Karthika Deepam Idi Nava Vasantham Serial August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: దాస్ కొడుకే కాశీ అని తెలుసుకొని షాకైన పారిజాతం.. స్వప్న లవ్ మ్యాటర్ కార్తీక్‌కి చెప్పిన దీప!
Karthika Deepam Idi Nava Vasantham Today Episode స్వప్న, కాశీ ప్రేమించుకుంటున్నారనే విషయం కార్తీక్‌కి తెలియడం అండగా ఉంటానని స్వప్నకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode యాక్సిడెంట్ అయిన కాశీని జ్యోత్స్న వదిలేసి వెళ్లిపోవడం దీప కాపాడటం విషయం కార్తీక్ ఇంట్లో చెప్తాడు. ఇద్దరిలో ప్రాణం విలువ ఎవరికీ తెలుసని అడుగుతాడు. దానికి సుమిత్ర దీపకే తెలుసని అంటుంది. దశరథ్ కూడా కార్తీక్‌ని నువ్వు చెప్పిన మాటలు కరెక్ట్‌ని జ్యోత్స్నకి మానవత్వం గురించి చెప్తాడు.
ఇక పారిజాతానికి శివనారాయణ తిడతాడు. నువ్వు కూడా పక్కనే ఉన్నావ్ కదా చెప్పలేదా అని అడుగుతాడు. నీకే పద్ధతులు తెలీవని జ్యోత్స్నకి నువ్వేం చెప్తావని తిడతాడు. ఇక కార్తీక్ దీప హాస్పిటల్‌లో ఉందని తాను కూడా వెళ్తానని అంటాడు. సుమిత్ర కూడాఅత్త మీద కోప్పడుతుంది. మీరు పక్కనే ఉంటే దాని పెళ్లి అవుతుందో లేదో అంటుంది. పారిజాతం మనసులో నిన్ను ఇలా తయారు చేసి తప్పు చేశానే నిన్ను ఎలా మార్చాలా అని ఆలోచిస్తుంది.
హాస్పిటల్లో కాశీకి స్ఫృహ వస్తుంది. నర్సు దీపకి విషయం చెప్తుంది. దీప వెళ్తుంటే స్వప్న కూడా వస్తుంది. స్వప్న కాశీని చూడ్డానికి వెళ్తానంటే దీప ఆపి నీకు అతను ఎలా తెలుసని అతని గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. దానికి స్వప్న తాను కాశీ ప్రేమించుకున్నామని చెప్తుంది.
స్వప్న: నా కోసమే కాశీ వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాడు.
దీప: మీ విషయం ఇంట్లో వాళ్లకు తెలుసా.
స్వప్న: తెలీదు కానీ నేను ఎవరి కోసం కాశీని వదులుకోను. కాశీ. కాశీ అని స్వప్న కాశీ దగ్గరకు వెళ్లి గట్టిగా ఏడుస్తుంది.
దీప: తండ్రి చేసిన తప్పు ఎలా సరిదిద్దాలో అర్థం కాకుండా ఉన్న కార్తీక్ బాబుకి స్వప్న ప్రేమ గురించి తెలిస్తే ఏమనుకుంటారో. ఇప్పుడు ఆయనకు ఇదో భారంగా మారుతుంది. చెల్లిలి ప్రేమ గురించి కార్తీక్ బాబుకి చెప్పకుండా ఎలా ఉండాలి.
జ్యోత్స్న కార్తీక్ మాటలు తలచుకొని ఆవేశపడుతుంది. కార్తీక్ మనసులో తనకి మంచి అభిప్రాయం లేదని అందుకు ఏం చేయాలో తనకు తెలుసని హాస్పిటల్‌కి వెళ్తానని జ్యోత్స్న వెళ్తుంది. పారిజాతం జ్యోత్స్న వెనకాలే వెళ్తుంది. స్వప్నని కాశీ ఓదార్చుతాడు తనకి ఏం కాలేదని అంటాడు. ఇక స్వప్న దీప గురించి కాశీకి చెప్తుంది. ఇక కార్తీక్ కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తాడు. కార్తీక్ లోపలికి వెళ్తానంటే దీప వద్దని అంటుంది అయినా కార్తీక్ వెళ్తాడు అక్కడ స్వప్న కాశీ చేతిని పట్టుకోవడం చూస్తాడు.
కార్తీక్: స్వప్న నువ్వు ఇక్కడున్నావేంటి?
స్వప్న: దీప నీతో ఏం చెప్పలేదా బాస్.
దీప: బయట మీతో చెప్పాలి అనుకున్నది ఇదే బాబు. అతనెవరో కాదు స్వప్న ప్రేమించిన వ్యక్తి.
స్వప్న: మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం బాస్.
కార్తీక్: మీ నాన్నకి మీ ప్రేమ గురించి తెలుసా.
స్వప్న: తెలీదు బాస్ కాశీ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. తనకి జాబ్ వచ్చిన తర్వాత మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలి అనుకున్నాం. ఈ రోజు తనకి ఇంటర్వ్యూ ఉంది. నేను దగ్గరుండి ఎదురొచ్చి పంపించా. ఈ రోజు తనకి ఈ యాక్సిడెంట్ అవ్వకపోయి ఉంటే జాబ్ వచ్చుండేది. మా మమ్మీడాడీకి కాశీని పరిచయం చేసేదాన్ని.
కార్తీక్: ముందు నువ్వు ఏడ్వకు. కాశీని కొద్ది రోజులు రెస్ట్ తీసుకోనివ్వు తర్వాత జాబ్ గురించి చూద్దాం.
స్వప్న: ఇంట్లో చెప్పినా ఒప్పుకోరు బాస్. బాస్‌వి అయినా అన్నయ్యవి అయినా నువ్వే నాకు నువ్వే సాయం చేయాలి బాస్.
ఇక కార్తీక్ మొత్తం చూసుకుంటానని స్వప్నని ఇంటికి వెళ్లిపోమని అంటాడు. స్వప్న దీపని పరిచయం చేస్తుంది. కాశీ దీపకి దండం పెడతాడు. స్వప్న దీపకి క్షమాపణలు చెప్తుంది. ఇప్పటి వరకు బాస్ ఒక్కడే తనకి అండగా ఉండే వాడని ఇప్పటి నుంచి నువ్వు కూడా ఉన్నావని చెప్పి స్వప్న వెళ్లిపోతుంది. ఇక కావేరి కూతురికి కాల్ చేసి ఎక్కడున్నావని అంటే స్వప్న యాక్సిడెంట్ గురించి చెప్తుంది.
స్వప్న ఎవరినో లవ్ చేస్తుందని అనుమానంతో ఉన్న కావేరి స్వప్నని పిలుస్తుంది. ఇక పారాజాతం కొడుకు దాస్ హాస్పిటల్‌లోకి వచ్చి కాశీ తన కొడుకని చూడ్డానికి వస్తే నర్స్ రెస్ట్ తీసుకుంటున్నాడని తర్వాత రమ్మని చెప్తుంది. ఇక జ్యోత్స్న, పారిజాతం హాస్పిటల్‌కి వస్తారు. పారిజాతం దాసుని చూసి దాసు ఇక్కడేంటి ఉన్నాడని అనుకుంటుంది. దాస్ దగ్గరకు వెళ్లి ఏమైందని అంటే దాసు వీడియో చూపించి కాశీ తన కొడుకని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘కార్తీకదీపం 2’ సీరియల్: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దీప – జ్యోత్స్న కు బుద్ది చెప్పిన నెటిజెన్లు