Kalavari Kodalu Kanaka Mahalakshmi September 7th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకాన్ని అవమానించిన అంబిక, నానమ్మలకు వార్నింగ్ ఇచ్చిన విహారి.. చనిపోయిన అమ్మాయి కనకమేనా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode ట్రైన్ యాక్సిడెంట్ జరిగి ఓ అమ్మాయి చనిపోయిందని తెలుసుకున్న విహారి అది కనకమే అనుకొని హాస్పిటల్‌కి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారిని తన ఫ్రెండ్ హాస్పిటల్‌కి రమ్మని చెప్తాడు. విహారి హాస్పిటల్‌కి వెళ్లి ట్రైన్ యాక్సిడెంట్ కేసు గురించి అడుగుతారు. కనకం సూసైడ్ చేసుకుందని విహారి అనుకొని బాడీ చూపించమని అడుగుతాడు. శవాన్ని చూడటానికి వెళ్లి చాలా ఎమోషనల్ అవుతాడు. శవాన్ని చూసి కనకం కాకపోవడంతో ఊపిరి పీల్చుకుంటాడు. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి తన ఫ్రెండ్‌కి కాల్ చేసి ఆ అమ్మాయి కనకం కాదు అని చెప్పాడు. వెంటనే వాళ్ల ఊరు వెళ్లి కనకం వాళ్ల ఇంట్లో ఉందో లేదో చూడమని చెప్తాడు.
యమున టిఫిన్ చేయడానికి వస్తుంది. పని మనిషి లక్ష్మీ ఇంకా తినలేదు అని చెప్పడంతో కలిసి తిందామని యమున లక్ష్మీని కూర్చొపెట్టబోతే అంబిక వచ్చి కుర్చీ లాగేస్తుంది. దాంతో కనక మహాలక్ష్మీ కింద పడిపోతుంది. యమున హడావుడిగా వెళ్లి కనకాన్ని లేపుతుంది.
యమున: అంబిక ఏంటి ఈ పని.
అంబిక: నువ్వు చేసిన పని ఏంటి.
కాదాంబరి: ఏం జరిగింది.
అంబిక: చూడమ్మా తన ఊరి అమ్మాయిని తెచ్చింది కదా మనం ఏమీ అనలేదు కదా. సర్లే ఆ పని ఈ పని చేస్తుందని వదిలేస్తే ఇప్పుడు ఏకంగా వచ్చి మనం కూర్చొనే కుర్చీలో కూర్చొని టిఫెన్ చేస్తుందట.
కాదాంబరి: లక్ష్మీ నిజమేనా.
అంబిక: ఈవిడ గారిని అడిగితే ఈవిడేం చెప్తుంది. నెత్తిన పెట్టుకున్న వదిన గారిని అడుగు చెప్తుంది.
యమున: అవును అత్తయ్య లక్ష్మీ తినలేదు అని నేనే నాతో కలిసి తినడానికి పిలిచాను. అందులో తప్పు ఏముంది
కాదాంబరి: దారిలో పోయే వాళ్లు నీకు సొంతవాళ్లు మాకు కాదు. మాతో కలిసిపోవాలి అన్నా మాతో కలిసి తినాలి అన్నా ఓ అర్హత ఉండాలి. ఈ అమ్మాయికి ఏం అర్హత ఉందని కూర్చొనిచ్చావ్.
లక్ష్మీ: మేడం తప్పు ఏం లేదమ్మా తప్పు అంతా నాదే..
అంబిక: నువ్వు నోర్ముయ్.
యమున: అంబిక లక్ష్మీ కూడా మన లాంటి మనిషే కదా ఎందుకు అలా మాట్లాడుతావు.
అంబిక: నా స్థాయి కాని వారు నా ముందు నాతో సమానంగా ఉంటే ఇలాగే ఉంటుంది.
యమునను ఏమీ అనొద్దని లక్ష్మీ అంటే కాదాంబరి లక్ష్మీని అవతలకి వెళ్లిపోమని అంటుంది. ఇక అంబిక కనకం చేతిలో ప్లేట్ పెట్టి టిఫెన్ వేసి తీసుకెళ్లి తినమని అంటుంది. ఆకలిగా లేదని కనకం అంటే అంబిక తిట్టి పంపిస్తుంది. యమునను కూడా కాదాంబరి తిడుతుంది. కనకం చాలా అవమానంగా ఫీలవుతుంది. యమున, వసుధ కూడా ఫీలవుతారు. ఇక కనకం వంట గదికి వెళ్తుంది. విహారి ఇంటికి వస్తాడు. తల్లిని చూసిన విహారి ఏమైందని అడుగుతాడు. యమున ఏం కాలేదని అంటుంది.
విహారి: అత్త చెప్పు ఏమైంది అమ్మ ఎందుకు డల్‌గా ఉంది. నానమ్మ నువ్వు అయినా చెప్పు.
కాదాంబరి: ఎందుకు ఏంట్రా ఎవర్నీ ఎక్కడ పెట్టాలో మీ అమ్మకి ఇంకా తెలియకపోతే ఎలా అదే మీ అమ్మకి చెప్పా.
అంబిక జరిగింది విహారికి చెప్తుంది. అందులో తప్పేముందని విహారి అడుగుతాడు. అమ్మకి తెలిసిన అమ్మాయి కదా ఆమె కూడా మనిషే కదా అందరూ కలిసి తింటే తప్పేముందని అడుగుతాడు. తన తల్లిని కాపాడిన ఆ అమ్మాయి మా దృష్టిలో దేవత అని అలాంటి అమ్మాయిని అవమానించడం తప్పని అంటాడు. ఎవర్నీ తక్కువ చేసి చూడొద్డని క్లాస్ తీసుకుంటాడు. విహారి మాటలు కనకం వింటుంది కానీ విహారిని చూడదు. ఇక విహారి ఆ అమ్మాయి ఎక్కడుందని అడిగి కిచెన్‌కి వెళ్తాడు. కనకం వెనక్కి తిరిగి ఉంటే విహారి కూడా కనకాన్ని చూడకుండా క్షమాపణ చెప్తాడు. కనకం కూడా ఏం పర్లేదని అంటుంది. మీకు ఏం కావాలి అన్నా నన్ను అయినా మా అమ్మని అయినా అడుగు అని అంటాడు. ఇక విహారి తన నానమ్మ దగ్గరకు వచ్చి తన తల్లి తప్పు చేయకుండా తిట్టొద్దని మీతో కలిసి నేను ఉండాలి అంటే ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడమని అంటాడు.
విహారి ఫ్రెండ్ కనకం ఇంటికి వెళ్తాడు. చేనేత చీరల కోసం వచ్చానని చెప్పి చీరలు ఆర్డర్ చేస్తాడు. ఇక అడ్వాన్స్ ఇస్తే ఆది కేశవ్ వద్దని అంటాడు. ఇక విహారి ఫ్రెండ్ మీ కూతురికి అమెరికా పెళ్లి చేశారు కదా అని మాట్లాడుతాడు. ఆదికేశవ్ తన కూతురు అమెరికాలో ఉందని అల్లుడు బాగా చూసుకుంటున్నాడని చెప్తాడు. దాంతో విహారి ఫ్రెండ్ ఆదికేశవ్ వాళ్లకి విషయం తెలీదని అనుకుంటాడు. విహారికి కాల్ చేసి విషయం చెప్తాడు. ఆ అమ్మాయి హైదరాబాద్‌లో ఉంటుందని అంటాడు. ఇక యమున కనకం దగ్గరకు వెళ్లి తన కొడుకు టిఫెన్ చేయలేదు అని తీసుకెళ్లమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.