అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 15th: కార్తీకదీపం 2 సీరియల్: తల్లి ఎమోషనల్ మాటలకు మూగబోయిన కార్తీక్.. జ్యోత్స్నతో నిశ్చితార్థానికి సిద్ధమైనా!

Karthika Deepam 2 Serial Episode తన నిశ్చితార్థానికి దీప కచ్చితంగా ఉండాలని జ్యోత్స్న ఇంట్లో వాళ్లతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode నిశ్చితార్థం తనకు ఇష్టం లేదని కార్తీక్ కాంచనతో చెప్పాలి అనుకుంటాడు. కాంచన ఫోన్‌లో తన స్నేహితులతో మాట్లాడుతూ కార్తీక్ నిశ్చితార్థం గురించి చెప్పి తెగ హడావుడి చేస్తుంది. ఇక తండ్రిని వెతుకుతాడు. నాన్న కూడా ఉంటే బాగుండేదని నీకో విషయం చెప్పాలి అంటాడు. ఇక కార్తీక్ తన తల్లితో నిశ్చితార్థాన్ని ఆపాలి అంటాడు. కాంచన రెస్టారెంట్ ఓపెనింగ్‌కి ఈ నిశ్చితార్థానికి సంబంధం పెట్టొద్దని ఇంకా వాయిదాలు వేయడం మా వల్ల కాదు అని నిశ్చితార్థం జరగాల్సింది కరాఖండీగా చెప్పేస్తుంది.

కాంచన: నా ఇన్నాళ్ల అవిటితనం తలచుకొని నేను ఎప్పుడూ బాధ పడలేదురా. ఎందుకో తెలుసా. అని కార్తీక్‌ని దగ్గరకు తీసుకొని.. ఈ కాళ్లే నా మాట విని ఉంటే నా కొడుకు పెళ్లి బాధ్యతలు నా భుజాన వేసుకొని క్షణం తీరిక లేకుండా అన్ని పనులు చేస్తూ హడావుడిగా అటూ తిరిగి పనులు చేసేదాన్ని. కానీ నాకు ఆ దేవుడు ఆ అదృష్టం ఇవ్వలేదురా. కానీ ఏ రోజు కోసం అయితే మీ అమ్మ ఆశగా ఎదురు చూస్తుందో ఆ రోజును మన జీవితాల్లోకి తీసుకొచ్చాడు. కాళ్లు లేకపోతే ఏం చేతులు ఉన్నాయి కదా. నా ముచ్చట ఎలా తీర్చుకుంటానో చూడు. నేను ఏదీ మిస్ అవ్వకూడదు నా కళ్లతో చూసి సంతోషపడతా.
కార్తీక్: మనసులో.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న నాతల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదు అని ఎలా చెప్పను. అమ్మతో వద్దు నాన్నతో చెప్తాను.
కాంచన: ఏంట్రా అలా మౌనంగా ఉన్నావ్.

శౌర్య గోడ మీద మళ్లీ కార్తీక్ అని రాసుకొని దాని కిందే దిగులుగా కూర్చొని ఉంటుంది. దీప శౌర్య కోసం పులిహోర చేసి తీసుకెళ్తుంది. తినిపిస్తా అంటే నాకు అవసరం లేదని అనేస్తుంది. నేను అలిగాను అని నాతో మాట్లాడకని అంటుంది. కార్తీక్ దగ్గరకు తీసుకెళ్లవని అంటుంది. కార్తీక్ దగ్గరకు తీసుకెళ్తావా అని అడుగుతుంది. మనకు వాళ్లకి సంబంధం లేదని దీప అంటుంది. దాంతో కార్తీక్‌కి మనకు ఏం సంబంధం లేదా అని శౌర్య అడుగుతుంది. ఇంటికి వెళ్లనివ్వవని రోడ్డు మీద కలిసినా మాట్లాడనివ్వలేదని అంటుంది. వాళ్లంతా మనకు ఏం కాదు అని మనకోసం బాధ పడరని వాళ్లకి మనం సాయం చేశారని మనకు వాళ్లు సాయం చేశారు అయిపోయిందని అంటుంది. ఇక మళ్లీ ఆ కుటుంబంలోకి రాలేను ఎవరి సంతోషాలు దూరం చేయలేనని దీప అనుకుంటుంది. 

అనసూయ: అది అసలే నువ్వు చేసిన పనికి పీకల మీద కోపంతో ఉంది. వెళ్లి రెచ్చగొడితే ఊరుకుంటుందా అందుకే రెండు పీకింది.
శోభ: పెళ్లాన్ని తన్నించడమే కాకుండా నువ్వు కూడా తన్నులు తిని వచ్చావ్ నువ్వేం మగాడివయ్యా. 
అనసూయ: నువ్వు వీడిని ఇలాగే రెచ్చగొట్టు పోయిన సారి నీ రెండు చెంపలు వాయించింది. ఈ సారి వీధిలో జుట్టు పట్టుకొని లాక్కెళ్లుతుంది.
శోభ: అంత వరకు వస్తే ఊరుకుంటానా మా అమ్మని రంగంలోకి దింపుతా. 
అనసూయ: దాని ఆవేశం తెలిసి కూడా ఇలాగే రెచ్చగొడితే నీ మొగుడిని నిజంగానే చంపుతుంది. కూతుర్ని కార్తీక్‌ గాడికి అప్పగించి జైలుకి పోతుంది. ఇప్పుడు అది అందరినీ వదిలేసి దూరంగా బతుకుతుంది. కొద్ది రోజులు దాని జోలికి వెళ్లొద్దు.
శోభ: అయితే ఇక బిడ్డ రానట్లేనా. సరై అయితే నేను మా చుట్టాల్లో ఎవరో ఒక బిడ్డని పెంచుకుంటా.
అనసూయ: ఎవరి బిడ్డో వాడికి బిడ్డ ఎలా అవుతుందే. వాడికి కూతురుంది. అది నీకు కూతురు అవుతుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు. 
శోభ: సరే అత్తయ్య మొగుడు మాట నిలబెట్టకోకపోయినా అత్త అయినా నిలబెట్టుకుంటుందేమో చూద్దాం. 

జ్యోత్స్న ఇంట్లో అందరూ నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటారు. బట్టల గురించి మాట్లాడుకుంటారు. బావకి నేనే డ్రస్ డిజైన్ చేస్తానని జ్యో అంటే వాడికి నీ డిజైన్ నచ్చదని వాడి టేస్ట్ వేరే ఉందని పారు అంటుంది. అందరూ ప్రశ్నించడంతో నాకు నోటి దురద అని తనలో తానే తిట్టుకుంటుంది. కవర్ చేస్తుంది. ఇక శివనారాయణ కోడలితో దీప గురించి అడుగుతాడు. ఇక జ్యోత్స్న దీప ఏదో ప్లాన్ చేస్తుందని అనుకొని తల్లితో తన నిశ్చితార్థానికి దీప ఉండాలని అంటుంది. శౌర్య దీపతో అమ్మమ్మ నీతో ఏం చెప్పిందని అడుగుతుంది. దానికి దీప కార్తీక్‌బాబుకి, జ్యోత్స్నకి పెళ్లి చేస్తారని అంటుంది. మనం కూడా వెళ్తామా అని శౌర్య అడుగుతుంది. మరోవైపు కార్తీక్ పారిజాతం మాటలు తలచుకొని ఆలోచిస్తుంటాడు. నిశ్చితార్థం ఎలా ఆపాలి అని అనుకుంటాడు. ఇక జ్యోత్స్నని చెప్పాలని అనుకుంటాడు. కానీ జ్యోత్స్న సూసైడ్ చేసుకుంటానని అనుకున్న మాట గుర్తొచ్చి ఆగిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: అవుట్ హౌస్‌లో కార్తీక్.. పారిజాతం బ్లాక్‌మెయిల్ మామూలుగా లేదుగా!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget