Karthika Deepam 2 Serial Today March 26th: కార్తీకదీపం 2 సీరియల్: గౌతమ్‌ని కొట్టి నిలదీసిన దీప.. నిశ్చితార్థం ఆపేసిందనే నింద దీపకు తప్పదా!
Karthika Deepam 2 Serial Today Episode గౌతమ్‌ని చూసిన దీప గౌతమ్ బండారం బయట పెట్టడం నిశ్చితార్థం దగ్గర రచ్చ రచ్చ కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న, గౌతమ్‌ల నిశ్చితార్థం వేడుక మొదలవుతుంది. జ్యోత్స్నని చూసిన దాసు జ్యోత్స్న వారసురాలు కాదని దీపే వారసురాలు అని చెప్పాలని దీపని ఇంట్లోకి తీసుకొచ్చి హడావుడి చేస్తాడు. చివరి నిమిషంలో నిజం చెప్పలేకపోవడంతో శివన్నారాయణ దాసుని బయటకు తీసుకెళ్లమని చెప్తాడు. కార్తీక్, దీప వాళ్లంతా దాసుని తీసుకెళ్తుండగా గౌతమ్ అటుగా వస్తాడు కానీ దీప గౌతమ్‌ని చూడడు.
శివన్నారాయణ పెళ్లి వాళ్లతో దాసుకి మతి స్థిమితం లేదని చెప్తాడు. దాంతో గౌతమ్ తండ్రి కలెక్టర్ అతన్ని ఇంటికి పంపేయమని చెప్తాడు. శివన్నారాయణ పారుతో నీ కొడుకుని ఇంటికి పంపేయమని చెప్తారు. పారు బయటకు వెళ్తుంది. దాసు ఏం చెప్పాలి అనుకున్నాడా అని అందరూ ఆలోచిస్తారు. దీపని ఇంటి మనిషిగా చూసుకోమని చెప్పాలి అనుకొని ఉంటారని కార్తీక్ అంటాడు. పారు దాసు చేతిలో అక్షింతలు వేసి తన చేతిలో వేసుకొని నేను వేస్తాను అంటుంది. ఇక కార్తీక్ లోపలకి వెళ్తాను అంటే దీప వద్దు అంటుంది. దాంతో పారు నిజమేరా నిశ్చితార్థం రింగు తొడిగే టైంకి జ్యోత్స్న నిన్ను చూస్తే మళ్లీ రచ్చ చేస్తుంది. వద్దురా అంటుంది. దాంతో అందరూ నిజమే అనుకుంటారు. కార్తీక్, కాశీలు దాసుని తీసుకొని వెళ్లిపోవాలి అనుకుంటే దీప, స్వప్నలు నిశ్చితార్థం దగ్గర ఉండాలి అనుకుంటారు.
జ్యోత్స్న, గౌతమ్‌లు నిశ్చితార్థం రింగులు మార్చుకునే టైంకి దీప లోపల అందరికీ జ్యూస్‌లు ఇస్తుంది. గౌతమ్ రింగు పట్టుకొని మనసులో నువ్వు ఎంత అమారయకురాలివి నీ ఆస్తి కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటాడు. జ్యోత్స్న చేతికి రింగ్ పెట్టే టైంకి దీప గౌతమ్‌ని చూస్తుంది.
దీప: రేయ్ ఆగరా.. ఆ రోజు ఆ ఇంట్లో గొడవ పడింది నువ్వే కదా. తాతయ్య గారు వీడు మంచి వాడుకాదు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే మోసగాడు. ప్రేమ పేరుతో నాటకం ఆడి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు.
గౌతమ్: హలో ఎవరు మీరు ఏం మాట్లాడుతున్నారు.
దీప: ఏ మర్చిపోయావా ఆ రోజు పార్శిల్ తీసుకొచ్చినప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుంది. ఆ అమ్మాయికి సపోర్ట్‌గా నేను నిన్ను నిలదీశాను.
కార్తీక్: ఏం జరిగింది దీప.
శివన్నారాయణ: అదే మాకు అర్థం కావడం లేదు నిశ్చితార్థం జరగాల్సిన అబ్బాయి మీద చాలా పెద్ద నింద వేస్తుంది.
దీప: నింద కాదు తాతయ్య గారు అవన్నీ నిజాలు. కార్తీక్ బాబు ఆ రోజు ఆ ఇంట్లో పని చేసే అమ్మాయికి కడుపు చేసి కడుపు తీయించుకోవడానికి డబ్బులు ఇచ్చాడని చెప్పానే వాడు ఎవడో కాదు బాబు వీడే. అందరూ నోరెళ్ల బెడతారు. ఆ తర్వాత రోడ్డు మీద మరో అమ్మాయితో కనిపించాడు.
గౌతమ్: మనసులో అడ్డంగా దొరికిపోయాను ఏదో ఒకటి చేసి దీన్ని ఫూల్‌ని చేయాలి.
దీప: నాకు తెలిసి ఇద్దరే తెలీకుండా ఎంత మంది అమ్మాయిల జీవితం నాశనం చేసుకుంటాడు. ఇప్పుడు జ్యోత్స్న జీవితం నాశనం చేయడానికి రెడీ అయిపోయాడు.
గౌతమ్‌తల్లి: ఎవరమ్మా నువ్వు నా కొడుకు మీద నిందలేస్తున్నావ్.
గౌతమ్: నువ్వు ఇంకెవరినో చూసి నేను అనుకుంటున్నావ్. నేను నిన్ను చూడటం ఇదే మొదటి సారి. ఏంటి తాతయ్య గారు ఇది మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ముందే చెప్పాలి కదా ఇలా మీ ఫ్యామిలీ వాళ్లతో అవమానిస్తారా.
తాతగారు దీప తన ఫ్యామిలీ కాదు క్యాటరింగ్ ఇవ్వడానికి వచ్చారంటే గౌతమ్ జుట్టు పట్టి గంటేయమంటాడు. కార్తీక్ గౌతమ్ మీద అరుస్తాడు. తన నా భార్య ఏమైనా అంటే బాగోదు అని చెప్తాడు. నీకు ఏం గుర్తు రావడం లేదా అంటే లేదు అని గౌతమ్ అంటాడు. ఇక డబ్బు కోసమే ఇలా చేస్తున్నావని దీపని గౌతమ్ దీప గౌతమ్ చెంప పగలగొడుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఎవర్రా చిల్లర మనిషి అని కాలర్ పట్టుకుంటుంది. గౌతమ్ తల్లి దీపతో ఎవరే నువ్వు నా కొడుకు ఒంటి మీద చేయి వేస్తావ్.. అని అంటుంది. ఎవరూ ఏం మాట్లాడటం లేదు తను చెప్పేది నిజం అనుకుంటున్నారా అని గౌతమ్ అందరినీ నిలదీస్తాడు. జ్యోత్స్న కార్తీక్‌ని ప్రేమించింది అయినా నేను పెళ్లికి రెడీ అయితే వంట మనిషి నన్ను కొట్టినా అందరూ చూస్తూ కూర్చొన్నారు.. మీ అమ్మాయి మనసులో వేరొకరు ఉన్నారని తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకోవడం నా తప్పు అని గౌతమ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

