Ammayi garu Serial Today April 10th: అమ్మాయి గారు సీరియల్: రాధికని కాపాడి జీవన్‌ని బెదిరించిన తల్లీకొడుకులు.. ఆస్తి రాసిచ్చేసిన రూప!
Ammayi garu Today Episode రాధిక ఆస్తి కోసం నిజం ఒప్పుకుంటుందని తెలుసుకున్న జీవన్ రాధికను చంపబోతే వీడియో తీసి దీపక్, విజయాంబికలు జీవన్‌ని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్‌ని రూప, రాజు, విరూపాక్షిలు జైలులో కలుస్తారు. తన పరువు మర్యాద అన్నీ పోగొట్టిన రాధికను ఊరికే వదలను.. తనని కాల్చి చంపేస్తా అని అంటారు. రాజు సూర్యతో పెద్దయ్యగారు జరిగిందేదో జరిగింది రాధికకు డబ్బు ఇస్తే నిజం చెప్తానని చెప్పిందని రాజు చెప్తాడు.
సూర్యప్రతాప్: అంటే రాధిక అడిగిన డబ్బు ఇచ్చి నన్ను బయటకు తీసుకెళ్తారా.
రూప: నాన్న రాధిక ఈ పని చేయడానికి ఇంకో కారణం ఉంది నాన్న రాధిక భర్త లంచం తీసుకుంటే మీరు సస్పెండ్ చేశారంట దాంతో ఆయన సూసైడ్ చేసుకున్నారంట.
సూర్యప్రతాప్: ఓ ఆ లంచగొండి భార్యనా ఈ రాధిక.
రూప: అందుకే డబ్బు కావాలి అని అడుగుతుంది.
సూర్యప్రతాప్: లంచం తీసుకొని వాడు పోయాడు. ఈవిడ ఇలా చేస్తుందా. అదే జరిగితే రాధికని డబ్బు ఇచ్చి ఒప్పించనట్లు అవుతుంది. నేను తప్పు చేసినట్లు అవుతుంది. జీవితాంతం నేను చస్తూ బతికినట్లు అవుతుంది. దాని కంటే ఇక్కడ చావడం మేలు.
రాజు: అలా అనొద్దు పెద్దయ్య తనకి డబ్బు ఇచ్చి అబద్ధం చెప్పమనలేదు. నిజం చెప్పమని అంటున్నాం. మాకు మిమల్ని బయటకు తీసుకురావడం ముఖ్యం. ఆ రాధికను చంపేయాలి అన్నంత కోపం మాకు ఉంది కానీ చంపేస్తే తనతో పాటు నిజం చనిపోతుంది అందుకే డబ్బు ఇచ్చి నిజం కొంటున్నాం.
రూప: అవును నాన్న రేపు రాధిక కోర్టులో నిజం చెప్తుంది. మకుటం లేని మహారాజులాగా మీరు బయటకు వస్తారు. ప్లీజ్ నాన్న కాదు అనొద్దు.
రాజు: పెద్దయ్య ప్లీజ్.
సూర్యప్రతాప్: సరే మీ ఇష్టం.
విరూపాక్షి: సూర్యప్రతాప్‌కి జరిగిన అవమానం అంత చిన్నది కాదు. నన్ను చూసి అయినా తన మనసు కొంచెం మారుతుందని నేను వచ్చాను. తను ఎంత బాధ పడుతుంటాడో నాకు తెలుసు.
జీవన్: రాధికను కొట్టి.. నువ్వుం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా రాధిక సీఎం కుర్చీ నుంచి సూర్యప్రతాప్‌ని దించినట్లే దించి మళ్లీ కూర్చొపెడతా అంటున్నావ్.
రాధిక: చూడు జీవన్ నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేశాను. సరిపోయింది కదా ఇప్పుడు నీ ప్రాబ్లమ్ ఏంటి.
జీవన్: ఇప్పుడు వాళ్లు ఇచ్చే ఆస్తి కోసం నువ్వు నిజం చెప్పకూడదు.
రాధిక: నువ్వు చెప్పినట్లు చేసింది డబ్బు కోసం ఇప్పుడు కూడా వాళ్లు చెప్పింది చేసేది డబ్బు కోసమే అంతే కానీ వాళ్ల మీద నాకు పగ లేదు. వాళ్లు చెప్పినట్లు చేస్తే వాళ్లు నాకు వందల కోట్లు ఇస్తారు.
జీవన్ రాధిక గొంతు పట్టుకొని నిన్ను చంపేస్తే సూర్యప్రతాప్ ఇక ఎప్పటికీ బయటకు రాడు అని గొంతునులిపేస్తాడు. ఇంతలో దీపక్, విజయాంబికలు వీడియో తీస్తూ మేం సూర్యప్రతాప్‌ని బయటకు తీసుకొస్తాం అని అంటాడు. రాధిక నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు మర్చిపోకు అని జీవన్ బెదిరిస్తే దానికి దీపక్ జీవన్‌తో రాధిక కొడుకు మా దగ్గర ఉన్నాడు అని అంటాడు. విజయాంబిక వాళ్లు జీవన్‌కి ద్రోహం చేస్తారు. ఇక రాధిక మనసులో వీళ్ల వాటా కూడా నేనే కొట్టేస్తా అనుకుంటుంది. విజయాంబిక మనసులో నీ కొడుకుని అడ్డు పెట్టుకొని మేం కొట్టేస్తాం అనుకుంటారు. మొత్తానికి దీపక్ వాళ్లు జీవన్‌ని మోసం చేసి వీడియో అడ్డుపెట్టుకొని రాధికను తీసుకొని వెళ్లిపోతారు.
రూప వాళ్లు ఇంటికి వచ్చి సూర్యప్రతాప్ ముఖం కూడా చూపించడం లేదని అంటారు. సూర్య ఏ తప్పు చేయలేదని నిరూపించాలని విరూపాక్షి అంటుంది. మందారం విరూపాక్షితో ఇందులో దీపక్, విజయాంబికల హస్తం కూడా ఉందని అంటుంది. సూర్య వచ్చిన తర్వాత వాళ్ల అంతు చూస్తానని విరూపాక్షి అంటుంది. చంద్ర ల్యాండ్ డాక్యుమెంట్లు రూపకి ఇస్తారు. రూప వాటిని చూసి నాన్న మాకు ఆస్తి కంటే మీరే ముఖ్యం అని సంతకం పెట్టబోతుంది. విజయాంబిక రూపతో ఈ రోజు సంతకం పెడితే రేపు ఆస్తి మొత్తం ఇవ్వమంటే ఏం చేస్తావ్ అంటుంది. అప్పుడు కూడా సంతకం పెడతాను అని రూప అంటుంది. మా నాన్న జీరో అయిన కూడ మళ్లీ హీరో అవ్వగలరు అని అంటుంది. విరూపాక్షి రూపతో నీలాంటి బిడ్డని కన్నందుకు చాలా గర్వంగా ఉంది రూప తల్లిదండ్రులు ఉండగానే ఆస్తి కొట్టేసే పిల్లలు ఉన్న ఈ జనరేషన్‌లో తండ్రి కోసం ఆస్తి వదిలేస్తున్నావ్ అని అంటుంది. ఇక రూప సంతకం పెట్టిన తర్వాత చంద్ర సంతకం పెడతాడు. సూర్యప్రతాప్‌తో కోర్టులో సంతకం పెట్టిద్దామని అంటారు. దీపక్ గదిలోకి వెళ్లి గంతులేస్తాడు. విజయాంబిక, దీపక్ ఆస్తి వచ్చిందని సంబర పడిపోతుంటే మందారం వింటుంది. వాళ్ల పని చెప్తా అని కరెంట్ ఆపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















