Karthika Deepam 2 Serial Today March 19th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కోడలు కాలేదని బాధపడ్డ కాంచన.. దీప, కార్తీక్‌ల నిర్ణయం ఏంటి.. జ్యో కాస్ట్‌లీ క్యాటరింగ్ ప్లాన్!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న కోడలు కాలేదని కాంచన ఫీలవడం దీప, కార్తీక్ అది చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న అత్త, బావల్ని నేను రప్పిస్తానని తాతకి నేను ఒప్పిస్తానని అమ్మానాన్నలతో చెప్తుంది. తాత ఒప్పుకోరు కదా అంటే నేను ఇప్పుడే అత్తింటికి వెళ్లి వచ్చా వాళ్లంతా చాలా సంతోషంగా ఉన్నారు.. మీరు మీ తరఫున చెప్పండి నేను తాతని అఫిషియల్‌గా ఒప్పిస్తానని జ్యోత్స్న అంటుంది. దశరథ్, సుమిత్ర చాలా సంతోష పడతారు. సుమిత్ర కూతురిని ముద్దాడుతుంది.
సుమిత్ర: ఇంతకు ముందు ఎంత బాధ పెట్టావో ఇప్పుడు అంత సంతోషపెట్టావ్.
దశరథ్: మనసులో జ్యోత్స్నలో ఈ మార్పు చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అసలు జ్యోత్స్న దాసుని శౌర్యని ఎందుకు చంపాలి అనుకుంది.
జ్యోత్స్న: మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు డాడీ. దాసుని ఎందుకు చంపాలి అనుకున్నానో మీకు సగమే తెలుసు. పూర్తి తెలిసే టైంకి దాసు ఉండడు. శౌర్య ఉండదు ఆ దీప కూడా ఉండదు.
సుమిత్ర: నా కూతురు నాకు మాట ఇచ్చింది అండీ నిలబెట్టుకుంటుంది. నా నమ్మకం నాకు ఉంది.
పారు: మనసులో అసలు ఇక్కడేం జరుగుతుంది జ్యోత్స్న నన్ను పక్కన పెట్టి వాళ్లఅమ్మకి నాన్నకి సపోర్ట్ చేయడం ఏంటి దీనికి మందు పెట్టి మార్చేశారా ఏంటి.
కార్తీక్ దీప ఇచ్చిన జంతికలు తింటూ డబ్బులు దీప డబ్బుల డబ్బాలో దాస్తారు. దీప పైటకు పిండి అంటుకోవడంతో కొంగు పట్టుకుంటాడు. దీప పైట పట్టుకున్నారేంటి అనుకుంటుంది. కార్తీక్ పిండి అంటుకుందని చెప్పి తుడుస్తాడు. సుమిత్ర, దశరథ్‌లు కాంచనకు నువ్వు ఫోన్ చేయ్ అంటే నువ్వు చేయ్ అని అనుకుంటారు. సుమిత్ర కాల్ చేసి దశరథ్‌కి ఫోన్ ఇస్తుంది. కాంచన అన్నయ్యతో మీ కూతురు పెళ్లి అయిపోతే మీరు సంతోషంగా ఉంటారులే. మంచి సంబంధం అంట కదా అని అంటుంది. ఆస్తి గురించి దశరథ్ మాట్లాడితే అవి వద్దు అనేస్తుంది. మనం ఎన్నో కలలు కన్నాం అన్నయా అవన్నీ కన్నీరు అయిపోయావి అని అంటుంది. కార్తీక్, దీపలు ఆ మాటలు వింటారు.
కాంచన: నా మేనకోడలి నిశ్చితార్థానికి పిలవడానికి ఫోన్ చేశావా లేదంటే ముహూర్తం పెట్టడానికి ఫోన్ చేశావా. నీ మౌనం అర్థమైందిలే అన్నయ్య. ఒకే కుటుంబంలా ఉండాల్సిన వాళ్లుం. అందుకే నా మేనకోడలినే కోడలిగా చేసుకోవాలి అనుకున్నా. అన్నీ ప్రాణం లేని ప్రమాణాలే చేసుకున్నాం అన్నయ్య. సరే ఉంటాను అన్నయ్య. నాకు ఫోన్ చేసి మాట్లాడాను అంటే నాన్న బాధ పడతాడు చెప్పకు అన్నయ్య. నీ కూతురి పెళ్లి బాగా జరగాలి అని చెల్లిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఉంటాను అన్నయ్య అని ఏడుస్తుంది.
కార్తీక్: అమ్మా మామయ్యతో నువ్వు మాట్లాడటం మొత్తం విన్నాను. నీ మేనకోడలు నీ కోడలు కాలేదని బాధ పడుతున్నావ్ కదా.
దశరథ్: నా వల్ల కావడం లేదు సుమిత్ర. మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ మీద ప్రేమ మొత్తం చెల్లి మీద పెంచుకున్నా. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతుంది. నేనేం చేయలేకపోతున్నా. చాలా బాధగా ఉంది.
సుమిత్ర: మీరేం బాధ పడకండి జ్యోత్స్న ఒప్పిస్తా అంది కదా.
దశరథ్: నా కూతురి నిశ్చితార్థానికి అయితే నా చెల్లి వచ్చి అక్షింతలు వేయాల్సిందే.
కాంచన: అన్నయ్య నేను ఎప్పుడు ఇచ్చిన మాట ఇప్పుడు గుర్తు చేయాలి అనుకున్నాడు. అది నేను ఇప్పుడు మాట్లాడుకోవద్దని అన్నాను. కానీ పుట్టింటి మీద ఆశ చావడం లేదు. భర్తని వదిలేశా. కొడుకు చాలు అనుకున్నా. మేనకోడలిని వదిలేసుకున్నా దీప చాలు అనుకున్నా. కొంత బాధ ఉంది కానీ బెంగ లేదు. నేను ఇక్కడ పడుతున్న బాధకి రెట్టింపు మా అన్నయ్య బాధ పడుతుంటాడురా ఎవర్నీ ఎవరూ ఓదార్చలేరు. మనం తర్వాత మాట్లాడుకుందాంరా. ఏం దీప నువ్వు కూడా నన్ను ఏమైనా అడగాలి అనుకుంటున్నావా.
దీప: ఒక్క మాట అడుగుతా మేన కోడల్ని కోడల్ని చేసుకోలేకపోయారు అన్న బాధ నాకు మీ కళ్లల్లో కనిపిస్తుంది. మనసుకి ఎంత సర్దిచెప్పుకున్నా మేనకోడలి స్థానంలో ఈ దీపని చూస్తున్నా అనుకున్నది మీ జీవితంలో అలాగే ఉంటుంది.
కాంచన: నా కోడుకు సంతోషంగా ఉన్నాడు నాకు అది చాలు.
దీప: మీరు సంతోషంగా లేరు అని అర్థమైంది. మీరు కోరుకున్నట్లు మీ మేనకోడలు అయింటే బాగుండేది.
కాంచన: నేను నిన్ను మేనకోడలు అనుకుంటే నాకు ఏం బాధ లేనట్లే కదా.
కార్తీక్ పాపని చదివిస్తాడు. మార్కులు తక్కువ వస్తున్నాయని తిడతాడు. దీప వచ్చి శౌర్య మీద కంప్లైంట్ ఇస్తుంది. దాంతో పాప పడుకుంటా అని వెళ్లిపోతుంది. దీప కార్తీక్‌తో మీ మనసులో జ్యోత్స్న ఉంటే జ్యోత్స్న పెళ్లి ఆగిపోతుందని అంటుంది. దానికి కార్తీక్ తనకు ఉంటుంది పుట్టిళ్లు కదా.. మేనకోడలికి తల్లి పేరు పెట్టుకుంది అలా ఎలా బాధ పడకుండా ఉంటుందని అంటుంది. ఇక జ్యోత్స్నలో మార్పు నిజం కాదని మూడు ముళ్లు పడే వరకు నమ్మలేం అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న నానమ్మని తీసుకొని కార్తీక్ రెస్టారెంట్‌కి వస్తుంది. వాళ్ల లేని టైం చూసి తన ఎంగేజ్మెంట్ క్యాటరింగ్ ఇవ్వమని చెప్తుంది. పారు లోపలికి వెళ్తుంది. కాస్లీ ప్లేట్ ఎంత అంటే 3వేలు అని మేనేజర్ చెప్తారు. దాంతో వంద మందికి క్యాటరింగ్ ఇవ్వమని చెప్పి మూడు లక్షలు ఫుల్ పేమెంట్ ఇస్తుంది. ఇక అడ్రస్ అడిగితే రాసిస్తుంది. ఇంతలో కార్తీక్ వాళ్లు వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

