అన్వేషించండి

Satyabhama Serial Today July 18th: సత్యభామ సీరియల్: వియ్యంకుడిని జైలులో ఉంచాలని మహదేవయ్య ప్లాన్.. బామ్మర్దిని అనుమానించిన క్రిష్, నిజం తెలుసుకుంటాడా!

Satyabhama Serial Today Episode విశ్వనాథం జైలుశిక్ష అనుభవించాలని నిర్ణయించుకోవడం వెనక ఏదో పెద్ద రహస్యం ఉందని క్రిష్‌ అనుమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సత్య తన పుట్టింటికి వెళ్తానని మహదేవయ్యతో పాటు ఇంట్లో వాళ్లకి చెప్తుంది. రుద్ర, భైరవి సత్యతో వాధించి పంపడానికి ఇష్టం లేదని అంటారు. విశ్వనాథాన్ని విడిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయనే వినించుకోకపోయినప్పుడు నువ్వు వెళ్లి ఏం చేస్తావని అడుగుతాడు రుద్ర. ఇంతలో మహదేవయ్యకు పార్టీ ప్రెసిడెంట్ కాల్ చేసి నీ చిన్న కోడలు నిన్ను అందలం ఎక్కిస్తుందని అనుకుంటే కాళ్లు పట్టుకొని కిందకి లాగుతుందని అంటాడు.

మహదేవయ్య: చెప్పేదేదో సూటిగా చెప్పండి.
ఎంపీ: మీ వియ్యంకుడు పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు కదా. పొరపాటున కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అవ్వకు. ఆ బురద నీకు అంటుకుంటుంది. నీ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుంది. జాగ్రత్త.
మహదేవయ్య: చిన్న సత్యని లోపలికి తీసుకెళ్లురా. చూడు సత్య నేను సాయం చేస్తా అంటే ఎప్పుడైతే మీ నాన్న వద్దు అన్నాడో అప్పుడే నేనే కాదు ఈ ఇంట్లో ఎవరూ ఆయన గురించి ఆలోచించడానికి వీల్లేదు. 
సత్య: అదేంటి మామయ్య అలా అంటున్నారు. ఏదో సమస్య నాన్న గారి మనసుని సతాయిస్తుంది. అందుకే ఆయన అలా ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే ఆయనే సర్దుకుంటారు. ఆయన్ను వదిలేస్తే ఎలా. మీరు వదిలేసినా నేను కన్న కూతుర్ని నేను ఎలా వదిలేస్తాను.
మహదేవయ్య: ఆయన మొండితనం చూస్తూ సర్దుకుంటాడని నాకు అనిపించడం లేదు. ఆయన చేసిన తప్పు వల్ల ఈ ఇంటికి నష్టం జరగడానికి వీల్లేదు.
సత్య: మామయ్య మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారు. నా గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. దయచేసి ఆ మంచి తనం పక్కన పెట్టకండి. 
మహదేవయ్య: వద్దమ్మ నన్ను నాలాగే ఉంచమ్మా. మంచోడిని చేయకు. కొన్ని దినాలు నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు. బాధ అనిపించొచ్చు కానీ తప్పదు.
సత్య: నా వల్ల కాదు మామయ్య. మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. 
భైరవి: ఏయ్.. ఆయన చెప్పేది కరెక్టో కాదో చెప్పే స్థాయి కాదు నీది. ఆయన చెప్పేది వినడమే నీ పని.
క్రిష్: అమ్మా అలా అంటావ్ ఏంటి. తన బాధ చెప్పుకునే హక్కు లేదా ఈ ఇంట్లో. సత్య ఇప్పటికే బతిమాలింది చాలు ఇక బతిమాలకు. వాళ్లు నీకు పర్మిషన్ ఇవ్వరు. అయినా సరే నేను దగ్గరుండి నిన్ను నీ పుట్టింటికి తీసుకెళ్తా.
రుద్ర: అంటే బాపునే ఎదురిస్తున్నావా.
క్రిష్: లేదు సత్యకి ఒదార్పు ఇవ్వాలి అనుకుంటున్నా. 
భైరవి: ఛీ.. నీకు నీ తండ్రి కంటే పెళ్లామే ఎక్కువ అయిందారా.
క్రిష్: ఇది ఎక్కువ తక్కువల సమస్య కాదు. దయచేసి ఎవరూ మనసులోకి తీసుకోకండి. నన్ను నమ్ముకొని తనకి నేను తోడు ఉంటానని తనకి నేను ఉండగా ఏం కాదు అని నమ్ముకొని నా భార్య ఈ ఇంటిలో అడుగుపెట్టింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నీ బాధ్యత.
భైరవి: తీసుకుపోరా.. పల్లకిలో ఊరేగించి తీసుకుపోరా. ఇదేనా నువ్వు నీ బాపునకి ఇచ్చిన మర్యాద.
క్రిష్: సత్య పద పోదాం.
భైరవి: ఏంటి అయ్యా ఇది. ఏం అనకుండా నవ్వుతున్నావ్.
మహదేవయ్య: నా రాజకీయ భవిష్యత్ కాపాడుకోవడానికి ఇంకో రూట్‌లో రెడీ అయ్యాను. బుద్ధిగా బయటకు తీసుకొస్తా అంటే వద్దన్నాడు. ఇప్పుడు నా రాజకీయం కోసం వియ్యంకుడి మీద హంతకుడు అనే ముద్ర వేసి యావజ్జీవ శిక్ష వేయించబోతున్నా. బంధుత్వం పక్కన పెట్టి న్యాయం పక్క నిల్చొన్న మహదేవయ్య అని జనం నాకు జేజేలు కొడతారు. ఎలక్షన్‌లో కళ్లు మూసుకొని ఓట్లు వేస్తారు.
రుద్ర: ప్లాన్ బాగుంది కానీ సత్య ఊరుకోదు. కొట్లాడి మరీ తండ్రిని విడిపిస్తుంది. 
మహదేవయ్య: బలవంతుడితో గెలవచ్చు కానీ రాజకీయ నాయకుడితో గెలవడం కష్టం. సత్యని నా బలంతో ఒంటరిని చేస్తా. అయ్యో అనేవాళ్లే తప్ప ఆదుకునే వాళ్లు ఉండరు. నా కాళ్ల మీద పడటం తప్ప వేరే దారి లేకుండా చేస్తా. 

శాంతమ్మ హర్షతో తనని కొడుకు దగ్గరకు తీసుకెళ్లమని బతిమాలుతాను అంటుంది. ఆయన ఎవరు చెప్పినా వినడంలేదని విశాలాక్షి అంటుంది. విశ్వనాథం బయటకు ఎలా వస్తాడని అడుగుతారు. దానికి హర్ష నేను కూడా లొంగిపోతానని అంటాడు. విశాలాక్షి కొడుకుని తిడుతుంది. నువ్వు లొంగిపోతే నిన్ను జైలులో పెడతారు కానీ నాన్నని ఎలా వదిలేస్తారని సంధ్య అడుగుతుంది. నందిని వచ్చి మామయ్య అమాయకంగా జైలుకి పోయారని ఏదో ఒక రోజు వస్తారులే అని అంటుంది. ఇక క్రిష్, సత్య ఇంటికి వస్తారు. క్రిష్ నందినిని లోపలికి వెళ్లిపోమని అంటాడు. సత్య తల్లికి ధైర్యం చెప్తుంది. క్రిష్ లాయర్‌ని పెట్టి మామయ్యని బయటకు తీసుకొస్తానని అంటాడు. జైలులో విశ్వనాథం పిల్లలు కుటుంబాన్ని తలచుకొని బాధ పడతాడు. ఎస్‌ఐ వచ్చి కావాలని కేసులో ఇరుక్కున్నావని అంటాడు. కేసు నుంచి తప్పించడానికి మీ వాళ్లు సిద్ధంగా ఉన్నారని కోర్టుకి వెళ్తే రక్షించడం ఎవరి తరం కాదు అని ఎస్‌ఐ అంటాడు. కానీ మొండిగా విశ్వనాథం ప్రవర్తిస్తాడు. 

క్రిష్: ఒక మనిషి ఇంకో మనిషిని చంపాలి అనుకున్నాడు అంటే ఏదో పెద్ద కారణం ఉండాలి. పైగా మామయ్య లాంటి మనిషి ఇలాంటి పని చేశాడు అంటే చాలా గట్టి కారణం ఉండాలి. అది అందరికి తెలియాలి. లేకుంటే జరిగే నష్టం మామూలుగా ఉండదు.
హర్ష: కారణం అందరికీ తెలుసుకదా. కాళీ సంధ్య వెంట పడటం. 
క్రిష్‌: లేదు బామ్మర్ది. అంతకు మించి ఏదో ఉంది. ఆయన జైలులో ఉండాలి అని ఫిక్స్ అయ్యారు అందుకే చెప్పడం  లేదు. నిజాన్ని గుండెల్లో దాచుకొని తప్పు చేస్తున్నారు. మామయ్యని రక్షించాలి అంటే ఆ నిజం బయటకు తెలియాలి అంటాను.
హర్ష: బావ ఉన్న తల నొప్పులు చాలు వాటి నుంచి బయట పడితే చాలు. కొత్త సమస్యలు వద్దు. ఉహాగానాలు వద్దు. 
క్రిష్: ఇది ఉహాగానం కాదు నిజం.
హర్ష: అలా ఎలా చెప్తావు.
క్రిష్: నీ కళ్లలో కనిపిస్తున్న కంగారు బట్టి. అబద్ధం చెప్పడం తప్పు. నిజం దాచడం అంతకన్నా పెద్ద తప్పు. నువ్వు ఈ రెండు తప్పులు ఒకేసారి చేస్తున్నావ్ అని అనుమానంగా ఉంది. ఒక్క సంధ్య విషయం అయితే మామయ్య అంత బెదరడు. నేను డీల్ చేస్తా అని తెలుసు. నీతో కూడా చెప్పకుండా కాళీని డీల్ చేస్తా అనుకున్నాడు అంటే అది నాకు తెలియకూడని విషయం అయింటుంది. అందుకే నన్ను దూరం పెట్టాడు.
హర్ష: మనసులో.. సత్య కిడ్నాప్ విషయం బావకి తెలియకూడదు అని జాగ్రత్త పడుతున్నాం అని తెలిస్తే గొడవలు అయిపోతాయ్.
క్రిష్: బామర్ది ఏదో దాస్తున్నావ్. నువ్వు నిజం దాస్తే నష్టపోయేది మనమే. నాకు నిజం చెప్పకుండా పారిపోతున్నావ్ కదూ. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటా. నా ఆరాటం అర్థం చేసుకుంటావ్ అనుకున్నా కానీ నువ్వు మామయ్య కంటే మొండివాడివని ఇప్పుడే తెలిసింది. క్రిష్ కాళీ దోస్త్‌లను తీసుకురమ్మని బాబీ వాళ్లకి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: సత్యభామ సీరియల్: మొండికేస్తున్న విశ్వనాథం, చిరాకుతో వెళ్లిపోయిన మహదేవయ్య.. సత్య పుట్టింటికి వెళ్లగలదా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arvind Kejriwal: 'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
New Vande Bharat Trains: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
Vivo T3 Ultra: వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిగ్‌బీ కేబీసీ షోలో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న, ఖుష్ అవుతున్న ఫ్యాన్స్మోహన్ బాబు యూనివర్సిటీలో వివాదం, మంచు మనోజ్ సెన్సేషనల్ ట్వీట్Telangana High court on Hydra | తెలంగాణలో హాట్ టాపిక్ 'హైడ్రా' పై హైకోర్టు దృష్టి | ABP DesamSarpanch Unanimous Election | సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్థులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arvind Kejriwal: 'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
New Vande Bharat Trains: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
Vivo T3 Ultra: వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
Renu Desai: దేవుడు లేడు అత్యాశే ఉంది- వినాయక చవితి సెలెబ్రేషన్స్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం
దేవుడు లేడు అత్యాశే ఉంది- వినాయక చవితి సెలెబ్రేషన్స్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం
Vijayawada floods: వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?
వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Crime News: తెలంగాణలో దారుణాలు - ఆస్తి కోసం బావమరిది హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్
తెలంగాణలో దారుణాలు - ఆస్తి కోసం బావమరిది హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్
YSRCP : వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య - పార్టీ బాధ్యతలకునో ! తప్పెక్కడ జరిగింది ?
వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య - పార్టీ బాధ్యతలకునో ! తప్పెక్కడ జరిగింది ?
Embed widget