Karthika Deepam 2 Serial Today April 17th: కార్తీకదీపం 2 సీరియల్: లాయర్ కల్యాణ్‌ప్రసాద్ దీపని నిర్దోషిగా బయటకు తీసుకొస్తారా.. న్యాయం ఎవరిది?
Karthika Deepam 2 Serial Today Episode దీపని కేసు నుంచి బయటకు తీసుకురావడానికి కార్తీక్ కల్యాణ్ ప్రసాద్ అనే లాయర్‌తో మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దశరథ్ కండీషన్ సీరియస్‌గా ఉందని దీపకు యావజ్జీవ శిక్ష పడుతుందని శ్రీధర్ కార్తీక్ ఫ్యామిలీకి చెప్తాడు. తప్పు చేసింది శిక్ష పడుతుంది. తన మానాన తనని వదిలేయండి. శౌర్యని అనాథాశ్రమంలో పెట్టేద్దాం. మనం అంతా పెద్ద ఇళ్లు తీసుకొని ఉందామని ఆ తర్వాత నీ పెళ్లి అని అంటాడు.
తండ్రి మాటలకు కార్తీక్ చితక్కొడతానని అంటాడు. శ్రీధర్‌ని అందరూ వెళ్లిపోమని అంటారు. శ్రీధర్ కావేరిని తీసుకెళ్తూ వీళ్లు మారరు బావ లేవడు దీపకు యావజ్జీవ శిక్ష గ్యారెంటీ అంటాడు. కార్తీక్ మంచి లాయర్‌ని పెట్టుకోవాలి అంటాడు. నీకు తెలిసిన వాళ్లని పెట్టమని కాంచన అంటుంది. దాంతో కార్తీక్ సత్యరాజ్‌కి సాయం అడుగుతానని అంటాడు. మంచి లాయర్ దొరికితే దీప కేసు నుంచి బయట పడుతుంది ఏం భయపడొద్దని అనసూయ కాంచనతో చెప్తుంది.
సత్యరాజ్ చెప్పిన లాయర్ కల్యాణ్ ప్రసాద్ దగ్గరకు కార్తీక్ వెళ్తాడు. అన్యాయాన్ని గెలిపించను అలా అని ప్రతీ సారి న్యాయాన్ని గెలిపించలేను అంటాడు. ఇక ఇద్దరూ దీప కేసు గురించి మాట్లాడుతారు. అన్నీ వివరాలు నాకు చెప్పమని లాయర్ కార్తీక్‌తో చెప్తాడు. కార్తీక్ దీప గురించి మొదటి నుంచి మొత్తం లాయర్‌తో చెప్తాడు. అది విన్ని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి దీపని కలుద్దామని అంటారు. ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. జ్యోత్స్న తన ఫ్యామిలీ లాయర్ భగవన్ దాస్‌ని కలుస్తుంది. దీపకి యావజ్జీవ శిక్ష పడాలని అంటుంది. డిటైల్స్ ఇచ్చావ్ కదా నేను చూసుకుంటా ఆ దీప బయటకు రాదు అని లాయర్ చెప్తారు.
కల్యాణ్ ప్రసాద్ దీప దగ్గరకు వెళ్లి నీ దగ్గర గన్ ఉండటం కార్తీక్ చూశాడు ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పు అని అడుగుతారు. పథకం ప్రకారం కార్తీక్‌ని పెళ్లి చేసుకున్నారు.. జ్యోత్స్న అడ్డు తొలగించుకోవాలి అని చంపాలని చూశారు జ్యోత్స్న తప్పించుకుంది దశరథ్‌కి బులెట్ తగిలింది ఇది నిజమా అబద్ధమా చెప్పు అని అడుగుతారు. కోర్టులో ఇంత కంటే దారుణంగా ప్రశ్నలు అడుగుతారు అని కల్యాణ్ చెప్తారు. దీపని కోర్టులో ఎలా సమాధానం చెప్పాలో ట్రైన్ చేస్తారు. ఇక దీప అక్కడికి వెళ్లడానికి కారణం చెప్తుంది.
ఇక జ్యోత్స్న కూడా పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. లాయర్‌ని చూసి వీళ్లు మన కంటే స్పీడ్‌గా ఉన్నారు అనుకుంటుంది. ఆ లాయర్‌తో మాట్లాడాలి అని జ్యోత్స్న వెళ్తుంది. జ్యోత్స్న లాయర్ దగ్గరకు వెళ్లి తనని తాను పరిచయం చేసుకుంటుంది. దీప ఆపొజిట్ లాయర్ సీనియర్ లాయర్ భగవన్‌దాసు అని చెప్తుంది. దీప కారణంగా మా నాన్న హాస్పిటల్‌లో ఉన్నారు కానీ మీరు నేరస్తురాలికి సాయం చేస్తున్నారా అని అడుగుతుంది. అదంతా జరగడానికి కారణం మీరే అని దీప అంటుంది. ఏది నిజం ఎవరు దోషో కోర్టు నిర్ణయిస్తుందని అంటారు. ఇక జ్యోత్స్న కార్తీక్ దీపలను కలవడానికి వెళ్తుంది. తప్పు చేసే వాళ్లని నువ్వు సపోర్ట్ చేయవు కదా బావ మరి దీపని ఎలా సపోర్ట్ చేస్తున్నావ్ అని అంటుంది. దీప నీకు నీ కూతురు గురించి ఎంత బెంగ ఉందో నాకు నా తండ్రి గురించి అంతే బెంగ ఉంది నా డాడీకి ఏమైనా అయితే నిన్ను వదిలిపెట్టను అని జ్యత్స్న అంటే దీప జ్యోత్స్న గొంతు పట్టుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: "మీరంతా కలిసి నా భర్తకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు.. జీవితంలో నీ ముఖం చూపించకు"





















