Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 4th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీతో పారాణి, నందన్ వంశ నెక్లెస్ పెట్టించుకున్న మనీషా.. పెళ్లి ఆగుతుందా?
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode నందన్ వంశానికి చెందిన నెక్లెస్‌ని మనీషా లక్ష్మీ చేతితోనే తన మెడలో వేయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా పెళ్లి కూతురిలా రెడీ అవుతుంది. లక్ష్మీ అలియాస్ సంయుక్తని పిలవమని దేవయానితో చెప్తుంది. తనని ఇప్పుడు ఎందుకు పిలవడం అని దేవయాని అడిగితే ఈ పెళ్లి జరగనివ్వనని లక్ష్మీ చెప్పిందని తనకి చెప్పాల్సినవి చాలా ఉన్నాయని ఈ పెళ్లి ఆపలేవని చెప్పాలని అంటుంది. మరోవైపు జున్ను, లక్కీలు మిత్ర, మనీషాల పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. తమకు పెళ్లి ఇష్టం లేదని అనుకుంటారు.
లక్కీ: నాకు మనీషా ఆంటీ అమ్మగా వద్దు మీ అమ్మ లాంటి అమ్మ కావాలి. అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. మీ అమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా మీ అమ్మని చూసిన ప్రతి సారి మీ అమ్మ లాంటి అమ్మ నాకు ఉంటే బాగున్నని చాలా సార్లు అనిపించింది. ఫ్యామిలీ ట్రీలో మీ అమ్మ ఫొటో అతికించినప్పుడు అది నిజం అయితే బాగున్ను అనిపించింది. కానీ బ్యాడ్ లక్ ఇప్పుడు ఆ స్థానంలోకి మనీషా ఆంటీ వస్తుంది.
జున్ను: మనీషా ఆంటీ నీకు అమ్మగా వద్దని మీ నాన్నకి చెప్పొచ్చు కదా.
లక్కీ: మా నాన్నకి నేను ఎదురు చెప్పలేను. నాన్న ఇష్టమే నా ఇష్టం.
జున్ను: మీ నాన్న మనీషా ఆంటీని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నీ కోసమే చేసుకుంటున్నారు. మనం బలంగా కోరుకుంటే పెళ్లి ఆగిపోతుంది. పద మనం దేవుడిని పెళ్లి ఆగిపోవాలని గట్టిగా కోరుకుందాం.
దేవయాని సంయుక్తని పిలుస్తుంది. ఇక అరవింద దేవయానితో నీకు తెలిసే మొత్తం జరుగుతుందని నీకు తెలియకుండా ఏం జరగదని అంటుంది. ఇంతలో మనీషా వస్తుంది. మనీషా తన కాళ్లకి పారాణి పెట్టమని సంయుక్తతో చెప్తుంది. సంయుక్తతో పాటు అరవింద, జాను షాక్ అయిపోతారు. తను నీ కాళ్లు పట్టు కోవాలా అని అరవింద అడుగుతుంది. దానికి మనీషా మంచి మనసు ఉన్న వారు పారాణి పెడితే ఆ పెళ్లి కూతురి కాపురం పది కాలాల పాటు పదిలంగా ఉంటుందని అంటుంది. అరవిందతో పాటు జాను కూడా సంయుక్త మనీషా కాళ్లకు పారాణి పెట్టడానికి ఒప్పుకోరు కానీ సంయుక్త మాత్రం పెడతానని అంటుంది.
సంయుక్త పారాణి పట్టుకొని మనీషా కాళ్లకి పెట్టబోతే మనీషా కాళ్లు ఊపుతూ పెళ్లి ఆపుతానని అన్నావ్ ఇప్పుడు నా కాళ్లకి పారాణి పెడుతున్నావని ఎగతాళి చేస్తుంది. పెళ్లి అయితే మిత్రని తీసుకొని ఫారిన్ వెళ్లిపోతానని లక్కీ మళ్లీ అనాథ అయిపోతుందని అంటుంది మనీషా. నీ లాంటి దుర్బుద్ది ఉన్న వాళ్లకి మంచి జరగదని పెళ్లి ఆగిపోతుందని దేవుడే ఆపేస్తాడని లక్ష్మీ అలియాస్ సంయుక్త అంటుంది. ఎవరూ నా పెళ్లి ఆపలేరు అని మనీషా అనేలోపే నడుము పట్టేస్తుంది దాంతో దేవుడు ఏం చేయలేడు అన్నావు దేవుడే చేశాడని సంయుక్త అంటుంది. ఇక మనీషా దేవయానికి నెక్లెస్ తీసుకురమ్మని చెప్తుంది.
దేవయాని తీసుకొస్తే అది ఎందుకు తీసుకొచ్చారని లక్ష్మీ నక్లెస్ అని అరవింద అడిగితే దేవయాని అడ్డుకొని అది నందన్ వంశ నక్లెస్ అని అంటుంది. ఇప్పుడు మిత్ర భార్యగా ఇంటి కోడలిగా ఆ నెక్లెస్ నాదే అని మనీషా అంటుంది. మనీషా దాన్ని లక్ష్మీకే తన మెడలో వేయమని అంటుంది. సంయుక్త నెక్లెస్ వేస్తున్నట్లు పీక పిసికేస్తుంది. మనీషా గోల పెడితే ఈ నెక్లెస్ నీ మెడకు సరిపోదని అంటుంది. సెట్ అయినా అవ్వకపోయినా పర్లేదు మెడలో వేయమని చెప్తుంది. ఇక మనీషా ఇన్ డైరెక్ట్‌గా పెళ్లి ఆపలేకపోతున్నారని అందరితో అంటుంది.. లక్ష్మీ మనీషా మెడలో నెక్లెస్ వేయగానే మనీషా వెళ్లిపోతుంది. లక్ష్మీ చాలా బాధ పడుతుంది.
పంతులు పెళ్లి కొడుకుని రమ్మని అంటాడు. మిత్ర పెళ్లి కొడుకులా రెడీ అయి మనీషా దగ్గరకు వెళ్తాడు. పెళ్లికి ముందే నాకు ఓ ప్రామిస్ చేయమని మనీషాని అడుగుతాడు. ఏంటని మనీషా అడిగితే లక్కీని సొంత బిడ్డలా చూసుకుంటానని లక్కీ అనాథ అని తనకి ఎప్పటికీ తెలీకూడదని అంటాడు. దానికి దేవయాని మనసులో లక్కీని అనాథని చేసేస్తుందని అనుకుంటుంది. ఇక మనీషా మాత్రం తాను లక్కీ కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని లక్కీ కోసం తనకి పిల్లలు కూడా వద్దని మిత్రని నమ్మిస్తుంది. మిత్ర చేతిలో చేయి వేసి ప్రామిస్ వేస్తుంది. మనీషా నటనకి వివేక్, జయదేవ్ తిట్టుకుంటారు. ఇక లక్కీ తండ్రి పీటల మీద కూర్చొని దేవుడు పెళ్లి ఆపడం లేదని జున్నుతో చెప్తుంది. మనమే ఈ పెళ్లి ఆపితే బాగున్ను అని అమ్మని మనమే తీసుకొస్తే నాన్న పెళ్లి ఆపేస్తాడని లక్కీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.