Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం, విహారిలను కలిపిన పసుపు కుంకుమలు.. మరదలి కోసం బావ సాహసం!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సహస్ర ఫోన్ దొంగ తీసుకెళ్లిపోవడం విహారి పరుగున వెళ్లడం అదే టైంలో కనకం రావడం ఒకర్ని ఒకరు ఢీ కొట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీకి నల్లపూసలు మార్చుతున్న గుడికే విహారి, పద్మాక్షితో పాటు ఫ్యామిలీ మొత్తం వస్తారు. ఇక పంతులు నల్లపూసలు భర్త వేయాలని లక్ష్మీకి భర్త గురించి అడుగుతారు. దాంతో యమున ప్రస్తుతం భర్త రాలేరని చెప్తుంది. ఆ మాట విన్న పంతులు ఎవరైనా ముత్తయిదువుల వేసినా పర్లేదని అంటాడు. లక్ష్మీతో పుస్తెలకు పూజ చేయిస్తారు. మరోవైపు విహారి తల్లి గురించి టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తాడు. యమున ఫోన్ ఇంట్లో మర్చిపోయి ఉంటుంది. పద్మాక్షి, అంబికలు యమున వస్తే దరిద్రమని అనుకుంటారు.
విహారి: అసలు అమ్మకి నా కంటే ముఖ్యమైన పనులు ఏం ఉంటాయి. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది.
కాదాంబరి: విహారి ఇప్పటికే ఒకసారి పూజ ఆగిపోయి మీ అత్తయ్య బాధ పడింది. ఇప్పుడు మళ్లీ పూజ ఏ కారణంతో అయినా ఆగిపోతే బాగోదు.
విహారి: అది కాదు నానమ్మ.
అంబిక: విహారి మీ అమ్మ లేకుండా మన ఇంట్లో చాలా పూజలు జరిగాయి. మీ అమ్మకి ఐయిదోతనం లేదు కాబట్టి అన్ని పూజల్లో తను ఉండాలనేం లేదు.
కాదాంబరి: ఇది కూడా అలాగే అనుకోరా. అంతే గానీ అమ్మ గురించి ఆలోచించి ఈ పూజలో ఆటంకాలు తీసుకురాకు. ఈసారి అలాంటి పరిస్థితి వస్తే మీ అత్తయ్య మనకు దూరం అయినట్లే.
పంతులు లక్ష్మీ నల్లపూసలు మరో పంతులుకి ఇచ్చి గుడిలో ముత్తయిదువుల ఆశీర్వాదం తీసుకురమ్మని చెప్తాడు. ఇక లక్ష్మీ విహారి జీవితం బాగుండాలని కోరుకుంటుంది. యమున విహారి చేయబోయే పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని కోరుకుంటుంది. మరో వైపు అంబిక సుభాష్‌కి కాల్ చేస్తుంది. సుభాష్ లక్ష్మీ గురించి అడుగుతాడు. దానికి అంబిక తను ఇచ్చిన వార్నింగ్‌కి లక్ష్మీ తెల్లారే పారిపోయిందని చెప్తుంది. ఇక ఇద్దరూ విహార్ గురించి మాట్లాడుకుంటారు. విహార్ వేరే వారికి ప్రాజెక్ట్ ఇచ్చేలా చేశాడని విహారి అంతు చూసేవరకు ఊరుకోనని అంబిక చెప్తుంది. పంతులు అంబిక దగ్గరకు వెళ్లి నల్లపూసలకు ఆశీర్వాదం తీసుకుంటాడు.
మరోవైపు పంతులు విహారి, సహస్రలకు ప్రదక్షిణలు చేయమని అంటాడు. ఇక లక్ష్మీకి మరో పంతులు గడప, తులసి కోట ఆశీర్వాదం తీసుకోమని అంటాడు. పసుపు కుంకుమలు పట్టుకొని లక్ష్మీ వెళ్తుంది. గుడి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడుతుంది. విహారి, సహస్రలు అక్కడే ప్రదక్షిణలు చేస్తుంటారు. తర్వాత కనకం తులసి కోట దగ్గరకు వెళ్తుంది. ఇక ఓ దొంగ సహస్ర ఫోన్ లాక్కొని వెళ్లిపోతాడు. విహారి, సహస్ర పరుగులు తీస్తారు. అదే టైంలో విహారి కనకాన్ని ఢీ కొట్టేస్తాడు. కనకం మీద పసుపు పడిపోతుంది. కనకం విహారిని చూసి షాక్ అయిపోతుంది. విహారి కనకాన్ని చూసినా గుర్తు పట్టలేకపోతాడు. సారీ చెప్పి వెళ్లిపోతాడు. పసుపు కుంకుమల వల్ల విహారి తనని గుర్తు పట్టలేదని అనుకుంటుంది. తర్వాత సహస్ర, విహారిలకు ఈ గుడిలో పూజ జరుగుతుందా అనుకుంటుంది. మరోవైపు విహారి దొంగని పట్టుకొని చితక్కొట్టి సహస్రకి ఫోన్ ఇస్తాడు. సహ్రస్ర బావ సాహసానికి మరోసారి ప్రేమలో పడిపోతుంది.
యమున వెళ్తుంటే లక్ష్మీ పిలుస్తుంది. ఎవరు అని యమున అంటే అమ్మ నేనే లక్ష్మీ అని అంటుంది. ఏమైందని ముఖానికి పసుపు కుంకుమలు ఏంటి అని అడుగుతుంది. నీ భర్త నువ్వు జీవితాంతం కలిసి ఉండాలని నీ భర్త చల్లగా ఉంటాడని ఈ విధంగా దేవుడు నీకు ఆశీర్వదించాడని యమున అంటుంది. ఇక విహారి, సహస్రలు వస్తారు. సహస్ర జరిగిన దొంగతనం గురించి అందరికీ చెప్తుంది. బావని తెగ పొగిడేస్తుంది. అందరూ విహారిని పొగిడేస్తారు. పెద్దాయన భార్యని ఎలా చూసుకోవాలో చెప్తే విహారి ఒక్కసారి కనకం గురించి ఆలోచనలో పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.