Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 2nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీకి విశ్వరూపం చూపిస్తానని బెదిరించిన అంబిక.. తులసీదళంతో తులాభారం విజయవంతం!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode ఆదికేశవ్ విహారికి కాల్ చేసి కనకం పదహారు రోజుల పండగ గురించి అడగటం విహారి అబద్ధం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి తూకంలో కూర్చొంటే సహస్ర బెల్లం వేస్తూ తులాభారం కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఉన్న బెల్లం మొత్తం వేసిన విహారి కొంచెం కూడా కదలడు. దాంతో అందరూ టెన్షన్ పడతారు. ఇప్పటి వరకు చేసిన పూజలన్నీ వృథా అయిపోతాఏమో అనుకొని చాలా బాధ పడతారు. సహస్ర మాత్రం తూలాభారం పూర్తిగా సక్సెస్ అయిన వరకు వదలనని నాకు బావ అంటే ఎంత ఇష్టమో నిరూపించుకుంటానని అంటుంది. ఎవరికీ కంగారు పడొద్దని చెప్తుంది.మరోవైపు లక్ష్మీ కూడా అక్కడే ఉంటుంది. అది చూసి బాధ పడుతుంది.
భక్తవత్సలం: అమ్మ సహస్ర తులాభారం అంటే అంత సులువు కాదు. అది భక్తితోనూ, బాధ్యతతోనూ చేసేదమ్మ కేవలం బరువుతో చేసేది కాదు.
సహస్ర: తాతయ్య బావ బరువుకి సమానంగా నేను తూకం వేస్తాను. తులాభారం అంటే బంగారంతో తూకం వేస్తారు అన్నారు కదా నేను కూడా బంగారంతోనే తూకం వేస్తా అని తన ఒంటి మీద ఉన్న మొత్తం బంగారాన్ని తూకంలో వేస్తుంది. వడ్డానం నుంచి ముక్కు పుడక వరకు మొత్తం వేస్తుంది అయినా విహారి కొంచెం కూడా మీదకు లేవడు.
అందరూ బాధ పడతారు. అంబిక మాత్రం తన ప్లాన్ సక్సెస్ అవుతుందని హ్యాపీగా ఫీలవుతుంది. ఇక సహస్ర ఎన్నో ఏళ్ల క్రితం నుంచి తన చేతికి ఉన్న రింగ్ తీసి పెట్టడానికి చాలా కష్టపడుతుంది. వేలి నుంచి రక్తం కూడా కారుతుంది. ఎంత మంది వద్దు రింగ్ తీయొద్దని చెప్పిన సహస్ర వినకుండా బలవంతంగా రింగ్ లాగి రక్తంతో ఉన్న రింగ్ పెడుతుంది. అయినా తూకంలో ఎలాంటి మార్పు ఉండదు. దాంతో సహస్ర కూడా చాలా బాధపడుతుంది.
సహస్ర: మీరు చెప్పింది నిజమే తాతయ్య బహుశా భక్తితో చేసుంటే తులాభారం సక్రమంగా జరిగేదేమో.
లక్ష్మీ: విహారి గారు కూడా బాధ పడుతున్నారు. భగవంతుడా ఈ కుటుంబానికి ఎలాంటి అరిష్టం రాకుండా చూడు స్వామి. ఈ తులాభారం ఎలా అయినా పరిపూర్ణం అయ్యేలా చూడు స్వామి. ( కనకం మొక్కుకోగానే కృష్ణుడి తులసి మాల వేసిన టైంలో కనకం చేతిలో పడిన తులసీదళం ఇప్పుడు ఓ పళ్లెంలో పడుతుంది)
తన చేతిలోని తులసి కింద పడటం కనకం గుర్తించదు. ఇంతలో బయట నుంచి ఓ రామ చిలుక ఎగురుకుంటూ వచ్చి ఆ తులసీ దళాన్ని నోటితో తీసుకెళ్లి తూకంలో వేస్తుంది. అది చూసిన కనకం ఆ తులసి తన చేతిలోనిదే అని గుర్తిస్తుంది. తులసి పడగానే ఒక్కసారిగా విహారిపైకి లేచేస్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. సహస్ర, విహారి, యమున అందరూ చాలా సంతోషిస్తారు. తులాభారం విజయవంతం అయినందుకు అందరూ చాలా సంతోషిస్తారు. ఇదంతా దైవ నిర్ణయం అనుకొని దేవుడికి దండం పెట్టుకుంటారు. తులాభారం దిగ్విజయం అయినందుకు విహారి, సహస్రల పెళ్లికి ఏర్పాట్లు చేసుకోమని పంతులు అంటారు. ఇక అంబిక లక్ష్మీని చూసి అక్కడికి వస్తుంది.
అంబిక: చూడు లక్ష్మీ నేను బాణం గురిపెట్టానని నీకు బాగా తెలుసు అయినా నువ్వు ఎదురు చూస్తున్నావ్ నేను గురి చూసి కొట్టానంటే నీకు చావు తప్పదు. నేను నీకు అంత వార్నింగ్ ఇస్తే నువ్వు వెళ్లలేదు అంటే నేను ఏం అనుకోవాలి. ఇళ్లు వదిలి వెళ్లకపోతే నా విశ్వరూపం చూస్తావ్.
లక్ష్మీ: మనసులో స్వామి నేను చూసింది ఎవరికీ చెప్పను అన్నా కదా అయినా నా మీద ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు.
పండు: లక్ష్మీ అమ్మ ఎందుకు ఏడుస్తున్నావ్. నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందేమో అని భయపడ్డాను.
లక్ష్మీ: అదేంలేదు పండు.
ఇక లక్ష్మీ విహారి సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమని అనుకుంటుంది. అతని సంతోషానికి పరోక్షంగా తనని కారణం చేసినందుకు సంతోషంగా ఉందని అనుకుంటుంది. ఇక రాత్రి విహారికి ఆదికేశవ్ ఫోన్ చేస్తాడు. కనకానికి పదహారు రోజుల పండగ ఎలా జరిగిందని అడిగితే చాలా బాగా జరిగిందని చెప్తాడు విహారి. ఇక హైదరాబాద్‌లో మీ ఆఫీస్‌కి వెళ్లామని మేం ఎవరో తెలీకుండా మమల్ని తోసేశారని అంటారు. విహారి దానికి క్షమాపణ చెప్తాడు.. ఇక ఆదికేశవ్ విహారి, కనకం కలిసున్నప్పుడు వీడియో కాల్ చేయమంటాడు. సరే అని విహారి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















