అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today November 5th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దీప.. నా బావని నాకు ఇచ్చేయ్ అని ఏడ్చిన జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial Today Episode దీప దగ్గరకు జ్యోత్స్న వచ్చి రిసెప్షన్ చేసుకోవద్దని చెప్పడం దీప జ్యోత్స్నని కొడతా అని వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీపని రిసెప్షన్‌కి ఒప్పించమని అందరూ శౌర్యకి చెప్తారు. శౌర్య ఐడియా రావడం లేదు అని అంటే కాంచన శౌర్యకి చాక్లెట్స్ ఇస్తుంది దాంతో శౌర్య దీప దగ్గరకు వెళ్తుంది. దీప చాక్లెట్స్ చూడకుండా అనసూయ కొంగులో ముడి వేయమని చెప్పి దీప దగ్గరకు వెళ్తుంది. దీప దగ్గరకు వెళ్లి అది అది అని అంటూ అందరూ తండ్రి గురించి అడుగుతున్నారని నాన్న లేరా అని అడుగుతున్నారని చెప్తుంది. ఏదో ఒక రోజు మా నాన్నని మీ అందరికీ నాన్నని చూపిస్తాని చెప్పానమ్మా వాళ్లకి నాకు మంచి నాన్న ఉన్నారు అని తెలియాలి అంటే మీరు రిసెప్షన్ చేసుకోవాలి అమ్మ అని శౌర్య అంటుంది. 

దీప: శౌర్య ఇలా అడగమని నీతో ఎవరు చెప్పారు. 
కాంచన: దాని చిన్న మనసుకి అనిపించింది చెప్పింది దాని బాధ తీర్చాల్సింది తల్లిదండ్రులుగా మీరే. 
అనసూయ: ఆ బిడ్డ కోసమే కదా నువ్వు కార్తీక్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఆ బిడ్డ కోసమే ఈ రిసెప్షన్ చేసుకోవా.
దీప: కార్తీక్ బాబుని అవమానించడానికి మీరే వేదిక ఏర్పాటు చేస్తానంటే దానికి నేను ఒప్పుకోను.
కాంచన: కార్తీక్ ఫ్రెండ్స్ అన్ని మాటలు అంటే బయట వాళ్లు ఇంకెన్ని అంటారో అని దీప ఒప్పుకోవడం లేదు అనసూయ.

కార్తీక్ జాగింగ్‌ వెళ్లి డాక్టర్‌తో మాట్లాడుతాడు. పాపని ఇబ్బంది ఉంది అనిపిస్తుందని ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉందని చెప్తాడు. పాపని వీలైనంత ఆనందంగా ఉంచమని తన సంతోషమే తన ఆయుష్షు అని అంటాడు. ఇక ఆ పాప నా కూతురు అని కార్తీక్ చెప్తే డాక్టర్ షాక్ అయిపోతాడు. మరోవైపు జ్యోత్స్న దీప దగ్గరకు వెళ్లి గొడవ పెట్టుకోవడానికి వెళ్తుంటే పారిజాతం వెనకాలే వెళ్లి జ్యోత్స్నని ఆపుతుంది. దీపతో మాట్లాడటానికి ఇంటిలోపలకి వెళ్లాల్సిన అవసరం లేదు దీపనే బయటకు రప్పిస్తానని పారిజాతం చెప్తుంది. ఇక పారిజాతం దీప ఫోన్‌కి కాల్ చేస్తే శౌర్య లిఫ్ట్ చేస్తుంది.

దీపకి ఫోన్ ఇవ్వమని పారిజాతం చెప్తుంది. దీపతో నీతో మాట్లాడాలి బయటకు రా అనిపిలుస్తుంది. మీ ఇంటి బయటే ఉన్నాం అని అంటుంది. దీంతో దీప బయటకు వస్తుంది. మెడలో తాళి పడగానే వంట మనిషి యజమాని అయిపోయింది అని జ్యోత్స్న అనగానే కొడితే మీ ఇంటి గేటు ముందు పడతావ్ అని దీప అంటుంది. పారిజాతం ముందుకు వెళ్లి నా మనవరాలిని కొడతావా అంటే నిన్ను కూడా కొడతా అంటుంది. దాంతో జ్యోత్స్న ఇది దీప అసలు రూపం అని అంటుంది. 

జ్యోత్స్న: రిసెప్షన్ చేసుకుంటున్నారు అంట కదా నీ ప్రమేయమే లేకుండా తాళి కట్టారన్నావ్ నీ ప్రమేయం లేకుండానే వ్రతం అయింది అన్నావ్ ఇప్పుడు నీ ప్రమేయం లేకుండానే రిసెప్షన్ చేస్తున్నారా. చూస్తుంటే నీ ప్రమేయం లేకుండానే కాపురం చేసేలా ఉన్నావ్.
దీప: జ్యోత్స్న
జ్యోత్స్న: కొట్టవే..నిన్ను నమ్మిన పాపానికి నాకు నువ్వు కొడితే కానీ బుద్ధి రాదు. అయితే రిసెప్షన్ చేసుకోకు. మా బావ కట్టిన తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీకు నరకం చూపిస్తా.
దీప: అయితే వెళ్లి ఈ తాళి తీసేయమని మీ బావకి చెప్పు.
జ్యోత్స్న: మా గ్రానీ అప్పుడప్పుడు చెప్తుంది దీప దగ్గర ఉన్నది నీ దగ్గర లేదే అని అదేంటో తెలుసా నీకు లౌక్యం. నేను ఓ పూలకుండీ తీసుకొని అందులో ఓ గులాబి మొక్కని తీసుకొని దాన్ని జాగ్రత్త చూసుకుంటూ గులాబి పూస్తుందని ఆశగా చూస్తూ ఉంటే ఓ రోజు దానికి పువ్వు పూస్తే ఇలాంటి రోజు కోసమే నేను ఎదురు చూస్తుంటే నా తలలో పెట్టుకోవాలి అని నేను  అనుకుంటే నువ్వు కుండీని నాశనం చేసి నా తలలో పెట్టుకోవాల్సిన పువ్వులు నువ్వు పెట్టుకున్నావ్. నా తాళి నాకు కావాలి. నా బావ నాకు కావాలి. ఈ ఇంట్లో కోడలి స్థానం నాకు కావాలి. నేను ఏం చెప్పాలి అనుకున్నానో చెప్పొచ్చు అన్నావ్ కదా చెప్పేశా. కూతుర్ని అడ్డు పెట్టుకొని నా బావని సొంతం చేసుకున్నావ్ కదే వెళ్లిపోవే అందరికీ దూరంగా వెళ్లిపో.
దీప: అది నా చేతిలో లేదు. నా కూతురి సంతోషమే నాకు ముఖ్యం. నన్ను ఇలా ఉండనివ్వకుపోతే ఇన్నాళ్లు బాధతో కొట్టా ఇప్పుడు కోపంతో కొడితే నీ పని అయిపోతుంది. ఈ సారి నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాటలు గుర్తుపెట్టుకొని రా.

జ్యోత్స్నని పారిజాతం తీసుకొని వెళ్లిపోతుంది. దీపకి కార్తీక్‌కి రిసెప్షన్ జరగదు అని పారిజాతం అంటుంది. ఇక దీపని ప్రశాంతంగా ఉండనివ్వను అని పారిజాతం అంటే సుమిత్ర వస్తుంది. దీప ఏం అన్యాయం చేసిందని ప్రశాంతంగా ఉంచనంటున్నారు అంటే నీకు పదే పదే చెప్పడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. ఇక దీప దగ్గరకు ఎందుకు వెళ్లావ్ అంటే నేను కార్తీక్ భార్యని నేను బావని వదలను అంటుంది జ్యోత్స్న. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్యని ఇబ్బంది పెట్టడానికి భైరవి ప్లాన్.. భైరవి గెటప్‌కి పడిపడి నవ్వుకున్న తండ్రీకొడుకులు!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
Podarillu Serial Today August 7th: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
పొదరిల్లు: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget