Kalavari Kodalu Kanaka Mahalakshmi September 10th: కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్: పెద్దాయనకు హార్ట్ ఎటాక్ కాపాడిన లక్ష్మీ.. కనకం రాక ఇంట్లో వాళ్లకి అదృష్టమన్న జంగమదేవర!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode చారుకేశవ కనకం దగ్గరకు వచ్చి తన గురించి ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోమని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ఉదయం విహారి ఇంటి ముందుకు జంగమ దేవర వస్తారు. యమున అది చూసి కనకమహాలక్ష్మీకి చాటలో బియ్యం తీసుకురమ్మని అంటుంది. ఇక సహస్ర తన ఇంటికి వెళ్తూ జంగమ దేవరని చూసి కారు దగ్గర ఆగుతుంది. ఇంట్లో అందరూ బయటకు రావస్తారు.
జంగమదేవర: ఇంట్లో చాలా మంది ఉన్నారు కానీ ఇళ్లంతా బోసిపోయింది. మనుషుల మధ్య బంధాలు సక్రమంగా లేవు. మనసులో కుళ్లు కుతంత్రాలు ఉన్నంత వరకు ఏ ఇళ్లు సక్రమంగా కలకల్లాడుతూ ఉండదమ్మా. మంచి మనసు ఉంటేనే నిండు కుండలా ఉంటుంది.
కాదాంబరి: స్వామి మేమంతా సంతోషంగా ఉన్నాం మీకు నచ్చింది చెప్పకుండా మేం ఇచ్చింది పుచ్చుకొని వెళ్లండి.
జంగమదేవర: తోచించి కాదమ్మా ఆ శివయ్య నాతో చెప్పిస్తున్న మాటలు ఇవి. జంగమ దేవరని అవమానించినా అనుమానించినా మామూలుగా ఉండదు.
వసుధ: మేమంతా సంతోషంగా ఉన్నాం లేనిపోనివి చెప్పి దయచేసి మా మధ్య గ్యాప్ వచ్చేలా చేయకండి.
జంగమదేవర: సాక్ష్యాత్తు మహాలక్ష్మీ నడిచి వస్తున్నట్లు ఉంది ఆ తల్లిని చూడండి. (కనక మహాలక్ష్మీ, యమున కలిసి వస్తారు. కనకం బియ్యం జంగమదేవరకు ఇస్తుంది. యమున డబ్బులు ఇస్తుంది. ) నీ ముఖ వర్చస్సు, నీ చల్లని మనసు, నీ కళ్లలో ఆ వెలుగు చెప్తున్నాయ్ నువ్వు ఈ ఇంటికి నడిచి వచ్చిన శ్రీ కనకమహాలక్ష్మివి. దేవత లాంటి రూపు, చూపు ఉన్న ఈ తల్లే ఈ ఇంటి అదృష్ట దేవత. నీ రాక ఈ ఇళ్లు చేసుకున్న పుణ్యం. నువ్వు చేసే పనులు నీ అడుగుల వల్ల ఈ ఇళ్లు పుణీతం అవుతుంది. ఈ రోజు నీ మీద కోపంగా చూసే కళ్లన్నీ ఏదో రోజు నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాయి. ఇది నా మాట.
విహారి తాత ఆరు బయట పెపరు చదువుతుంటారు. లక్ష్మీ బయట బట్టలు తీస్తుంటుంది. ఇక ఉన్నట్టుండి విహారి తాతయ్యకి గుండె నొప్పి వచ్చేస్తుంది. గుండె పట్టుకొని కూలిపోతారు. ఇక కనకం తాతగారి వార్తలు వినిపించడం లేదు ఏంటని వెనక్కి చూసి ఆయన కుప్పకూలిపోవడం చూసి పరుగులు తీస్తుంది. పెద్దయ్య పెద్దయ్య అని లేపుతుంది. ఆయన గుండెని వత్తుతూ అమ్మగారు రండి అని పెద్దగా పిలుస్తుంది. లక్ష్మీ సీపీఆర్ చేయడంతో పెద్దాయన లేస్తారు. అందరూ కంగారుగా వచ్చి ఏమైందని అడుగుతారు. కాదాంబరి ఏమైందని ఏడుస్తుంది. కనకం జరిగింది చెప్తుంది. పెద్దాయన ట్యాబ్లెట్ కోసం చెప్పబోతే ఎవరికీ అర్థం కాదు కానీ కనకం సైగలు చూసి ట్యాబ్లెట్ అడుగుతున్నారని చెప్పి పరుగులు తీస్తుంది. ట్యాబ్లెట్ పట్టుకొని వస్తుంది. ఇక యమున విహారికి కాల్ చేసి విషయం చెప్తుంది. కనకం పెద్దాయనకి ట్యాబ్లెట్ వేస్తుంది.
పెద్దాయన తేరుకున్న తర్వాత రెండు చేతులు జోడించి లక్ష్మీకి దండం పెడతారు. పెద్దాయన ఏంటి ఇది అని అంటే పోయే ప్రాణాన్ని కాపాడి నాకు పునర్జన్మ ఇచ్చావని అంటారు. నువ్వు ఈ ఇంటికి వచ్చిన కారణం ఇప్పటి వరకు తెలీదు అని నా ప్రాణం కాపాడటానికి వచ్చావమ్మా అని ఎమోషనల్ అవుతారు. కనకం కూడా ఏడుస్తుంది. తన తండ్రి థ్యాంక్స్ చెప్పకుండా చెట్టెక్కిస్తున్నారని విహారి వచ్చే టైంకి లక్ష్మీ ఇక్కడే ఉంటే అంతరిక్షం ఎక్కించి వరాలు కురిపిస్తాడని లోపలికి పంపేయాలి అని లక్ష్మీని పంపేస్తుంది. లక్ష్మీ వెళ్లగానే విహారి పరుగున వస్తాడు. హాస్పిటల్‌కి వెళ్దామని అంటాడు. మీ అమ్మ వల్ల నా ప్రాణం నిలబడిందని మీ అమ్మ తెచ్చిన లక్ష్మీ వల్ల నా ప్రాణం నిలబడిందని అంటాడు. నీ పెళ్లి కోసం చాలా కలలు కన్నానని చూడకుండా చనిపోతానేమో అని భయపడ్డానని ఏడుస్తాడు. విహారి తాతయ్యకి ధైర్యం చెప్పి లోపలికి తీసుకొస్తారు.
ఇక లక్ష్మీ గదిలో ఉంటే తాళి బయటకు వస్తుంది. అది పట్టుకొని విహారి గారు మీకు నేను బరువు అయిపోయినా మీరు కట్టిన తాళి నాకు ఎప్పటికీ బరువు కాదు అని అనుకుంటుంది. ఇంతలో చారుకేశవ్ లక్ష్మీ గదిలోకి వచ్చి డోర్ వేస్తాడు. లక్ష్మీ బయపడుతుంది. ఎందుకు వచ్చారని అడుగుతుంది. తన జీవితంలోకి తొంగి చూస్తే చంపేస్తానని అంటాడు. ఒంటరిగా కనిపించిన అమ్మాయిని మోసం చేయడం తప్పు కదా నగలు లాక్కొని తనని కొట్టి పారిపోవడం పాపం కదా అని అంటుంది. చారుకేశవ్ లక్ష్మీని ఇంటి నుంచి వెళ్లిపోమని బెదిరిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.