుడు నీ మొగుడు అంటుంటే అప్పుడు నేను మమ్మీని అడిగాను ఎందుకు అమ్మ అలా అందరూ అంటున్నారు అంటే బావతో నీ పెళ్లి అందుకే అలా అంటున్నారు అనింది. పెళ్లి అంటే ఏంటమ్మా అని అడిగాను ఎలా చెప్పాలో తెలీక మీరిద్దరూ జీవితాంతం కలిసే ఉంటారని చెప్పింది. అమ్మ చెప్పిందని ఆ రోజు నుంచి నేను వేరు బావ వేరు అనుకోలేదు ఇద్దరం ఒకటే అనుకున్నా. అలాగే బతుకుతున్నాను. అలా నన్ను మార్చడం మీ తప్పా నా తప్పా. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు పెళ్లి అన్నారు. ఇప్పుడు మీకు నచ్చడం లేదని నా మనసు చంపుకోమంటే ఎలా. ఎవరో తప్పు చేశారని నాకు శిక్ష వేస్తే ఎలా. 
శివనారాయణ: మీ మామయ్య చేసిన పనికి ఆ నిందని మీ అత్తయ్య, బావ మోయాల్సిందే. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ నింద నువ్వు కూడా మోయాలి. అలాంటి ఖర్మ నీకు పట్టకూడదని అనుకుంటున్నా.
జ్యోత్స్న: తాత నా బాధ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు తాత. నాకు బావ కావాలి నేను బావనే పెళ్లి చేసుకుంటాను. కావాలంటే మేం ఇద్దరం ఫారెన్ వెళ్లిపోతాం. 
శివనారాయణ: నువ్వు ఫారెన్ వెళ్తావమ్మా మరి మేం ఎక్కడికి వెళ్లాలి. మేమంతా ఏ దేశం పారిపోవాలి. అందరూ మమల్ని వెలెత్తి చూపిస్తే పరువు పోయిన మేం పై  అంతస్తు నుంచి కిందకి దూకేయాలి. బయటకు వెళ్తే మీ నాన్నని అడుగుతారు. గుడికి వెళ్తే మీ అమ్మని అడుగుతారు. చివరకు పనివాళ్లు కూడా అంటారు ఈ ఓనర్ల కంటే మనమే బెటర్ అని అలాంటి పరిస్థితి మనకు అవసరమా.  

జ్యోత్స్న తాతయ్య కాళ్లు చేతులు పట్టుకొని బావ కావాలని ప్రాధేయపడుతుంది. అవసరం అయితే బావతో వెళ్లిపోతానని అంటుంది. పాపం జ్యోత్స్న ఎన్ని చెప్పిన శివనారాయణ వినడు. అదంతా విని దీప లోపలికి వస్తుంది. నాకు బావ కావాలి బావ మాత్రమే కావాలి అని చాలా ఏడుస్తుంది. శివనారాయణ మాత్రం నో అంటే నో అని తేల్చి చెప్పేస్తాడు. ఇక పెళ్లి గురించి మర్చిపోమని అంటాడు. జ్యోత్స్న మాత్రం నా బావ తప్ప మరొకర్ని పెళ్లి చేసుకోనని అంటుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్యని చంపేద్దామని తండ్రితో చెప్పిన రుద్ర.. ఇక సత్య, క్రిష్‌లకు ముహూర్తం లేనట్లే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Crime News: విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Crime News: విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
CM Chandrababu: 'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!
'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Embed widget