Ammayi garu Serial Today March 27th: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఇంటికి ఫైల్‌తో విరూపాక్షి.. జీవన్, మాధవిల ప్లాన్ ఫలిస్తుందా!
Ammayi garu Today Episode ఉగాది పచ్చడిలో వశీకరణ మందు కలిపి సూర్యప్రతాప్‌కి ఇవ్వాలని పీఏ మాధవి ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode జీవన్ పీఏ మాధవితో విరూపాక్షి అనాథాశ్రమానికి సంబంధించిన ఫైల్ పట్టుకొని ఉగాది రోజు ఇంటికి వస్తుందని ఆ ఫైల్ మీద సంతకం పెట్టిన సీఎంతో పాటు విరూపాక్షి జీవితాలు తలకిందులైపోతాయని అంటాడు. అర్థం కాలేదని మాధవి అనడంతో జీవన్ మాధవికి ఓ ఫైల్ ఇచ్చి దాని మీద సీఎం సంతకం పెట్టించాలని చెప్తాడు.
జీవన్: దీని మీద సీఎం సంకతం పెడితే రాష్ట్రం దద్దరిల్లే ఆర్థిక కుంభకోణం జరుగుతుంది. అదే జరిగితే సంతకం పెట్టిన సీఎం పదవి పోతుంది. సంతకం పెట్టించిన విరూపాక్షి పరిస్థితి ఆలోచించు.
మాధవి: ఈ ఫైల్ మీద సంతకం పెట్టిస్తే విరూపాక్షికి ఏమవుతుంది.
జీవన్: సంతకం చేయించేది నువ్వు కాదు రాధిక విరూపాక్షి పెట్టిస్తుంది. నువ్వు రేపు ఏదో ఒక విధంగా అక్కడికి వెళ్లు. విరూపాక్షి తీసుకొచ్చే ఫైల్ స్థానంలో ఇది పెట్టు. సంతకం పెట్టిన తర్వాత ఫైల్ సీక్రెట్‌గా తీసుకొచ్చేయ్ అప్పుడు విరూపాక్షి పని అయిపోతుంది.
మాధవి: సరే జీవన్. నా ప్రయత్నం చేస్తా.
ఉదయం రూప, రాజులు దేవుడికి దండం పెట్టుకుంటారు. పండగ సమయంలో అందరూ కలిసి ఉండాలని వచ్చే పండగకు ఇంటిళ్లపాది కలిసి పండగ చేసుకోవాలని సమస్యలు పరిష్కారం అవ్వాలని రాఘవ దొరకాలని కోరుకుంటుంది. అమ్మాయిగారి కోరిక తన కోరిక అని రాజు అనుకుంటాడు. రూప దేవుడికి హారతి ఇచ్చి అందరికీ హారతి ఇస్తుంది. దీపు పరుగున వస్తే మందారం వెనకాలే వస్తాడు. రూప దీపుని పట్టుకుంటుంది. హారతి ఇస్తుంది. దీపు రూపతో ఇదేం పండగ మమ్మీ అని అడుగుతాడు. న్యూ ఇయర్‌లా ఇది మన తెలుగు వారి పండగ అని రూప చెప్తుంది. విశ్వం విభజించబడిన ఈ రోజు ఉగాది అని రూప ఉగాది గురించి చక్కగా వివరిస్తుంది. సూర్యప్రతాప్ రావడంతో రూప హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది. ఈ రోజు ఏం కోరుకుంటే అది జరుగుతుందని రూప చెప్తుంది. విజయాంబిక దీపక్‌తో మనం వీళ్లు రోడ్డున పడాలి అని కోరుకుందామని అనుకుంటారు. దీపక్ మనసులో దాంతో పాటు మాధవి తనకు పడాలని కోరుకుంటాడు. ఇంతలో మాధవి వస్తే చూపులతోనే తినేలా చూస్తాడు. మాధవి వస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తుంది. ఉగాది పచ్చడి స్వయంగా చేసి తీసుకొచ్చానని మాధవి సూర్యప్రతాప్‌కి ఇస్తుంది.
మాధవితో రొమాన్స్ చేస్తూ ఉగాది పచ్చడి తింటున్నట్లు దీపక్ ఊహల్లోకి వెళ్లిపోతాడు. నిల్చొని కలలు కంటాడు. ఇక స్ఫూన్ తీసుకొస్తానని మాధవి కిచెన్‌కి వెళ్లి వశీకరణ మూలికలు కలుపుతుంది. రూప మనసులో అమ్మ తెచ్చిన ఉగాది పచ్చడి నాన్నతో తినిపించాలి అనుకుంటే ఈ మాధవి తెచ్చిన పచ్చడి తినాల్సి వస్తుందని అనుకుంటుంది. ఏం చేయాలి అని రాజుని అడుగుతుంది. రాజు దీపు తింటున్న అరటి పండు తొక్క చూపించి కాళ్ల కింద వేయమని సైగ చేస్తాడు. దాంతో రూప మాధవి వస్తుంటే అరటి తొక్క పడేస్తుంది. దాంతో మాధవి కింద పడిపోతుంది. ఉగాది పచ్చడి కింద పడిపోతుంది. రూప, రాజులు నవ్వుకుంటారు. దెబ్బలు తగిలాయా డాక్టర్‌ని పిలవాలా అని దీపక్ ఓవర్ చేస్తాడు. మాధవి మనసులో వీడేంటి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడని అనుకుంటుంది. మందారం మనసులో కట్టుకున్న భార్యని చనిపోయేలా కొడతాడు. పరాయి ఆడవాళ్ల మీద ప్రేమ చూపిస్తాడని అనుకుంటుంది.
విరూపాక్షి ఫైల్, పచ్చడి పట్టుకొని ఇంటికి వస్తుంది. రూప అమ్మా అమ్మా అని వెళ్తుంటే సూర్య ఆపేస్తారు. నీకు మా ఇంట్లో ఏం పని అని సూర్య ప్రతాప్ అంటాడు. పండగ పూట ఇలా అంటావ్ ఏంటి సూర్య.. నువ్వు మా ఇంటికి వచ్చావ్ నేను వస్తే తప్పేంటి అని అడుగుతుంది. నీ భార్యగానో నీ కూతురికి తల్లిగానో ఇంటి బంధువుగానో రాలేదని ప్రజా ప్రయోజనం కోసం వచ్చానని చెప్తుంది. ఎమ్మెల్యేగారు అపాయింట్ మెంట్ లేకుండా వచ్చేరేంటి అని మాధవి అడుగుతుంది. దానికి రాజు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అవకాశం అమ్మగారికి పెద్దయ్యగారు కల్పించారని చెప్తాడు. వచ్చిన పని ఏంటి అని సూర్య అడిగితే తర్వాత చెప్తా ముందు ఉగాది పచ్చడి తీసుకోండి అని ఇస్తుంది. సూర్య వద్దు అంటే అందరూ దేవుడి ప్రసాదాన్ని అలా అనొద్దని ఒప్పిస్తారు. దాంతో సూర్య తీసుకుంటాడు. ఈ ఐదేళ్లు నీ పాలనలో రాష్ట్రం రామరాజ్యం కావాలని నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని అంటుంది. అలా ఉండాలి అంటే నువ్వు చీటికి మాటికి నా దగ్గరకు రాకూడదు అంటాడు. ఇక రాజు తాను ఎమ్మెల్యే పీఏ అని అనాథ పిల్లల సమస్య చెప్పి మీరు వాళ్ల కోసం ల్యాండ్ ఇస్తానని చెప్పారని ఆ సంతకం కోసం వచ్చారని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని సార్లు మనసు ముక్కలు చేసుకోవాలి.. నేను ఓ ఆడపిల్లనే.. జ్యోత్స్న డైలాగ్స్ పీక్స్!





















