![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: అందరి ముందు మందు తాగేసిన విహారి.. లక్ష్మీ గదిలో విహారి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి కనక మహాలక్ష్మీని గుర్తు చేసుకొని అందరి ముందు మందు తాగడం యమున నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: అందరి ముందు మందు తాగేసిన విహారి.. లక్ష్మీ గదిలో విహారి! kalavari kodalu kanaka mahalakshmi serial today october 28th episode written update in telugu Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: అందరి ముందు మందు తాగేసిన విహారి.. లక్ష్మీ గదిలో విహారి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/28/dad9400c77708801e369a6bd30d7d2531730101596639882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ తన ఇంట్లోనే ఉందని విహారి సత్యతో చెప్తాడు కనక మహాలక్ష్మీతో మాట్లాడావా నీ గురించి తను ఏమనుకుంటుంది. మంచి వాడు అనుకుంటుందా చెడ్డవాడు మోసం చేశావు అనుకుంటుందా అని అడుగుతాడు సత్య. ఏదో ఒక విధంగా కనకంతో మాట్లాడి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని సత్య అంటాడు. కనక మహాలక్ష్మీ చూపు చూస్తుంటే ఏదో తప్పు చేసినట్లు ఉందని విహారి బాధ పడతాడు. ఏం చేయాలో తెలియక నిశ్చితార్థం పార్టీలో మందు ఉంటే కోపంగా వెళ్లి కనక మహాలక్ష్మీని గుర్తు చేసుకొని మందు తాగేస్తాడు.
అక్కడే ఉన్న యమున, పద్మాక్షి, అంబికలతో పాటు అందరూ అక్కడికి చేరుకుంటారు. విహారి అని యమున పెద్దగా అరుస్తుంది. అప్పటికే మత్తులో విహారి ఉంటాడు. నువ్వు తాగుతున్నావా ఏమైంది నాన్న అని అడుగుతుంది.
పద్మాక్షి: యమున తాగుతున్నావా అంత సాగదీస్తున్నావ్ ఏంటి నా అల్లుడు అమెరికా నుంచి వచ్చాడు అలాగే ఉంటాడు. అయినా ఇక నుంచి యమున కొడుకులా కాదు పద్మాక్షి అల్లుడిలా ఉండాలి అనుకున్నా అచ్చం అలాగే ఉన్నాడు. ఇంత చిన్న విషయానికి అంత షాక్ ఎందుకు.
భక్తవత్సలం: పద్మాక్షి యమున ఇలా షాక్ అవ్వడంలో అర్థముందు విహారి ఇలా తాగడం నేను ఎప్పుడూ చూడలేదు. విహారి నువ్వు బాగానే ఉన్నావ్ కదా నువ్వు ఓకేనా
విహారి: నాట్ ఓకే తాతయ్య.
భక్తవత్సలం: ఏమైంది నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నావ్
విహారి: తాతయ్య మనం జీవితంలో ఏవేవోచేయాలి అనుకుంటాం. ఆత్మ విశ్వాసంతో అడుగేస్తాం కానీ మనం ఏం అనుకుంటామో అది జరగదు మనం అనుకున్నది మనం అనుకున్న తీరం కంటే వేరు తీరం చేరుకుంటుంది. ఇలా అవ్వకుండా ఉంటే బాగున్ను అనిపిస్తుంది కానీ ఏం లాభం అప్పటికే అంతా అయిపోతుంది. ఇలా అనిపించిన ప్రతీ సారి నా మనసులో ప్రశ్నలు మెదులుతాయి. ఆ ప్రశ్నల కోసమే ఈ మందు
యమున: విహారి నువ్వు మాట్లాడేది మాకు అర్థం కావడం లేదురా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావ్
సహస్ర: బావ అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్ నీకు ఈ నిశ్చితార్థం ఇష్టంలేదా నాతో కలిసి బతకాలి అని నీకు లేదా.
విహారి: అదేం లేదు సహస్ర.
పద్మాక్షి: విహారి నీ మాటల ప్రకారం నువ్వు అనుకున్నది వేరు ఇక్కడ జరుతుంది వేరు అని పిస్తుంది.
విహారి: అలా ఏం లేదు అత్తయ్య అసలు నేను సహస్రని పెళ్లి చేసుకుంటానని మన కుటుంబాలు కలుస్తాయి అనుకున్నా కానీ కలిశాయి అందుకే సంతోషంగా అనిపిస్తుంది
యమున: దేని గురించో బాధ పడుతున్నాడు అది తెలుసుకోవాలి.
అంబిక: మనసులో వీడు ఇలా తాగితే నాకే బెటర్ మందులో ఉంచి సంతకాలు పెట్టించుకోవచ్చు
యమున: నాన్న ఇలా అందరిలో తాగుతున్నావ్ అంటే నీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు.
విహారి: మనసులో సారీ అమ్మ మీ అందరి కోసం ఓ అమ్మాయికి మోసం చేయాల్సి వస్తుంది. అది పాపమో శాపమో నాకు అర్థం కావడం లేదు.
విహారి అక్కడి నుంచి వెళ్లి కనక మహాలక్ష్మీ ఎందుకు నన్ను నిలదీయలేదు అనుకుంటాడు. కనక మహాలక్ష్మీకి సారీ చెప్పాలని అనుకొని కనక మహాలక్ష్మీ గది కోసం వెతుకుతాడు. గదిలో కనక మహాలక్ష్మీ ఏడుస్తూ ఉంటుంది. తాగిన మైకంలో విహారి కనక మహాలక్ష్మీ గదిలోకి వెళ్తాడు. విహారి పడిపోబోతే కనక మహాలక్ష్మీ పట్టుకుంటుంది అప్పుడు కనకం మెడలో తాళిని విహారి చూసి షాక్ అవుతాడు. తాళి పట్టుకొని చూసి కనక మహాలక్ష్మీ ముఖం చూస్తాడు. నేను నిన్ను అర్థాంతరంగా వదిలేసిన ఈ తాళి ఇంకా అలాగే ఉంచుకున్నావా కనక మహాలక్ష్మీ అని అడుగుతాడు. వీటికి మీ దృష్టిలో అర్థం లేకపోవచ్చు కానీ నాకు అవే పరమార్థం అని అంటుంది.
విహారి: అలా అనకు కనక మహాలక్ష్మీ నువ్వు అలా మాట్లాడితే నా గుండెలో బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ నొప్పికి మందు నువ్వు కనిపించడమే అనుకున్నా కానీ నిన్ను మీ ఇంట్లో అప్పగించేస్తే సరిపోతుంది అనుకున్నా కానీ అదేంటో తెలీడం లేదు నువ్వు కనిపించగానే నీ మాట వినిపించగానే ఆ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. మన పెళ్లికి అర్థం లేదని చెప్పినా నువ్వు మీ ఇంటికి ఎందుకు వెళ్లలేదు. దానికి కనకం మా అమ్మానాన్నలు కూతురు అల్లుడితో అమెరికా వెళ్లిందని సంతోషంగా ఉన్నారు వాళ్లకి బాధ పెట్టడం ఇష్టం లేదని అర్థాంతరంగా వెళ్తే వాళ్ల గుండె ఆగిపోదా అని కనకం అంటుంది. నాకు వాళ్ల దగ్గరకు వెళ్లకుండా ఇలా సంతోషపెట్టడమే నాకు ఉన్న మార్గమని కనకమహాలక్ష్మీ అంటుంది. దానికి విహరి నువ్వు కనిపించాలి అని నిన్ను నీ ఫ్యామిలీ దగ్గరకు చేర్చాలి అని ఎంత తాపత్రయ పడ్డానో నాకు తెలుసు నువ్వు ఇలా వాళ్లకి దూరంగా ఉండటం సరి కాదని విహారి అంటాడు. విహారి కనకానికి రెండు చేతులు జోడించి దండం పెట్టి క్షమించమని అడుగుతాడు. లక్ష్మీ అది చూసి ఎమోషనల్ అవుతుంది. విహారి చేతులు పట్టుకొని కింద పెట్టి మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి అని అంటుంది. నేను నీ భర్తని కాలేకపోయాను నీతో జీవితాంతం నడవలేను కదా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: త్రినయని సీరియల్: నయని చేతిలో బొమ్మ పునర్జనమ్మను చూపిస్తుందా.. రేపే పాపకు ప్రాణ గండం!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)