అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 25th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆ పనికి దూరంగా ఉండమని యమునకు వార్నింగ్ ఇచ్చిన పద్మాక్షి.. లక్ష్మీ గొంతు నొక్కేసిన అంబిక!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode అంబిక ప్రియుడితో రొమాన్స్ చేయడం కనకం చూసేయడంతో అంబిక కనకం గొంతు నులిమి ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ఆదికేశవ్, గౌరీలు కనకాన్ని చీర బహుమతిగా ఇస్తారు. కనకం  చాలా సంతోషిస్తుంది. తల్లిదండ్రులు కారు ఎక్కి వెళ్లే వరకు చూస్తుంది. తర్వాత ఆ చీర పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. తండ్రి కూర్చొన్న చోట మట్టి తాకి తండ్రి కాళ్లకి దండం పెట్టినట్లు ఫీలవుతుంది. మరోవైపు కాదాంబరి, పద్మాక్షి వాళ్లు కూర్చొని రేపు పూజ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగకూడదని అనుకుంటారు. పద్మాక్షి యమున వల్ల ఇంటికి అరిష్టమని దాని వల్లే అన్నీ అవుతాయని అంటుంది. కాదాంబరి యమునను పిలవమని వసుధతో చెప్తుంది.

కాదాంబరి: ఇంకా ఎన్ని రోజులు ఏడు వారాల నగలు నీ దగ్గర దాచుకుంటావ్ కోడలు రాబోతుంది కదా దానికి ఇవ్వు. 
యమున: అవును అత్తయ్య నేను నా దగ్గర పెట్టుకొని ఏం చేస్తాను. అవి ఎలాగూ ఇంటి కోడలికి దక్కాల్సిందే కదా.
కాదాంబరి:  ఈ నీతులు నియమాలు బాగా చెప్తావ్ కానీ ఆచరించవు. చూడు పెళ్లి వరకు ఆగకుండా నిశ్చితార్థానికి ముందే ఆ నగలు సహస్రకి ఇవ్వు.
పద్మాక్షి: చూడు ఒకసారి నీ వల్ల రేపు జరగాల్సిన పూజ ఆగిపోయింది. మళ్లీ ఇంకోసారి ఆగింది అంటే నేను సహించను. భరించను. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ రోజు నీ వల్ల మేం ఎందుకు బాధ పడతాంలే.
యమున: ఈ సారి అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఆనందంగా జరుగుతుంది.
పద్మాక్షి: అనుకున్నది జరగాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా నువ్వు అక్కడ ఉండకూడదు.
యమున: నా కొడుకు చేసే పూజలోనూ నా కొడుకుకి జరిగే తులాభారంలో నేను ఉండకూడదా. 
పద్మాక్షి: అవును తమరు దర్శనం ఇస్తే అక్కడే దరిద్రాలు ఉంటాయి. నువ్వు వస్తే ఆ పూజ జరుగుతుందని నమ్మకం నాకు లేదు. అందుకే నువ్వు రావడానికి వీళ్లేదు. ఇంకో విషయం నీ కొడుకుని ఎలా ఒప్పిస్తావో అది కూడా నీ చేతిలోనే ఉంది. మా మీదకు మాత్రం రావడానికి వీల్లేదు.
యమున: సరే వదిన నేను రావొద్దని మీరు కోరుకుంటే నేను రాను. 

అంబిక ఇంటికి వస్తుంది. కిచెన్లో లక్ష్మీని చూసి పిలుస్తుంది. తన రూమ్‌కి కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. లక్ష్మీ భయపడుతూ సరే అంటుంది. మరోవైపు యమున కష్టాలు కనీళ్లే తన జీవితంలో ఉన్నాయని కొడుకు పెళ్లి పనుల్లో పాల్గొన నివ్వకుండా చేస్తున్నావ్ అని ఏడుస్తుంది. తల్లి ఏడుపు విహారి విని ఏమైందని అడుగుతాడు. యమున కవర్ చేసినా బాధగా ఉన్నావని అంటాడు. దాంతో అలసిపోయానని యమున చెప్తుంది. విహారి ఎంత అడిగినా తల్లి చెప్పకపోవడంతో తన తల మీద చేయి వేసి ఒట్టు వేసి నిజం చెప్పమని అంటాడు. ఇక పద్మాక్షి బయట నుంచి అదంతా కోపంగా చూస్తుంది. పద్మాక్షిని యమున చూస్తుంది. 

యమున: నాన్న గారు గుర్తొచ్చారు అందుకే కాస్త బాధ అనిపించింది.
విహారి: లేదమ్మా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావ్ అనిపిస్తుంది.
పద్మాక్షి: ఏమైంది విహారి.
విహారి: ఏం లేదత్తా అమ్మ బాధ పడుతుంది ఎందుకో చెప్పడం లేదు.
పద్మాక్షి: భర్త గుర్తొచ్చాడని చెప్తుంది కదా ఏ భార్యకైనా పోయిన భర్త గుర్తులు ఎంత బాధగా ఉంటాయో నీకు అర్థం కాదు. గుచ్చి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టకు. విహారి పోయిన సారి నువ్వు పూజకు రాకపోవడంతో నాకు చాలా కోపం వచ్చింది. కొన్ని సార్లు చిన్న చిన్న తప్పులే అనుకున్నా పెద్ద అగాధాలను సృష్టిస్తాయి. ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను.
విహారి: అత్త ఒకసారి తప్పు చేశాను ఇంకోసారి అది చేయను. 
పద్మాక్షి: నువ్వు ఒక్కదానివి అడుగుపెడితే శుభం జరగాల్సిన చోట అశుభం. నువ్వు వస్తే జరిగేది పూజ కాదు ప్రళయం గుర్తు పెట్టుకో.

అంబిక చిరాకుగా గదిలోకి వచ్చి అన్నీ విసిరి కొట్టేస్తుంది. ఇక తనని సుభాష్‌ని లక్ష్మీ చూడటం గుర్తు చేసుకొని రగిలిపోతుంది. లక్ష్మీ వణుకుతూ కాఫీ తీసుకొని అంబిక గదికి వస్తుంది. కాఫీ ఇవ్వగానే అంబిక కప్పు విసిరి కొడుతుంది. తర్వాత కనకం దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి గొంతు పట్టుకొని గోడకు తగిలించి నొక్కేస్తుంది. తనని వదిలేయమని కనకం ఎంత బతిమాలినా వదలదు. మరోవైపు విహారి ఫైల్స్ తీసుకొని అంబిక గదికి వస్తుంటాడు. ఇక అంబిక కొన్ని మర్చిపోవాలి చూసిన వన్నీ గుర్తు పెట్టుకుంటే కళ్లు పోతాయని కొన్ని చూసినా విన్నా చెవిటి దానిలా ఉండాలని అంటుంది. కనకం ఏడుస్తూ ఆఫీస్‌లో చూసిన విషయం ఎవరికీ చెప్పనని తనని వదిలేయమని బతిమాలుతుంది. ఉదయం నిద్ర లేచే సరికి ఇంటి నుంచి వెళ్లిపోవాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: వామ్మో మహదేవయ్య క్రిష్‌ జీవితాన్ని ఇలా మార్చేశావా.. క్రిష్ కన్న తండ్రి అతనేనా, మరో వారసుడూ ఉన్నాడా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
T20 World Cup 2024 : మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
Tax Changes From 1st Oct: మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
Devara 2: ‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట!
‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట!
Embed widget