అన్వేషించండి

Satyabhama Serial Today September 5th: సత్యభామ సీరియల్: నిద్రపోతున్న క్రిష్‌తో మనసులో మాటలు చెప్పి కంగుతిన్న సత్య.. విడాకులు ఇచ్చేదేలేదట..!

Satyabhama Today Episode విడాకులు ఇవ్వనని క్రిష్‌తో చెప్పమని సత్యతో తన ఫ్రెండ్స్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode కిడ్నాపర్ దగ్గర సత్య ఫొటోకి బదులు భైరవి ఫొటో మార్చేస్తారు సత్య ఫ్రెండ్స్. దాంతో భైరవి జ్యూస్ అడిగితే కిడ్నాపర్ భైరవినే కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు. మిగతా ఇద్దరు కిడ్నాపర్లకు కూడా అతను సైగ చేసి భైరవినే కిడ్నాప్ చేయాలని అంటాడు. మరోవైపు రాధిక, జర తాము కొట్టి చంపేసిన వ్యక్తి బాడీ లేదని కంగారు పడతారు. ఇక రౌడీలు భైరవిపై ముసుగు వేసి తీసుకొని వెళ్తుంటారు. అది రుద్ర చూస్తాడు. సత్య లోపల ఉండటం చూసి రౌడీలు ఎవర్ని ఎత్తుకెళ్తున్నారని చూసి తన తల్లిని చూసి షాక్ అవుతాడు. భైరవి రౌడీలతో పాటు రుద్రని కూడా కొడుతుంది. 

జర: బయట లేడు లోపల లేడు అసలీ ఆత్మ ఏమైంది.
రాధిక: ఆత్మ సంగతి పక్కన పెట్టవే అసలు అక్కడ మనిషే లేడు కదా. 
జర: ఆత్మతోనే పని ఆత్మే కదా మనల్ని సతాయిస్తుంది.
దీప్తి: చచ్చిన వాడు ఉంటే కదా ఆత్మ ఉంటుంది.
రాధిక: బాడీ లేదు అంటే వాడు చనిపోలేదు. పదండి వెళ్లి వెతుకుదాం.
జర: ఇప్పుడు మనం మనిషిని పట్టుకోవాలా.. ఆత్మ వెతికి పట్టుకోవాలా.. బాడీ పట్టుకోవాలా.
రాధిక: ఎక్కువ వాగావ్ అంటే చంపేస్తా.
జర: వీళ్లకి నా ప్రశ్న అర్థం కాకపోయింటుందిలే.

మరోవైపు మహదేవయ్య, భైరవిల పెళ్లి తంతు జరుగుతుంది. ఇక ఆర్‌డీఎక్స్ గ్యాంగ్ రౌడీని చూస్తారు. చనిపోలేదని ఫిక్స్ అవుతారు. ఇక పెళ్లి అట్టహాసంగా జరుగుతుంది. దండలు మార్చుకోవడం, తలంబ్రాలు చూడముచ్చటగా జరుగుతుంది అందరూ సంతోషంగా ఉంటారు. సత్య ఫ్రెండ్స్  మాత్రం సత్య, క్రిష్‌లను ఒకటి చేయడానికి ఏం చేయలేకపోతున్నాం అని బాధపడతారు. 

దీప్తి: మన మీద నమ్మకంతో దాని సమస్య మన చేతిలో పెట్టింది.
జర: దాని కన్నీళ్లు తుడవటం తప్ప మనం ఏం చేయలేమా. 
రాధిక: లాస్ట్ అండ్ ఫైనల్ ఒక సారి ప్రయత్నిద్దాం. ఈ పెళ్లి తంతు అవ్వగానే సత్యతో మాట్లాడుదాం.
సత్య: మేం కలవడం ఇక ముగిసి పోయిన అధ్యాయమే. 
జర: అంటే బావగారిని వదిలిపెట్టెస్తున్నావా
సత్య: నేను కాదు తనే నన్ను వదిలేస్తున్నాడే.
రాధిక: నువ్వు అంటే తనకి గుండె నిండా ప్రేమ ఉందే.  
దీప్తి: నీకు అతను దూరంగా ఉండలేడు.
సత్య: నాకు అన్నీ తెలుసు. తెంపు కోవాలి అని నాకు లేదే. కానీ బంధం నిలుపుకొనే దారే లేదు. నా ప్రేమ నమ్మలేకపోతున్నాడు. క్రిష్ గుండెల్లో నా మీద ఎంత ప్రేమ ఉందో అంత అప నమ్మకం ఉంది. నా మీద ప్రేమను దాచుకొని నాకు దూరంగా ఉంటున్నాడు అదే నా బాధ.
రాధిక: ప్రేమతో చేసే యుద్ధాలు ఓ పట్టాన తేలవు ఓపిక ఉండాలి. వెళ్లి అతనితో ఫేస్ టూ ఫేస్ మాట్లాడు. ఏ దారి లేదు అనుకుంటే నాలా కొంగు బిగించు. ఎదురు తిరుగు. తెగించి మాట్లాడు.
సత్య: నా వల్ల కాదు పెళ్లి తర్వాత క్రిష్ నాకు చాలా అండగా ఉన్నాడు. అంత మంచోడికి ఎలా ఎదురు తిరగాలే నా వల్ల కాదు.
జర: బలే ఉన్నావే. మౌనంగా ఉండి బంధం తెంపుకోవడం మంచిదా ఎదురు తిరిగి బంధం నిలుపుకోవడం మంచిదా. వదులు కోవడానికి సిద్ధ పడినప్పుడు కలవడానికి తెగించాలి.
దీప్తి: అగ్రిమెంట్‌లో ఆవేశంతో సంతకం పెట్టావ్ అది చెల్లదే బోనులో నువ్వు చెప్పేది వింటారు. 

సత్య: క్రిష్ గదిలో ఉంటే మాట్లాడటానికి వస్తుంది. క్రిష్ వేరే వైపు తిరిగి ఉంటే సత్య మాట్లాడుతుంది. నా మనసులో ప్రేమ నీకు తెలపడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాను. నువ్వు వినడానికి ప్రిపేర్గా లేవు. నువ్వు నమ్మడం లేదు అలా అని అవమానించడం లేదు అనుమానిస్తున్నావ్. కళ్లతో ప్రేమగా చూస్తున్నావ్ మాటలతో దూరం పెడుతున్నావ్. నా బాధ భరిస్తున్నాను కానీ నీ బాధ చూడలేకపోతున్నాను క్రిష్. నా నిర్లక్ష్యాన్ని భరించావ్. చాలా ప్రేమించావ్. మొదట్లోనే నువ్వు నన్ను పంపేసుంటే నాలుగు రోజులు బాధ పడినా ఎవరి జీవితాలు వాళ్లు బతికే వాళ్లం కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. నాలో కూడా ప్రేమ చిగురించింది క్రిష్. నువ్వు అంటే ఇష్టం పుట్టింది. దూరం ఉంచితే బాధగా ఉంది వింటున్నావా. నన్ను వదులుకోవాలి అని నువ్వు అనుకుంటే అందుకు నేను సిద్ధంగా లేను. నిన్ను వదులుకోలేను. విడాకులు వద్దని కోర్టులో ఎదురు తిరుగుతాను తర్వాత నీ ఇష్టం.

సత్య చెప్పేసి వెళ్లబోతు క్రిష్ ముందుకు వెళ్లి చూస్తుంది. తీరా చూస్తే క్రిష్ చేతిలో మందు బాటిల్ పట్టుకొని పడుకొని ఉంటాడు. తాను చెప్పిందేదీ క్రిష్ వినలేదని సత్య బాధపడుతుంది. తర్వాత క్రిష్‌ని పడుకోపెట్టి దుప్పటి కప్పి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీతో పారాణి, నందన్ వంశ నెక్లెస్ పెట్టించుకున్న మనీషా.. పెళ్లి ఆగుతుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget