Karthika Deepam 2 Serial Today April 11th: కార్తీకదీపం 2 సీరియల్: దశరథ్‌ని కాల్చేసిన దీప.. కుప్పకూలిపోయిన జ్యోత్స్న తండ్రి.. చనిపోవడం ఖాయం!
Karthika Deepam 2 Serial Today Episode దీప జ్యోత్స్న ఇంటికి వెళ్లి దశరథ్‌ని కాల్చేయడం కార్తీక్ ఆ సీన్ చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ ఇంటికి వచ్చి కాంచన, అనసూయ మీద ఫైర్ అవుతాడు. దీప ఇంట్లో లేకపోతే కాల్ చేసి నాకు అడగకుండా నేను ఇంటికి వచ్చి మిమల్ని అడుగే వరకు ఎందుకు ఊరుకున్నారు. దీప ఎక్కడికి వెళ్లిందో తెలుసా చెప్పండి అంటుంది. అనసూయ గుడికి వెళ్లింది అంటుంది.
కార్తీక్: మీరు భలే వారు అనసూయ గారు. జ్యోత్స్న అన్ని చేస్తే దీప ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది. తుఫానులా ఈ పాటికి ఆ ఇంటి మీద పడిపోయుంటుంది. జ్యోత్స్న దొరికితే చచ్చిందే. కానీ ఇన్ని నాటకాలు ఆడిన మనిషి దీప చెప్పింది అబద్దం అని నిరూపిస్తుంది. మనవరాలు చెప్పిందే నిజం అనడానికి పారు, తాత రెడీగా ఉంటారు. వెళ్లి దీపని ఆపాలి. అక్కడేం గొడవ జరుగుతుందో ఏంటో.
జ్యోత్స్న: దీపకు ఎదురెళ్లి.. చీకటిలో బాణం వేసి నిజం తెలిసిపోయింది అంటే అవునా అనే అంత పిచ్చిదాన్ని కాదు దీప.
దీప: నువ్వు మీ నాన్నమ్మ రెస్టారెంట్‌లో మాట్లాడుకున్నది చీకట్లో కాదు కదా. మనకు మంచి చేసేవాళ్లు మన చుట్టూ ఉంటారు. నువ్వు గౌతమ్ కంటే చెడ్డదానివి అని నిరూపించే అవకాశాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వెళ్లి మీ తాత కాళ్ల మీద పడి నిజాలు ఒప్పుకుంటావా నన్ను చెప్పమంటావా.
జ్యోత్స్న: బెదిరిస్తున్నావా. నిజాయితీ ఉన్న నన్ను నాశనం చేసింది నువ్వు. నాతో అబద్దాలు చెప్పిస్తుంది నువ్వు, మోసం చేసేలా చేస్తుంది నువ్వు నా జీవితంతో ఆడుకుంది నువ్వు.. మా బావ జీవితంలో నుంచి నిన్ను ఎలా తప్పించాలో అర్థం కావడం లేదే. నా మెడలో తాళి కడితే మా బావే కట్టాలి. నీ కూతుర్ని అడ్డు పెట్టుకొని సింపథితో చేసుకున్నావో అని తెలుసు. ముందు ఈ కుటుంబానికి తర్వాత ఆ కుటుంబానికి చివరకు బావకి నిన్ను దూరం చేయాలి.
దీప: కార్తీక్ బాబు నువ్వు ఇద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడి నా మెడలో తాళి కట్టుంటే నువ్వు అనేదానికి అర్థం ఉండేది కానీ కార్తీక్ బాబు మనసులో నువ్వు లేవు జ్యోత్స్న.
జ్యోత్స్న: నువ్వు ఉన్నావా.
దీప: నేను ఉన్నాను. నా మనసులో ఆయన ఉన్నాడు.
జ్యోత్స్న: ఇది నీ అసలు రంగు దీప. ఇందుకే కదా నిన్ను చంపాలి అనుకున్నది. నీ బావే నీ భర్త నీ పెళ్లి చేయడానికి నీ ఇంటికి వచ్చాను అని మాట ఇచ్చి మోసం చేసిన నీలాంటి దానికి ఏం చేసినా తప్పు లేదు. ఇప్పుడు చెప్తా విను నేను ఈ రెండు కుటుంబాలను కలుపుతాను. బావనే పెళ్లి చేసుకుంటాను. ఇది జరగాలి అంటే అడ్డుగా ఉన్న నిన్ను బతకనివ్వను నీ కూతురిని బతకనివ్వును. మీ ఇద్దరిని చంపి నేను బావతో తాళి కట్టించుకుంటా. దీప: ఇంకోసారి ఆ మాట నీ నోట వస్తే నేనే నిన్ను చంపే.
జ్యోత్స్న: నీకు బావ కోసం చచ్చే అంత ప్రేమ లేదు. బావ కోసం చచ్చే అంత ప్రేమ నాకు ఉంది. నిన్నూ నీ కూతుర్ని చంపే అంత ప్రేమ ఉంది.
దీప జ్యోత్స్న గొంతు పట్టుకొని నలిపేస్తుంది. జ్యోత్స్న విదిలించుకుంటుంది. జ్యోత్స్న కావాలనే దీపని రెచ్చగొడుతుంది. శౌర్యని బతకనివ్వను అని అంటుంది. దీప ఆవేశంతో జ్యోత్స్నని కొడుతుంది. మిమల్ని చంపి బావని దక్కించుకుంటా అని జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. దీప కర్ర పట్టుకొని లోపలికి వెళ్తుంది. జ్యోత్స్న గన్ తీసుకొని వస్తుంది. జ్యోత్స్న గన్ గురి పెడితే దీప కర్ర విసురుతుంది. జ్యోత్స్న తప్పించుకుంటుంది.
దీప జ్యోత్స్న దగ్గర గన్ తీసుకొని జ్యోత్స్నకి గురి పెడుతుంది. సుమిత్ర, దశరథ్‌లు వస్తే అది లోడ్ చేసుంది. వదిలేయ్ దీప అమ్మ దీప నన్ను చంపేస్తుంది కాపాడు అని అంటుంది. డాడీ నన్ను కాపాడు అంటుంది. సుమిత్ర దశరథ్ ఆపబోతే దగ్గరకు రాకండి అని దీప అంటుంది. పారు శివన్నారాయణని పిలిచి దీప జ్యోత్స్నని చంపేస్తుందని అంటుంది. పెద్దాయన గన్ ఇవ్వమంటారు. దీప ఇవ్వదు. నీకు ఏం అన్యాయం చేశావ్ ఇలా సాధిస్తున్నావ్ అని అడుతుంది. కర్ర తీసుకొని నన్ను చంపడానికి వెంట పడింది కాపాడండి అని అరిచాను మీకు వినపడలేదు. అందుకే దీపని ఆపడానికి తాత గన్ తీశా అది నా చేతుల నుంచి తీసుకొని చంపాలి అనుకుంటుందని జ్యోత్స్న ఏడుస్తుంది. పారు పోలీసులకు కాల్ చేస్తుంది.
దీప జ్యోత్స్నని కాల్చడానికి రెడీ అయిపోతుంది. ఎవరెన్ని చెప్పినా జ్యోత్స్నని కాల్చడానికి గన్ పేల్చుతుంది. ఇంతలో దశరథ్ జ్యోత్స్నని పక్కకు తప్పించడంతో ఆయనకు బులెట్ తగిలిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. రక్తం ముడుగులో దశరథ్ కుప్పకూలిపోతాడు. కార్తీక్ అప్పుడే వచ్చి చూసి షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాధికని కాపాడి జీవన్‌ని బెదిరించిన తల్లీకొడుకులు.. ఆస్తి రాసిచ్చేసిన రూప!





















