Karthika Deepam 2 Serial July 19th: కార్తీకదీపం 2 సీరియల్: దీప ఇంటికి వచ్చి గొడవ చేసిన నర్శింహ, తన్ని తరిమేశారుగా.. ఎంగేజ్‌మెంట్ ఎవరూ ఆపలేరన్న జ్యో!
Karthika Deepam 2 Serial Episode నర్శింహ దీప ఇంటికి వచ్చి పాపని తీసుకెళ్తాని గొడవ చేయడంతో చుట్టూ వాళ్లు వచ్చి నర్శింహని కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య కార్తీక్ పేరుని గోడ మీద చెరిపేస్తుంది. తన కోసం ఇక రోజూ కార్తీక్ వస్తాడని అంటుంది. ఇక కార్తీక్‌ని చూసినందుకు తనకు బాగా ఆకలి వేస్తుందని తినిపించమని అంటుంది. దీక శౌర్యకి తినిపిస్తుంది. దీప మనసులో రేపు మనం ఊరు వెళ్తే నువ్వు ఇంకా బాధ పడతావని అనుకుంటుంది. నర్శింహ ఈ ఇంటికి కూడా వస్తాడని అనుకుంటుంది. జ్యోత్స్న పారు మాట్లాడుకుంటారు. దీప, కార్తీక్ ఏం మాట్లాడుకున్నారని పారిజాతం అడుగుతుంది. చూశాను కానీ మాటలు వినపడనంత దూరంలో ఉన్నానని జ్యో అంటుంది.
జ్యోత్స్న: బావకి దీప ఇళ్లు తెలుసు కానీ మనతో చెప్పలేదు. మమ్మీ చెప్పినప్పుడు సైలెంట్‌గా ఉన్నాడు. బావ మమ్మీతో ఏదో చెప్పడానికి వచ్చాడు. ఇంతలో కాల్ రావడంతో వెళ్లిపోయాడు. బావకి కాల్ చేసింది ఆ కడియం బాబాయ్. చివరికి వాడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా బావ నాకు ఇవ్వలేదు. అక్కడికి శౌర్య వచ్చింది బావ దీప దగ్గరకు వెళ్లాడు. దీప బావ ఒంటరిగా చాలా సేపు మాట్లాడుకున్నారు. ఏదో జరుగుతుంది. వాళ్లు ఏదో చేయబోతున్నారు.
పారిజాతం: ఈ ఎంగేజ్ మెంట్ జరగదు మనవరాలా. కార్తీక్ శౌర్య తన కూతురు అని చెప్పాడు. ఆ రోజే దీప వెళ్లిపోయింది. ఇద్దరూ చాటుగా కలుసుకుంటున్నారు. కార్తీక్ వాళ్ల ఇంటికి వెళ్తున్నాడు. ఇదంతా చూస్తుంటే పంతులు పెట్టిన నిశ్చితార్థ ముహూర్తానికి కార్తీక్, దీపలు..
జ్యోత్స్న: గ్రానీ..
పారిజాతం: నువ్వు అరిస్తే ఆగిపోతుంది అనుకుంటున్నావా. దీపని ఇక్కడికి రప్పిస్తాడు. మీ బావ ఆలోచన నీకు అర్థం కావడం లేదే. దీప నీ కంటే తెలివైనది. ఇప్పుడు నీ నిశ్చితార్థం జరగాలి అంటే దీప ఇక్కడుండాలి.
జ్యోత్స్న: దీపని నేను తీసుకొస్తా. ఈ నిశ్చితార్థం జరుగుతుంది. బావకి నాకు నిశ్చితార్థం జరుగుతుంది. దీన్ని దీప కాదు ఆ దేవుడు కూడా ఆపలేడు. ఇప్పుడు అందరినీ సరి చేయడం నాకు అవసరం. బావ నా మెడలో మూడు ముళ్లు వేసే వరకు అందరిని సరి చేయాల్సిన అవసరం నాకు ఉంది. రాసి పెట్టికో పంతులు పెట్టిన అదే ముహూర్తానికి నీ మనవడు మనవరాలికి నిశ్చితార్థం జరుగుతుంది. ఇది నా డెసిషన్, దీన్ని ఎవరూ మార్చలేరు.
దీప తలుపులు వేసేసి శౌర్యని పడుకోపెడుతుంది. ఇంతలో తలుపు కొట్టన శబ్ధం రావడంతో నర్శింహ వచ్చాడేమో అని కాంగారు పడుతుంది. వెళ్లి తలుపు తీస్తుంది. భయంతో గొడ్డలి పట్టుకొని వెళ్తుంది. బయట మొత్తం చూస్తే ఎవరూ ఉండరు. తర్వాత నర్శింహ వస్తాడు.
దీప: ఎందుకు వచ్చావ్. నా కూతురు లోపల నిద్ర పోతుంది. మర్యాదగా వెళ్లిపో.
నర్శింహ: నేను ఈ టైంలో వచ్చింది నిద్ర పోతున్న పిల్లని తీసుకెళ్లడం తేలిక అని. నర్శింహ లోపలికి వెళ్లాలని చూస్తూ దీప గొడ్డలి చూపించి ఆపుతుంది. శౌర్య తన కూతురని శోభ తన కూతురికి తల్లి అని నర్శింహ అంటాడు. దానికి దీప షాక్ అయిపోతుంది. నువ్వు నన్ను చంపాలి అంటే నీకు గొడ్డలి కావాలి అదే నేను నిన్ను చంపాలి అంటే నా కూతురికి నేను తండ్రి అని చెప్తే చాలు అని నర్శింహ అంటాడు. ఇక ఈ రోజు ఎలా అయినా కూతుర్ని తీసుకుపోతా అంటే దీప ఆపుతుంది. నర్శింహతో గొడవ పెట్టుకుంటుంది. ఇంతలో శౌర్య నిద్ర లేస్తుంది. దీప నర్శింహని బతిమాలుతుంది. అయినా నర్శింహ వెళ్లడు. ఇంతలో దీప, నర్శింహల తోపులాటతో నర్శింహ కింద పడిపోతాడు. దాంతో అందరూ వస్తారు. నర్శింహని కొట్టి అక్కడ నుంచి తరిమేస్తారు. ఇక దీప తలుపు తీసి పాపని హత్తుకొని ఏడుస్తుంది. పాపని తీసుకెళ్లి తలుపులు వేసేస్తుంది.
పాప మనల్ని కాపాడటానికి ఎవరూ లేరని కార్తీక్‌ని నువ్వే పంపేశావని అంటుంది. దీప వచ్చింది బూచోడు కాదని పాపకి ధైర్యం చెప్తుంది. కార్తీక్ సాయం తీసుకుందామని అంటుంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోదామని శౌర్య అంటుంది. శౌర్యని తీసుకొని ఊరు వెళ్లినా ఎక్కడికి వెళ్లినా నర్శింహ వదలడని ఏం చేయాలని దీప ఆలోచిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.