Kalavari Kodalu Kanaka Mahalakshmi September 5th: కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్: ఉట్టి కొట్టి దండ కనకం మెడలో వేసిన విహారి.. క్రెడిట్ కొట్టేసిన సహస్ర!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కృష్ణాష్ణమి సందర్భంగా కనకం పాయసం వండితే సహస్ర దాన్ని అందరికీ ఇచ్చి విహారి దగ్గర క్రెడిట్ కొట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర, విహారి కలిసి కృష్ణుడికి పూలదండ వేస్తారు. ఇద్దరూ దండం పెట్టుకున్న తర్వాత దేవుడికి దండం పెడుతున్న విహారి మెడలో సహస్ర పూల దండ వేస్తుంది. విహారి షాక్ అయిపోతాడు. కనక మహాలక్ష్మీని పెళ్లి చేసుకోవడం తన మెడలో దండ వేయడం గుర్తు చేసుకుంటాడు. ఇక సహస్ర చేసిన పనికి అందరూ నవ్వుకుంటారు.
కాదాంబరి: మనవరాలా మీరు దండలు మార్చుకోవడానికి ఇంకా టైం ఉంది.
సహస్ర: ఇంతకన్నా మంచి టైం ఇంకేముంటుంది అమ్మమ్మ. అందుకే బావ మెడలో దండ వేసేశా. అవును దేవుడికి అన్నీ పెట్టారు పాయసం మిస్ అయ్యిందమ్మా.
యమున: చేస్తున్నారమ్మా.
సహస్ర: అవునా ఎవరు చేస్తున్నారు. వంట గదికి వెళ్లి.. పాయసం వాసనే చంపేస్తుంది. ఎవరు చేస్తున్నారు హాయ్.. అని కనకాన్ని పలకరించి కనకాన్ని చూసి షాక్ అవుతుంది. ఏయ్ టెంపుల్ సారీ గల్ నువ్వే కదా నాకు గుడిలో దక్కాల్సిన చీర తీసుకుంది. నువ్వు ఇక్కడేంటి. అమ్మా ఒక సారి రామ్మా.
పద్మాక్షి: నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావ్.
అంబిక: ఈ ఇంట్లో ఉన్నా ఉపయోగం లేని ఓ మనిషి తీసుకొచ్చారు.
యమున: నేనే తీసుకొచ్చా వదిన.
పద్మాక్షి: నువ్వా ఎందుకు తీసుకొచ్చావ్ తను నీకు ఏమవుతుంది.
యమున: మా ఊరి అమ్మాయి సిటీలో ఏదో పని ఉందని వచ్చింది ఆ పని అయిన వరకు మనింట్లో ఉంటుందని తీసుకొచ్చా.
పద్మాక్షి: మన ఇళ్లా అప్పుడే నువ్వు ఈ ఇంటిని నీ సొంతం చేసుకున్నావా సొంత నిర్ణయాలు తీసుకొనే స్థాయికి ఇంకా రాలేదు. మా అమ్మా నాన్న బతికే ఉన్నారు అది గుర్తు పెట్టుకో. నీకే ఈ ఇంట్లో స్థానం లేదు మా అన్నయ్యని పొట్టన పెట్టుకొని నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావు. ఇప్పుడు ఈవిడ గారు కూడా నీలా సెటిల్ అయిపోతే పరిస్థితి ఏంటి.
యమున: వదినా తను కొద్ది రోజులు ఉండి వెళ్లిపోతుంది.
అంబిక: వెళ్లిపోతుంది కదా వీళ్లతో మనకేంటి అక్క వెళ్దాం పద.
సహస్ర పాయసం సర్ది అందరి కోసం తీసుకొని వెళ్తుంది. ఇంట్లో అందరూ ఇలా మాట్లాడుతున్నారేంటని కనకం యమునని అడుగుతుంది. ఇరవై ఏళ్లగా పరిస్థితి ఇలాగే ఉందని తన కొడుకు పరిస్థితి చక్కబెడతాడని అంటుంది. ఇక తన కొడుకు ఎప్పుడైనా మాట్లాడితే ఈ విషయాలు చెప్పొద్దని యమున కనకంతో చెప్తుంది. కనకం తన తండ్రిని గుర్తుచేసుకొని మాట్లాడితే యమున కనకాన్ని దగ్గరకు తీసుకొని ఈ లక్షణాలే నువ్వు నాకు నచ్చేలా చేశాయని అంటుంది. ఇక సహస్ర అందరికీ పాయసం ఇస్తుంది. కనకం దూరం నుంచి చూస్తుంది. టేస్ట్ ఎలా ఉందో అని కనకం టెన్షన్ పడుతుంది. విహారి పాయసం టేస్ట్ అదిరిపోయిందని అంటాడు. అది విని కనకం పొంగిపోతుంది. ఇక సహస్ర క్రెడిట్ కొట్టేస్తుంది. యమున కనకానికి థ్యాంక్స్ అని సైగ చేస్తుంది. కనకం తన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తుంటుంది.
యమున: విన్నావు కదా అందరూ నీ పాయసాన్ని ఎంత మెచ్చుకున్నారో. మా అబ్బాయి అయితే మళ్లీ తింటానన్నాడు వాడికి ఎంత బాగా నచ్చిందో. ఇంతకీ నువ్వు ఈ పాయసం తిన్నావా.
కనకం: లేదండి.
యమున: అయ్యో ఇంత చేసిన దానివి నువ్వు తినకపోతే ఎలా తిను అని తినిపిస్తుంది. కనకం ఎమోషనల్ అయిపోతుంది. ఏమైందమ్మా.
కనకం: ఏం లేదు అమ్మ గుర్తొచ్చింది.
యమున: చూడు నేను ఉన్నాను కదా నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా.
ఇక విహారి పిన్ని కూడా వచ్చి లక్ష్మీని పొగుడుతుంది. ఉట్టి కొట్టడానికి రమ్మని పిలుస్తుంది. ఇక కనకం ఆ టైంలో ఆవిడ చేతుల్లో గాజులు చూసి గుర్తుపడుతుంది. ఆ గాజులు తన భర్త కృష్ణాష్టమి గుర్తుగా ఇచ్చారని చెప్పి మురిసిపోతుంది. కనకం డల్ అయిపోతుంది. ఇక కనకం రాను అనేస్తుంది. కనకం రాను అంటే పని ఆమె బలవంతంగా తీసుకెళ్తుంది. ఇక విహారి టీం సహస్ర టీం గెలుపు కోసం సై అంటే సై అంటారు. కనకం దూరం నుంచి చూస్తుంది. ముందు విహారి బాబాయ్ ఉట్టి కొట్టడానికి వెళ్తాడు. తర్వాత అంబిక, సహస్ర వెళ్తారు. సహస్ర కూడా ఉట్టి కొట్టలేకపోతుంది. ఇక విహారి వెళ్తాడు. విహారిని చూడటానికి కనకం ట్రై చేస్తుంది కానీ అందరూ అడ్డుగా ఉండటంతో చూడలేకపోతుంది. ఇక చివరకు విహారి ఉట్టి కొడతాడు. అందులో దండ వెళ్లి కనకం మెడలో పడుతుంది. అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. కనకం మెడలో దండని సహస్ర చూసి వెళ్లి దండ లాక్కుంటుంది. ఆ టైంలో కనకం మెడకు సహస్ర గోరు తగిలి గాయం అవుతుంది. ఇక సహస్ర తన బావ వేసిన ఆ దండ తన మెడలోనే ఉండాలని వేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: నిద్రపోతున్న క్రిష్‌తో మనసులో మాటలు చెప్పి కంగుతిన్న సత్య.. విడాకులు ఇచ్చేదేలేదట..!