Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 26th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: చేపల పులుసులో గుండు సూది.. లక్ష్మీని కొట్టిన పద్మాక్షి.. లక్ష్మీ మెడలో తాళి చూసేసిన యమున!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం వండిన చేపల పులుసులో అంబిక గుండు సూదులు వేసేసి పద్మాక్షి లక్ష్మీని కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక కనక మహాలక్ష్మీ గొంతు పట్టి చంపాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో విహారి ఫైల్స్ తీసుకొని అక్కడికి వస్తాడు. కొత్త ప్రాజెక్ట్ వేరే వాళ్లకి ఇస్తున్నామని కంపెనీ మ్యానేజింగ్ డైరెక్టర్‌గా నీ సంతకం కావాలని చేయమని చెప్తాడు. అంబిక రగిలిపోతుంది. అయిష్టంగా సంతకం చేస్తుంది. మరోవైపు కనకం విహారి కంట పడకుండా తలుపు చాటున దాక్కుంటుంది.
అంబిక: మనసులో.. నేను అనుకున్న వాళ్లకి కాకుండా ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్లకి ఇస్తున్నావ్. ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను సంపాదించాలి అనుకున్నది నాకు దక్కకుండా చేస్తున్నావ్. నాకు అవకాశం వస్తుంది విహారి. విహారి వెళ్లిపోగానే అంబిక చిటెకలు వేసి లక్ష్మీని పిలుస్తుంది. సైగలతో కూర్చొమని చెప్తుంది. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ రేపు నా కంటికి కనిపించావో నీ శవం కాటికి పోతుంది. పో ఇక్కడి నుంచి.
రాత్రి లక్ష్మీ, పండు అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేస్తారు. చేపల పులుసు చూసి పండు నాకు తినేయాలి అనిపిస్తుందని అంటాడు. వంట చేసే వాళ్లు అందరూ తిన్న తర్వాతే తినాలని చెప్తుంది. పండు సరే అంటాడు. ఇక అందరికీ పిలుస్తాడు పండు. అంబిక వచ్చి ఎవరూ చూడకుండా కూరలో చిన్న చిన్న మేకులు వేసేస్తుంది. అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటారు. లక్ష్మీ, పండు అందరికీ వడ్డిస్తారు. అంబికని చూసి లక్ష్మీ భయపడుతుంటుంది. అది యమున గమనిస్తుంది. పెద్దాయన యమునని కూడా తినమంటే మీరంతా తిన్న తర్వాత తింటానని అంటుంది. ఇక పెద్దాయన లక్ష్మీ వంటని పొగిడేస్తారు. దానికి తోడు పండు కూడా చాలా పొగుడుతాడు. ఇక విహారిని పిలవమని పెద్దాయన చెప్తారు. దాంతో పండు పిలవగానే విహారి వస్తానని అంటాడు. విహారి రావడం చూసిన లక్ష్మీ పెరుగు తెస్తానని వంట గదికి వెళ్లిపోతుంది.
విహారి రాగానే పండు లక్ష్మీ వంట గురించి పొగిడితే పద్మాక్షి తిడుతుంది. దాంతో విహారి పండుతో ఎక్కువ మాట్లాడకు పండు నీ నాలుక కట్ చేసేస్తుంది మా అత్త అని అంటుంది. ఇక విహారి తల్లిని కూడా కూర్చొమంటే పద్మాక్షి, కాదాంబరి కోపంగా చూస్తారు. అది చూసిన యమున అందరూ సంతోషంగా భోజనం చేస్తున్నారు ఇప్పుడు ఇబ్బంది ఎందుకని అంటుంది యమున. దాంతో విహారి కూర్చొంటే యమున వడ్డిస్తుంది. పద్మాక్షికి అంబిక వేసిన గుండుసూది గుచ్చి కెవ్వు మంటుంది నోటి నుంచి రక్తం కూడా వస్తుంది. కొంత మంది నా రక్తం చూడాలి అనుకుంటున్నారని కోప్పడుతుంది. ఎవరూ ఈ పులుసు చేసిందని అడిగి లక్ష్మీ చేసిందని చెప్పడంతో పద్మాక్షి లక్ష్మీ లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. నన్ను చంపేయాలి అనుకుంటున్నావా అని తిడుతుంది. అంబిక నవ్వుకుంటుంది. పద్మాక్షి కోపంతో వెళ్లిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఈ సారి పూజకు భంగం కలిగితే ఊరుకునేది లేదని అంటుంది. అంబిక కూడా చేయి కడిగేసుకొని వెళ్లిపోతుంది. ఇక లక్ష్మీ బాధపడుతుందని తన దగ్గరకు వెళ్లమని విహారి తల్లికి చెప్తాడు.
యమున గదిలో ఉన్న లక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. లక్ష్మీ ఏడుస్తుంటుంది. ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. నా జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తింటున్నానని లక్ష్మీ అంటుంది. యమున లక్ష్మీకి క్షమాపణలు చెప్తుంది. ఇక అప్పుడే యమున లక్ష్మీ మెడలో తాళి బొట్టు చూస్తుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.