Karthika Deepam 2 Serial Today March 28th: కార్తీకదీపం 2 సీరియల్:పూర్తిగా మోనితలా మారిపోయిన జ్యోత్స్న.. కామెడీ విలన్ అనుకుంటే కథంతా పక్కా ప్లాన్‌తోనే నడిపిందిగా!!
Karthika Deepam 2 Serial Today Episode దీప తప్పు చేశానని ఏడుస్తూ ఇంట్లో ఎవరూ తనని సపోర్ట్ చేయలేదని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ ఇంటికి సుమిత్ర వచ్చి దీప మీద కోప్పడుతుంది. విశ్వాసం లేదని అందుకే తన కూతురి నిశ్చితార్థం చెడగొట్టావని అంటుంది. గౌతమ్ మంచోడు కాదని దీప అంటే సాక్ష్యం చూపించమని సుమిత్ర అంటుంది. అనసూయ దీపకు సపోర్ట్ చేయడంతో ఒకప్పుడు నువ్వే నీ కోడలిని నడిరోడ్డు మీద వదిలేసేవా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావ్ మీరు అవకాశావాదులు. నేను అలా దేన్నీ ఈజీగా పట్టుకోను పట్టుకుంటే వదలను నీ కోడల్ని కూతురిలా చూసుకుంటే ఇది నా గుండెల మీద తన్నింది అని సుమిత్ర అంటుంది.
సుమిత్ర: దీప నన్ను ఎంతలా మాయ చేసింది అంటే నా కన్నకూతురు చెప్పింది కూడా వినకుండా దీపనే గుడ్డిగా నమ్మేదాన్ని. నా కూతురి విషయంలో ఈ మనిషి నాకు ఇచ్చిన మాట దాటేసినప్పుడే నేను ఈ మనిషి ఎలాంటిదో తెలుసుకొని ఉండాల్సింది. ఇప్పటికైనా తెలిసింది సంతోషం. నువ్వు రెచ్చిపోయి ఎక్కడున్నావ్ ఎవరి ఇంట్లో ఉన్నావో తెలుసుకోకుండా మా ముందే మాకు కాబోయే అల్లుడిని కొడుతుంటే ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాం. ఎందుకు దీప నా జీవితంతో ఆడుకుంటావ్ అని నా కూతురు ఏడుస్తుంటే చూస్తూ ఉండిపోయాం.
దీప: ఆ గౌతమ్ మంచోడు కాదు అమ్మ.
సుమిత్ర: ఇంకోసారి ఆ మాట అంటే చెంప పగలగొడతా. నా కూతురి మీద ఏదో గట్టిగా పెట్టుకున్నావ్ అందుకే ఇలా చేస్తున్నావ్. నువ్వు నన్ను అమ్మ అని పిలవకు అలా పిలిస్తే ఆ పిలుపునకే కలకం. నువ్వు నాకు ఎదురు పడకు. నా గుమ్మం తొక్కకు. మరోసారి నా కూతురి నీ వల్ల ఇబ్బంది పడితే చావుని దాటి బిడ్డను కన్నదాన్ని అదే బిడ్డ కోసం ఎంత కైనా తెగిస్తా.
దశరథ్: సుమిత్రా నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావ్.
సుమిత్ర: ఈ మనిషికి బుద్ధి చెప్పడానికి అండీ.
దశరథ్: ఎవరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు వెళ్దాం పద.
సుమిత్ర: ఇలా వదిలేస్తే మరోసారి మరో నింద వేస్తుంది.
దశరథ్: మరోసారి నష్టం జరగడానికి అక్కడేం మిగల్లేదు సుమిత్ర.
కాంచన: అన్నయ్య.
దశరథ్: నేను నా భార్యని తీసుకెళ్లడానికి వచ్చానమ్మా నా భార్య నీ కోడల్ని ఏమైనా అనుంటే క్షమించు.
కాంచన ఏడుస్తుంది. జ్యోత్స్న దిగులుగా కూర్చొని ఉంటుంది. జ్యూస్ తీసుకొని పారు వెళ్తుంది. నీకు ఏం బాధ లేదా ఇలా ఉన్నావ్ అని అడుగుతుంది. ఇక పారు జ్యోతో గౌతమ్ గురించి దీప చెప్పింది నిజమే కదా అని అడుగుతుంది. దాంతో జ్యో గ్రానీ మీద అరుస్తుంది. నానీనీ వెళ్లిపోమని అంటుంది. పారుని వెళ్లిపోమని కసిరేస్తుంది. నేను ఇంత బాధలో ఉంటే దీప చెప్పింది నిజమే అంటావ్ ఏంటి గ్రానీ అని ఏడుస్తుంది. తర్వాత తనలో తాను ఇదంతా నిజమే అనుకుంటుంది. నీతో పాటు నేను ఆరోజు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంటుంది. గౌతమ్‌తో మాట్లాడటానికి వెళ్లానని కానీ గౌతమ్ గురించి తెలిసి అదంతా నువ్వు చూశావని గుర్తు చేసుకొని అందుకే పెళ్లికి ఒప్పుకున్నా అనుకుంటుంది. దీపని పక్కా ప్లాన్‌తోనే ఇరికించేసింది. క్యాటరింగ్ ఇవ్వడం తాతని అత్తాబావల్ని పిలుపునకు పంపడం ఇదంతా జ్యో ముందే గ్రహించి ప్లాన్ చేసింది. ఇదంతా బావ కోసమే చేశానని జ్యో చావునైనా చస్తాను కానీ బావ కోసమే బతకుతా బావకోసమే చస్తా అడ్డు వచ్చిన వాళ్లని చంపుతా అనుకుంటుంది.
కార్తీక్ ఇంట్లో అందరూ జరిగింది తలచుకొని బాధపడతారు. శౌర్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తల్లి ఏడుస్తుంటే చూసి ఎందుకు ఏడుస్తున్నావ్ అమ్మ తప్పు చేసిన వాళ్లు ఏడుస్తారని చెప్పారు కదా నువ్వు ఏమైనా తప్పు చేశావా అని అడిగితే అవును నేను తప్పు చేశాను అని శౌర్య చేతులతో కొట్టుకొని ఏడుస్తుంది. పాపం శౌర్య షాక్ అయిపోతుంది. చిన్న పిల్ల ముందు ఇలా ప్రవర్తిస్తావా అని కార్తీక్ దీపని తిడతాడు. నేను తప్పు చేశానని ఆ ఇంట్లో వాళ్లే కాదు ఈ ఇంట్లో వాళ్లు కూడా అనుకుంటున్నారని దీప ఏడుస్తుంది. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావ్ అని కార్తీక్ అంటాడు. గౌతమ్ ఎలాంటి వాడు అయినా అందరిలో నువ్వు కొట్టడం తప్పు అని కాంచన అంటుంది. జ్యోత్స్న పెళ్లి ఆగితే నాకు వచ్చే ఉపయోగం ఏంటి అని దీప అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!





















