Karthika Deepam 2 Serial Today December 9th: కార్తీకదీపం 2 సీరియల్: గుత్తి వంకాయతో దీపలో మార్పు.. ఎగిరి గంతులేస్తున్న కార్తీక్.. గాలి తీసేసిన జ్యోత్స్న!
Karthika Deepam 2 Serial Today Episode దీప కార్తీక్ ఇష్టాలు తెలుసుకోవడం ప్రారంభించడంతో కార్తీక్ ఇన తన జీవితం నవవసంతంగా మారనుందని సంతోషపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప బాధ పడుతుంటే కార్తీక్ అక్కడికి వెళ్తాడు. తాతయ్య గారు మారి వస్తే మీరే మీ అమ్మగారికి పుట్టింటిని దూరం చేసేశారని ఏడుస్తుంది. వెళ్లడానికి ఒప్పుకోవాల్సింది అని దీప అంటే నీ నుంచి నన్ను ఎవరు వేరు చేసినా నేను ఒప్పుకోనని ఇప్పుడు నువ్వు నేను ఒకటే అని కార్తీక్ అంటాడు. నాకు ఆ కుటుంబం కంటే నువ్వే ముఖ్యమని అయినా మా తాత వచ్చింది తన మనవరాలి కోసమని అంటాడు. నీ మెడలో తాళి కట్టిన నాటి నుంచి నువ్వు నేను ఒకటే అని నీ గౌరవ మర్యాదలే నా మర్యాదలు అని అంటాడు. మా అమ్మ, నువ్వు నేను పాప అనసూయ గారు ఇదే మన కుటుంబం అని అంటాడు.
దీప మనసులో మా కోసం అందరినీ మీరు దూరం చేసుకుంటున్నారు. మీ ప్రేమ ముందు నేను ఓడిపోతున్నా బాబుగారు అని అనుకొని ఏడుస్తుంది. ఇక అనసూయ బాధపడొద్దని కాంచనతో పిలుస్తుంది. ఇక వంట గురించి మాట్లాడటానికి కాంచన దీపని పిలిస్తే దీప అత్తయ్యా అని సగంలో ఆగిపోతుంది. పూర్తిగా అత్తయ్య అని పిలిచేయ్మని కాంచన అంటుంది. వంట గురించి చెప్పి ఏం వండాలో కార్తీక్‌నే అడిగి తెలుసుకొని వాడికి ఏం ఇష్టమో అదే వండు అని చెప్తుంది. దాంతో దీప కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ కార్తీక్, శౌర్యలు వైకుంఠపాళీ ఆడుతుంటారు. దీప మొహమాట పడుతూనే కార్తీక్‌ని పిలిచి ఏం వండాలి మీకు ఇష్టమైన కూర ఏంటి అని అడుగుతుంది.
నా ఇష్టాలు ఏంటో నీకు తెలీదా అని కార్తీక్ అడుగుతాడు. తెలీదు అని దీప అంటుంది. మా అమ్మ అడగమని చెప్పింది కాబట్టి అడుగుతున్నావ్ కానీ నా కోసం అడగడం లేదని కార్తీక్ అంటాడు. ఇక తనకు ఇష్టమైన వంట చెప్పకుండా దీపకి క్లూఇస్తానని అంటాడు. ఇక కార్తీక్ తనకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర వండమని అంటాడు. ఇక శౌర్య నాన్న నువ్వు గెలిచావ్ అంటే ఇది మామూలు గెలుపు కాదు ఒక వ్యక్తి మనసు గెలుచుకున్నానని కార్తీక్ అంటాడు. దీపలో మార్పు మొదలైంది అని ఇక తన జీవితం నవవసంతంగా ఉండనుందని అనుకుంటాడు.
మరోవైపు జ్యోత్స్న ఆఫీస్‌కి రెడీ అవుతుంటుంది. ఇంతలో పారిజాతం అక్కడికి వస్తుంది. నన్ను పక్కన పెట్టేస్తున్నావ్ అని పారిజాతం అంటే నీది ఆఫ్ నాలెడ్జ్ ఏదైనా ఒకటి ప్లాన్ చేయడంతో తోపు కానీ ఒకరికి ఒక పని ఆప్పగిస్తే అది జరిగిందా లేదా అని అంటుంది. సైదులుని చంపిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని ఉంటే ఈ రోజు వేరేలా ఉంటుందని అంటుంది. ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావని పారిజాతం అంటుంది. నువ్వు గతంలో చేసిన తప్పుని నేను భవిష్యత్‌లో సరిచేయాలి అనుకుంటున్నాను అని నువ్వు నాకు అడ్డు రావొద్దు నీకు ఏం చెప్పను అని జ్యోత్స్న అంటుంది. మరోవైపు కార్తీక్ ఇంటికి స్వప్న, కాశీ వస్తారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను అది ఏంటో కనిపెట్టు అని కార్తీక్ కాశీతో అంటాడు.
ఇక కాంచన కాశీతో మీ బావ ఇష్టం ఏంటో తెలుసుకొని మీ అక్క వండుతుందని అంటుంది. ఆ కర్రీ ఏంటో గెస్ చేయ్ అని కార్తీక్ అంటే దానికి కాశీ మీ చెల్లి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాలుగు రుచులే తెలుసని అవి సాంబారు, పప్పు, పచ్చడి పెరుగన్నం అంటాడు. అందరూ నవ్వుకుంటారు. ఇక కాశీ ఏంటో కర్రీ అని అడిగితే శౌర్య చెప్పబోతే దీప వచ్చి కార్తీక్ బాబు గుత్తి వంకాయ కూర రెడీ అంటుంది. అందరూ భోజనానికి వెళ్తారు. దీప అందరికీ వడ్డిస్తుంది. అందరూ కలిసి కూర్చొని సంతోషంగా భోజనం మొదలు పెడితే ఇంతలో కార్తీక్‌కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. జ్యోత్స్న మేడం అర్జెంటుగా రమ్మంటున్నారని చెప్తారు. గెస్ట్‌లు ఉన్నారు ఇప్పుడు కాదని కార్తీక్ అంటే మీరు రాకపోతే మేడం మీ ఇంటికి వస్తారని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: ఫింగర్ ఫ్రింట్స్‌తో పట్టించే ప్రయత్నం.. చిట్టి పాప రాకతో ఏదో జరిగిందే?