Viral News: నిజం తెలిసిన వెంటనే పెళ్లి ఆపేసిన వదువు ..అంతే కాదు రూ.4 లక్షల 'హగ్గింగ్ ఫీ' వసూలు - ఆ నిజమేంటో తెలిస్తే కలికాలం అనుకోక తప్పదు !
Hugging fee: పెళ్లికి అంతా రెడీ అయింది. కానీ హఠాత్తుగా పెళ్లి కుమార్తె పెళ్లిని రద్దు చేసుకుంది. ఇప్పటివరకూ తనను హగ్ చేసుకున్నందుకు నాలుగు లక్షలు వసూలు చేసింది.

Bride calls off wedding charges Rs 4 lakh hugging fee : పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిల కొరత ఏర్పడింది ఇండియాలోనే కాదు.. చైనాలో కూడా. ఇకా చెప్పాలంటే.. చైనాలో ఇంకా ఎక్కువ కొరత ఉంది. అందుకే అమ్మాయిలు పెళ్లి చేసుకునేటప్పుడు.. అబ్బాయిల్ని ఓ ఆట ఆడుకుంటున్నారు.
తాజాగా జరిగిన ఓ ఘటనలో ఒక మహిళ తన వివాహాన్ని రద్దు చేసుకుంది. వరుడి నుంచి 30,000 యువాన్‌లు (సుమారు రూ.4 లక్షలు) 'హగ్గింగ్ ఫీ'గా డిమాండ్ చేసింది. ఇంతకీ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారంటే ఆ మహిళ చెప్పిన కారణం విని..కలికాలం అని అందరూ ఆశ్చర్యపోయారు. వరుడు "చాలా నిజాయితీ"గా ఉన్నాడని, అతడి ఆదాయం "చాలా తక్కువ" అని ఆమె కారణాలు చెప్పింది.
గత ఏడాది ఒక మ్యాట్రిమొనియల్ సైట్ ద్వారా ఈ జంటకు పెళ్లి కుదిరింది. జనవరిలో వారు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. నవంబర్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. హోటల్ బుకింగ్‌లు చేసి, ప్రీ-వెడ్డింగ్ ఫోటోలు కూడా తీసుకున్నారు. చైనాలోని అనేక ప్రాంతాల్లో ఆచారం ప్రకారం, వరుడి కుటుంబం వధువు కుటుంబానికి 2,00,000 యువాన్‌లు (సుమారు రూ.25 లక్షలు) గిఫ్ట్‌గా చెల్లించింది.
In central China, a bride-to-be who backed out of her wedding demanded a 30,000 yuan ($4,200) “hugging fee,” claiming emotional distress during the couple’s photo session. After negotiations, she returned 170,500 yuan. The unusual case has gone viral online, reigniting debates… pic.twitter.com/Yn9K6FHG0O
— The Daily Jagran (@TheDailyJagran) October 12, 2025
కానీ మహిళ వివాహాన్ని రద్దు చేసుకుంది. మహిళ తమ పెళ్లి సంబంధం కుదుర్చిన వారికి కారణం చెప్పింది. వరుడు "చాలా నిజాయితీ"గా ఉన్నాడని, ఆర్థికంగా అసమర్థుడని చెప్పింది. గిఫ్ట్‌ను తిరిగి ఇవ్వడానికి అంగీకరించినప్పటికీ, ఫోటో షూట్ సమయంలో హగ్ చేసుకున్నందుకు కు 30,000 యువాన్‌లు డిడక్ట్ చేసుకుంటానని స్పష్టం చేశారు. ఫోటోగ్రాఫర్ అభ్యర్థన మేరకు హగ్ చేసుకున్నానని చెప్పింది. "గత దశాబ్దంలో మ్యాచ్‌మేకింగ్‌లో నేను చూసిన అత్యంత అసమంజసమైన కుటుంబం ఇది." ఆ పెళ్లి సంబంధం కుదుర్చిన పెద్ద మనిషి అసంతృప్తి వ్యక్తం చేశారు.
మాకు పెద్ద వివాదాలు లేవు. నేను అతడిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అని ఆమె చెబుతున్నారు. చర్చల తర్వాత, రెండు కుటుంబాలు మహిళ 1,70,500 యువాన్‌లు తిరిగి ఇవ్వడానికి అంగీకరించాయి. ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చైనాలోని అనేక ప్రాంతాల్లో పురుషులు ఎదురు కట్నం 1,00,000 నుంచి 5,00,000 యువాన్‌లు చెల్లించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.





















