Karthika Deepam 2 Serial Today December 19th: కార్తీకదీపం 2 సీరియల్: దీప రెస్టారెంట్.. నిప్పు రాజేసిన పేరు.. భార్య వల్ల కార్తీక్ బికారీ అయిపోతాడా?
Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్ దీప పేరుతో రెస్టారెంట్ పెట్టాలనుకోవడం ఆ విషయం జ్యోత్స్న వాళ్లకి తెలిసి తాత గొడవకు రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode స్వప్న, కాశీలు కార్తీక్ ఇంటికి వచ్చి మీ సాయంతో మేం ఫుడ్ కోర్టు పెట్టుకోవాలి అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అంటారు. దానికి దాసు కూడా ఓకే అంటాడు. దీప కూడా నా ఆలోచన కూడా ఇదే అని ఆయన ఎక్కడ మొదలు పెట్టినా చాలా ఎత్తుకు ఎదుగుతారని అంటుంది. అందరూ తలా పని చేస్తామని సాయం చేస్తామని అంటారు. బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చాలా కష్టమని కార్తీక్ అంటాడు. దానికి కాంచన డబ్బు కోసం ఆస్తిలో నా వాటా అడుగుతానని అంటుంది.
కార్తీక్: వద్దమ్మా అదంతా ఉమ్మడి ఆస్తి. ఇప్పుడు దీని కోసం వాళ్ల దగ్గరకు వెళ్లడం పంపకాలు ఇవన్నీ ఎందుకు. ఇదంతా నాకు ఇష్టం లేదు. పైగా అదంతా నీది కాదమ్మా నీ డబ్బులతో బిజినెస్ చేయడం.
కాంచన: నీది నాది అని వేరు చేసి మాట్లాడుతున్నావేంట్రా అని ఏడుస్తుంది. నువ్వు ఎవరివిరా నా కొడుకువి కాదా నాది అంటే నీది కాదారా. అసలు నీ కంటే నాకు ఈ ప్రాణంకూడా ఎక్కువ కాదు నాన్న.
కార్తీక్: నీ ప్రేమ నాకు తెలుసమ్మా కానీ నాకు ఇప్పుడు ఆ ఆస్తి వద్దు.
కాంచన: పోనీ ఈ ఇంటి మీద లోన్ తీసుకోరా.
దీప: పోనీ మీకు ఇంకేమైనా ఆలోచన ఉందా.
కార్తీక్: లేదు దీప. మనం ఏ పేరు మీద రెస్టారెంట్ పెట్టాలి అని అనుకుంటున్నామో అది చెప్పాలి.
స్వప్న: అన్నయ్య నేను ఓ పేరు అనుకున్నా చెప్పనా కార్తీక్ దీప రెస్టారెంట్ అని పెడదామా.
కార్తీక్: నచ్చలేదు మా తాత భార్య పేరు మీద పెట్టాడు నేను భార్య పేరు మీదే పెడతాను. దీప రెస్టారెంట్. ఎలా ఉంది.
కాంచన: చాలా బాగుందిరా మా నాన్న కంటే నువ్వు గొప్పోడివి అవుతావ్.
దీప: వద్దమ్మా నా పేరు మీద వద్దు.
దాసు: వద్దమ్మా అలా అనకు. దేని మీద ఏ పేరు ఉండాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మనసులో నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాబట్టే శివన్నారాయణ భార్య పేరు పెడితే కార్తీక్ నీ పేరు పెట్టాడు. అది నీ స్థాయి.
అందరూ కార్తీక్, దీపలకు కంగ్రాట్స్ చెప్తారు. దాసు దీపతో నువ్వు కోరుకోకపోయినా నీకు ఆదేవుడు అన్నీ ఇస్తాడని అంటాడు. ఇక అనసూయ మనసులో అన్నీ ఇస్తాడు అంతే దీప అసలైన తల్లిదండ్రులు ఈయనకు తెలిసి ఉంటుందా అని అనుకుంటుంది. దాసు వెళ్తుంటే అనసూయ వెనకాలే వచ్చి అడుగుతుంది. దానికి దాసు చెప్పాల్సిన రోజు చెప్తా అని అంటాడు. దాంతో అనసూయ కన్‌ఫ్యూజ్ అవుతుంది. మరోవైపు జ్యోత్స్న తన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయని ఏం చేయాలా అని అనుకుంటుంది. ఇంతలో దాసు వచ్చి ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్నావ్ కదా అని ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్న కంగారు పడుతుంది. దాసు దీపతో మీరు కార్తీక్‌ని పంపేయడం వల్ల సొంతంగా రెస్టారెంట్ పెట్టుకుంటున్నాడని చెప్తాడు. ఇంటి మీద లోన్‌కి వెళ్తున్నారని చెప్తాడు. ఇక రెస్టారెంట్ పేరు దీప పేరు మీద పెడుతున్నాడని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అయిపోతుంది. వాళ్లని ఏమైనా ఇబ్బంది పెడితే నీ గురించి అందరికీ చెప్తేస్తా అంటాడు. దీప జోలికి వెళ్లొద్దని అంటాడు.
జ్యోత్స్న లోపలికి వెళ్లి నీకు పోటీగా భార్యని బావ రంగంలోకి దింపాడని శివనారాయణతో పాటు అందరితో చెప్తుంది. అత్త మీకు పోటీగా ఇంటిపై లోన్ పెడుతున్నారని అంటుంది. దానికి శివనారాయణ నా ఆస్తి మీద తాను లోన్‌కి వెళ్లడం ఏంటి అని తాత మనవరాలు కార్తీక్ ఇంటికి బయల్దేరుతారు. ఇంత జరుగుతున్నా కాంచన ఏం చెప్పడం లేదని దశరథ్ సుమిత్రతో అంటాడు. ఇక బ్యాంక్ లోన్ కోసం వ్యక్తి ఇంటికి వచ్చి కాంచనతో సంతకాలు పెట్టించుకుంటారు. ఇంతలో శివన్నారాయణ వస్తాడు. ఆ ఫైల్ తీసుకుంటాడు. రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటున్నాను అని ఇంటి మీద లోన్‌కి వెళ్తున్నాను అని అంటాడు. రెస్టారెంట్ పేరు ఏం పెడుతున్నావ్ అని తాత అడిగితే దీప కార్తీక్ బాబు పేరే పెడుతున్నారని అంటుంది. దానికి కార్తీక్ నువ్వు భయపడతావ్ కానీ నేను భయపడను అని చెప్పి దీప పేరు మీద రెస్టారెంట్ పెడుతున్నానని అంటాడు. పేరు అద్భుతంగా ఉందని శివనారాయణ అంటాడు. వెటకారంగా దీప జీవిత కథ పుస్తకం రాయాలి అనుకుంటున్నా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: జనార్థన్ పక్కన వ్రతంలో విద్యాదేవి కూర్చొంటుందా.. సీత ప్లాన్ ఏంటి.. మహా సీతని ఎదుర్కొగలదా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

