Karthika Deepam 2 Serial Today January 1st: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి మరో కూతురు ఉందా.. ఆ పాప ఎవరు? పారు మీద దశరథ్‌కి అనుమానం!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న దాసు కాళ్లు పట్టుకోవడం వెనక కారణాన్ని పారిజాతం అడగటం జ్యోత్స్న కవర్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దాసు నిజం చెప్తానంటే జ్యోత్స్న దాసు కాళ్ల మీద పడి నాటకం మొదలు పెడుతుంది. పారిజాతం దూరం నుంచి మొత్తం చూస్తుంది. చనిపోతాను అని జ్యోత్స్న అంటే కన్న కూతురిని చంపుకునే మూర్ఖుడిని కాదని అనుకొని బయటకు వెళ్లిపోతాడు. మనవరాలు నా దగ్గర ఏదో దాస్తుంది అది తెలుసుకోవాలని పారు అనుకుంటుంది. ఇక దీప శౌర్యని పడుకో అంటే బెడ్ లేదు అది లేదు ఇది లేదు అని అంటుంది. కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు.
శౌర్యని మేడ మీద వెన్నెలలోకి తీసుకెళ్లి చల్లగాలిని ఆశ్వాదించమని వెన్నెల చూపించి దాన్ని ఎంజాయ్ చేయిస్తాడు. శౌర్య చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక దీపకు సారీ చెప్పించి కిందకి పంపి పడుకోమంటాడు. ఇక దీప, కార్తీక్ వెన్నెలతో మాట్లాడుకుంటారు. జ్యోత్స్న పడుకొని ఉంటే పారిజాతం పాలు తీసుకొని వస్తుంది. దాసు కాళ్లు జ్యో పట్టుకోవడం గురించి మాట్లాడుతుంది. దీపనే ఇంటి అసలైన వారసురాలు అని తెలిసిపోయిందేమో అని కంగారు పడ్డానని జ్యోత్స్న అనుకుంటుంది. నువ్వు చెప్తావా నా కొడుకుకి కాల్ చేసి అడగాలా అని అంటుంది. దానికి జ్యోత్స్న పారుతో నన్ను నాన్న అని పిలవమన్నాడు కదురదు అని చెప్తే నేనే తన కూతురిని అని మమ్మీతో చెప్పేస్తా అని బెదిరించాడని అందుకే కాళ్లు పట్టుకున్నా అంటుంది. పారిజాతం జ్యోత్స్న అబద్ధం చెప్తుందని అనుకుంటుంది.
ఇక దీప రాత్రి పడుకొని మధ్యలో లేచి టిఫెన్ బండి దగ్గరకు వెళ్లి దాని మీద పరదా కప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో కార్తీక్ వచ్చి దీపకు సాయం చేస్తాడు. ఇద్దరూ బండికి కప్పేసి తాడుతో కడతారు. తర్వాత ఇద్దరూ వెళ్లి పడుకుంటారు. ఉదయం జ్యోత్స్న హడావుడిగా ఆఫీస్‌కి వెళ్లాలి అని కారు దగ్గరకు వెళ్తే పారిజాతం కారులో ఉంటుంది. కారు దిగాలి అంటే దాసు దగ్గర నువ్వు నాకు చెప్పున్న ఏదో విషయం చెప్తేనే దిగుతాను అంటుంది. దాంతో జ్యోత్స్న అక్కడే ఉన్న తాతని పిలిచి గ్రానీ ఆఫీస్‌కి వస్తానంటోందని చెప్తుంది. దాంతో పెద్దాయన పారుని తిట్టి జ్యోత్స్నని మాత్రమే పంపుతారు. ఇక సుమిత్రతో జ్యోత్స్న పెళ్లి అయ్యే వరకు ఇద్దరినీ కలవకుండా చూడమని చెప్తాడు. దశరథ్ సుమిత్రతో పిన్ని జ్యోత్స్న విషయంలో మన కంటే ఎక్కువ చేస్తుందని దీని వెనక ఏమైనా కారణం ఉందా అనుకుంటాడు. ఇక కార్తీక్, దీపలు టిఫెన్స్ అందరికీ సర్వ్ చేస్తుంటారు. చాలా మంది వచ్చారు త్వరలోనే రెస్టారెంట్ పెట్టేయగలం అని కాంచన పాపతో అంటుంది.
ఇక ఒక రౌడీ అక్కడికి వస్తాడు. హడావుడి చేస్తాడు. టిఫెన్ వేడిగా కావాలి అని విసిరేస్తాడు. బజ్జీలు వేడిగా ఉన్నాయని తీసుకొచ్చి ఇస్తుంది దీప. ఇంత వేడిగా ఉంది పూరీ తీసుకొని రా అది వేయ్ ఇది వేయ్ అని దీప మీద అరుస్తాడు. కార్తీక్ దీపతో వాడు బాగా ఓవర్ చేస్తున్నాడని అంటాడు. ఇక ఓ పాప టిఫెన్ బండి దగ్గర నిల్చొని చూస్తూ ఉంటుంది. దీప ఆ పాపని చూస్తుంది. ఆ పాపని దీప టిఫెన్ చేయమని అంటే డబ్బులు లేవని అంటుంది దాంతో దీప ఫ్రీగా ఇస్తానని అంటుంది. ఆ పాప ఇలా టిఫెన్ పెట్టి తర్వాత పని చేయమని చెప్తారని అంటుంది.
అలా ఏం లేదు అని దీప అంటే పొట్లాం కట్టి ఇవ్వండి ఇంటికి వెళ్లి నేను మా అమ్మ తింటాం అని చెప్తుంది. ఇక ఆ పాప తన తండ్రి తాగుబోతు అని తల్లీని తనని కొడతాడని మొత్తం దీప కథనే తన కళ్ల ముందుకు తీసుకొస్తుంది. దాంతో ఆ పాపకి దీప టిఫెన్ ఇస్తుంది. పాప దీపని హగ్ చేసుకొని థ్యాంక్యూ అమ్మ అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: నెత్తి పట్టుకున్న మహదేవయ్య.. చిన్న కోడలిని ఏం చేస్తాడు? కవ్వించి మడతెట్టేసిన సత్య!