అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today September 26th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మాస్టర్ ప్లాన్‌తో విద్యాదేవికి ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చిన సీత.. మహాకి దెబ్బ మీద దెబ్బ!

Seethe Ramudi Katnam Today Episode అందరికీ బట్టలు గిఫ్ట్‌గా ఇచ్చిన సీత విద్యాదేవి ఎవరో తెలుసుకోవడానికి ఆమెకు ఫోన్ గిఫ్ట్ ఇచ్చి కాల్ రికార్డ్స్ అయ్యేలా చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత బొటిక్‌లో దేవుడికి దీపం పెట్టి దండం పెట్టుకుంటుంది. బిజినెస్ సక్సెస్ అయి మంచి లాభాలు రావాలని మొక్కుకొని బయటకు వెళ్లి కొబ్బరి కాయ కొడుతుంది. ఇంతలో మహాలక్ష్మీ అర్చన అక్కడికి వస్తారు. సీత ఇద్దరు అత్తలను చూసి ఆగుతుంది. బోనీ చేయడానికి వచ్చారా అని అడుగుతుంది. దాంతో అర్చన మేం ఏమైనా అప్పు ఉన్నామా బోనీ పేరుతో మా దగ్గర డబ్బు తీసుకుంటున్నావ్ అంటుంది. 

మహాలక్ష్మీ: నా రేంజ్‌కి నువ్వు ఇలా నా పేరు పెట్టుకొని చీఫ్‌గా చీరల వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు.
సీత: నేను పైకి రావడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు అత్తయ్య. మీకు పోటీ వస్తానని మీకు భయం.
మహాలక్ష్మీ: నువ్వు మాకు పోటీ ఏంటి.
అర్చన: కోట్లలో వ్యాపారం చేసుొనే మేం ఎక్కడ చిన్న చీరలు వ్యాపారం చేస్తున్న నువ్వు ఎక్కడ.
మహాలక్ష్మీ: ఈ సోది అంతా ఎందుకు నీకు కావాల్సింది డబ్బే కదా. ఇదిగో బ్లాంక్ చెక్ ఇది తీసుకో. ఇందులో ఎంత డబ్బు అయినా రాసుకో. మొత్తం నీకే ఈ బొటిక్ మూసేయ్. 
అర్చన: మహా నీకు బంపర్ ఆఫర్ ఇచ్చింది సీత చెక్ తీసుకో.
సీత: ఇందులో ఎంత అయినా రాసుకోవచ్చా ఆస్తి మొత్తం రాసుకోవచ్చా. నేను ఆస్తి మొత్తం తీసుకుంటే మీరు ఏం చేస్తారు అత్తయ్యలు. ఈ షాప్ తీసుకొని చీరలు అమ్ముకుంటారా అప్పుడు మీ పరువు పోతుంది కదా.  అని చెక్ చింపి పడేస్తుంది.  

చెక్ చింపినందుకు అర్చన సీతని తిడుతుంది. దానికి సీత మీరు నాకు చెక్ ఇచ్చేది ఏంటి నేనే మీకు నా బిజినెస్ డెవలప్ చేసి డబ్బు ఇస్తా అంటుంది. దాంతో మహాలక్ష్మీ నువ్వు మాకు డబ్బు ఇవ్వడం ఏంటి అని కోప్పడతుంది. అతి విశ్వాసం పనికి రాదని అంటుంది. ఇంతలో ఓ కపుల్ అక్కడికి వస్తుంది. వాళ్లు తమకు తెలిసిన వాళ్లని చూస్తే పరువు పోతుందని మహాలక్ష్మీ వాళ్లు దాక్కుంటారు. ఇక ఆవిడ తనకు మహాలక్ష్మీ అంటే చాలా ఇష్టమని మహాలక్ష్మీ కట్టే చీరలు లాంటి చీరలే కావాలని అంటుంది. దాంతో సీత వాళ్లకి చీరలు చూపిస్తే ఆమె చీరల మీద వర్క్ చేయమని సీతకి అడ్వాన్స్‌గా 3 లక్షలు ఇస్తుంది. మహాలక్ష్మీ, అర్చన షాక్ అవుతారు. నా పేరు చెప్పొకొని సంపాదిస్తున్నావ్ అని మహాలక్ష్మీ అంటుంది. వాళ్లు వచ్చింది నా పేరు చెప్పుకొనే వచ్చారని అంటుంది. మహాలక్ష్మీ అర్చనలు సీతని తిట్టి వెళ్లిపోతారు. త్వరలోనే సీత షాప్ లేకుండా చేస్తానని అనుకుంటారు.

సీత ఇంటికి వచ్చి పని మనిషి రాజ్యం, సాంబ భార్యలకు చీరలు, డబ్బు ఇచ్చి తన బిజినెస్ బాగా నడుస్తుందని చెప్తుంది. దాంతో ఇద్దరూ సీతని తెగ పొడిగేస్తారు. ఇంతలో మహాలక్ష్మీ వచ్చి అందరినీ కిందకి పిలుస్తుంది. సీత చీరల వ్యాపారం బాగా నడుస్తుంటే దానికి ఎంతో సహకరించిన మనకి ఏం ఇవ్వకుండా పని వాళ్లకి చీరలు ఇచ్చిందని మనల్ని వాళ్ల కంటే తక్కువ చేసిందని మహాలక్ష్మీ అంటుంది. దాంతో చలపతి మన అందరికీ ముందే ఇచ్చిందని జనార్థన్, అర్చన, గిరిధర్‌లు కూడా మాకు ముందే ఇచ్చిందని అంటారు. ఇక సీత మీకు ఇవ్వలేదని ఫీల్ అయ్యారా అత్తా మీకు చీర తెచ్చానని నా స్తోమతకు తగ్గట్టు ఇచ్చానని తీసుకోమని అంటుంది. సీతని దెబ్బకొట్టాలని అనుకుంటే నన్నే దెబ్బకొట్టిందని అంటుంది. విద్యాదేవి టీచర్‌కి మాత్రం కొత్త ఫోన్‌ ఇస్తుంది. మీకు ఫోన్ లేదని ఇకపై ఇది మీ సొంత ఫోన్ అని ఇకపై సాంబ ఫోన్ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదని అంటుంది. ఇక రామ్ సీత అందరికీ గిఫ్ట్‌లు ఇచ్చి తనకు ఇవ్వలేదని ఫీలవుతాడు. ఇక సీత విద్యాదేవి టీచర్‌ని, మహాలక్ష్మీని పొగిడేస్తుంది. 

సీత విద్యాదేవికి ఇచ్చిన ఫోన్‌లో ఆమె ఎవరెవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి కాల్ రికార్డ్స్ అయ్యేలా అవన్నీ తాను వినేలా చేస్తుంది. మరోవైపు టీచర్ చాలా సంతోషిస్తుంది. మేనకోడలు గిఫ్ట్ ఇచ్చిందని మొదటి కాల్ అన్నా వదినలతో మాట్లాడుతానని అనుకుంటుంది. శివకృష్ణకు కాల్ చేస్తుంది. సీత చాటుగా టీచర్ గది దగ్గరకు వెళ్తుంది. సీత తనకు ఫోన్ కొని ఇచ్చిందని అంటుంది. తన సంతోషం అన్నావదినలతో పంచుకుంటుంది. ఇక సీతని కాసేపు పొగుడుతుంది. ఈ కాల్ వల్ల తనకు ఏం తెలియలేదని సీత అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని బలిపశువుని చేస్తున్న మహదేవయ్య.. భర్త కోసం రుజువుల వేటలో సత్య!  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget