Karthika Deepam 2 Serial Today April 8th: కార్తీకదీపం 2 సీరియల్: చస్తే కార్తీక్ భార్యగానే చస్తా.. జ్యో కుట్ర తెలుసుకున్న కావేరి.. దీపకు చేరవేస్తుందా!
Karthika Deepam 2 Serial Today Episode జ్యో సత్తిపండు గురించి తన ప్లాన్ గురించి పారుకి చెప్పడం కావేరి వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode గౌతమ్ దీపకి వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో కాంచన, అనసూయలు గౌతమ్ ఎలాంటి వాడో అర్థమైందని అంటారు. వాడు మన ఇంటికి వచ్చి దీపకు వార్నింగ్ ఇచ్చాడు అంటే ఏదో చేయబోయాడు దీప అడ్డుకోకూడదు అనే వార్నింగ్ ఇచ్చాడని కాంచన అంటుంది. దాంతో అనసూయ మళ్లీ పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడేమో అని అనసూయ అంటే మా నాన్న మరి వాడితో నా మేనకోడలి పెళ్లి చేయడు అంటుంది కాంచన.
గౌతమ్ మెసేజ్‌తో జ్యో హ్యాపీ..
కార్తీక్‌కి ఈ విషయం చెప్పమని కాంచన అంటే వద్దని దీప అంటుంది. ఇకపై నువ్వేం చేసినా నాకు చెప్పి చేయాలి అని కాంచన దీప దగ్గర మాట తీసుకుంటుంది. ఇక జ్యోత్స్న దగ్గరకు పారు వచ్చి కూర్చొంటుంది. షాపింగ్‌కి వెళ్దాం అంటే జ్యో వద్దు అనేస్తుంది. ఇంతో గౌతమ్ మెసేజ్ చేస్తాడు. దీప ఫినీష్ అని కలుద్దామని అంటాడు. జ్యోత్స్న వెళ్తుంది. పారు చూసి నాకు ముందు ఒకరి మీద అనుమానం ఉంది అది తీర్చుకున్న తర్వాత నీ మీద అనుమానం తీర్చుకుంటా అని సత్తిపండుని కలుస్తుంది.
పారుకి నిజం చెప్పేసిన సత్తిపండు..
పారు సత్తిపండుని కలుస్తుంది. రమ్య నా పెళ్లామే దాని కడుపులో నా బిడ్డనే ఉందని అంటాడు. దాంతో నిజం చెప్పడం కోసం పారు వాడికి డబ్బు ఇస్తుంది. నిజం చెప్పమని అంటుంది. దాంతో సత్తిపండు రమ్య కడుపులో బిడ్డకు తండ్రి తాను కాదని అంటాడు. ఎవరు అలా చెప్పమన్నారు అని మళ్లీ డబ్బు ఇస్తుంది. దాంతో జ్యోత్స్న అలా చెప్పమందని సత్తిపండు చెప్పేస్తాడు. పారు షాక్ అయిపోతుంది. దీప చెప్పినట్లు గౌతమే రమ్య గాడి కడుపులో బిడ్డకు తండ్రా. ఈ నాటకాలు ఏంటో నీతోనే తేల్చుకుంటా అని పారు వెళ్తుంది.
జ్యో, గౌతమ్‌లను చూసేసిన కావేరి..
శ్రీధర్, కావేరిలు ఓ రెస్టారెంట్‌కి వెళ్తారు. దీప రెస్టారెంట్ దగ్గరే బాగుంటుందని ఇక్కడ బాలేదని కావేరి అంటుంది. మొగుడిని తిట్టి జంతువులతో పోల్చీ అందరికీ కార్తీక్ లాంటి భర్త రావాలని కావేరి అంటే వాడో ఉత్తమ భర్త అదో ఉత్తమ భార్య నువ్వో ఉత్తమ అత్త అని శ్రీధర్ తిడతాడు. శ్రీధర్‌కి ఫోన్ వచ్చి పక్కకు వెళ్లడం జ్యోత్స్న, గౌతమ్ అటు రావడం కావేరి చూస్తుంది.
దీప అంత ఈజీగా వదలదు..
గౌతమ్, జ్యోత్స్న కావేరి వెనకాలే కూర్చొని మాట్లాడుకుంటారు. దీప అంత ఈజీగా వదలదు అని జ్యోత్స్న అంటుంది. మీ తాతయ్యకు విషయం చెప్పాను అని గౌతమ్ అంటాడు. నువ్వు ఏం తప్పు చేయలేదు కదా అని జ్యోత్స్న అంటుంది. లేదు అని గౌతమ్ చెప్తాడు. ఇంతలో పారు రావడంతో గౌతమ్ వెళ్లిపోతాడు. జ్యో దగ్గరకు వెళ్తుంది.
గౌతమ్ మంచోడు కాదని నీకు తెలుసుగా..
గౌతమ్‌ని దూరం పెట్టావ్ మరి ఎలా గౌతమ్‌ని కలుస్తున్నావ్ అని అంటుంది. ఎన్ని సార్లు కలిసినా గౌతమ్‌ని నువ్వు పెళ్లి చేసుకోవని పారు అంటుంది. సత్తిపండు గురించి చెప్తుంది. కావేరి మొత్తం వింటూ ఆలోచిస్తూ ఉంటుంది. జ్యోత్స్న గ్రానీకి దొరికిపోతుంది. నీ నిశ్చితార్థం దీప చెడగొట్టిందా అలా నువ్వే చేశావా అని అడుగుతుంది. గౌతమ్‌ని ఎందుకు కాపాడావ్ అని అడుగుతుంది. జ్యోత్స్న పారుని పక్కకు తీసుకెళ్తుంది. కావేరి ఫాలో అవుతుంది.
దీపని బ్యాడ్ చేయాలనే..
గౌతమ్ బ్యాడ్ అని తెలిస్తే దీప అందరి దృష్టిలో చెడ్డది అవుతుందని అందుకే వాడికి కాపాడాని ఈ పెళ్లి దీపే ఆపుతుందని అంటుంది. మొదటి నుంచి చివరి వరకు జరిగింది అంతా జ్యోత్స్న చెప్తుంది. కావేరి చాటుగా మొత్తం వింటుంది. మన ఇంట్లో దీపని ఇంకా చెడ్డదాన్ని చేయాలి అనే ఇలా చేశానని అంటుంది. జ్యోత్స్న చస్తే కార్తీక్ భార్యగానే చస్తుంది అంతే కానీ మరో వ్యక్తికి నా జీవితంలో చోటు లేదని అంటుంది. పెళ్లి ఆగడానికి కూడా ప్లాన్ ఉందని చెప్తుంది. నీకు ఏమైనా అయితే అని పారు అడిగితే నాకు ఏం కాదని అంటుంది. నిశ్చితార్థం ఆపినట్లే పెళ్లి కూడా దీపే ఆపుతుందని జ్యోత్స్న అంటుంది. విషయం దీపకు చెప్పాలని కావేరి పరుగులు తీస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు ఎవర్నినైనా ఉద్దరించుకో ఉద్యమాలు చేసుకో నా జోలికి రాకు.. దీపకు గౌతమ్ వార్నింగ్!





















