Trinayani Serial Today October 26th: త్రినయని సీరియల్: నయని చేతిలో బొమ్మ పునర్జనమ్మను చూపిస్తుందా.. రేపే పాపకు ప్రాణ గండం!
Trinayani Today Episode నయనికి గాయత్రీ దేవి బొమ్మ ఇచ్చి అమ్మవారి గుడికి వెళ్తే తొలిబిడ్డ ఆచూకి తెలుస్తుందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode త్రినేత్రి, తన మామ కోసం వైకుంఠం భోజనం తీసుకొస్తుంది. నెయ్యి తీసుకొని బామ్మ వస్తుంది. వైకుంఠం దగ్గరకు తన భర్త వచ్చి త్రినేత్రికి విషం కలిపి తీసుకు రమ్మని చెప్పాకదా కలిపావా అని అడుగుతాడు. దానికి వైకుంఠం నాకు భయం అని చెప్తుంది. త్రినేత్రి చనిపోతే కదా మనకు ఆస్తి వస్తుందని వైకుంఠంతో భర్త అంటాడు. మరోవైపు విక్రాంత్ వర్క్ చేసుకుంటుంటే సుమన వచ్చి మీ అన్నయ్యని మీ పెద్దమ్మ గొంతు నలిపేస్తే ఎందుకు అడ్డుకోలేదని అంటుంది.
విక్రాంత్: పాడు పని ఏదో చేయాలని వల్లభ అన్నయ్య అనుకొని ఉంటాడు అందుకే పెద్దమ్మ గొంతు నలిపింది. నిప్పు లేనిదే పొగ రాదు సుమన. మా అమ్మ వాళ్ల గురించి నేను పూస గుచ్చినట్లు చెప్పగలను.
సుమన: మా అక్కకి ప్రాణ గండం రావడం ఏమో కానీ అందరూ అయిపోయేలా ఉన్నారు.
విక్రాంత్: నాతో వాదించే కంటే మా అమ్మని అడుగు మా అక్కని చంపేయాలను అనుకుంటున్నారో అడుగు.
సుమన: వాళ్లు ఎందుకు అలా చేస్తారు వాళ్లు మంచి వాళ్లు.
విక్రాంత్: ఇది కూడా వాళ్ల మనిషే కదా. అందుకే ఇలా అంటుంది.
అందరూ హాల్‌లో ఉంటారు. సుమన అటూ ఇటూ తిరుగుతుంటుంది. నయని వచ్చి అమ్మగారు ఈ రోజు పసిబిడ్డ గురించి చెప్తారని అంటుంది. అందుకే అందరం వెయిట్ చేస్తున్నామని సుమన అంటుంది. విశాల్ టెన్షన్‌గా ఉండటం చూసి తిలోత్తమ అడుగుతుంది. దానికి హాసిని ఆనందం ఎలా చెప్పాలో తెలీక ఇలా ఉన్నాడని కవర్ చేస్తుంది. ఈ రోజు నిజం తెలుస్తుంది కాబట్టి ఎవరూ ఎక్కడికి వెళ్లొద్దని సుమన అంటుంది. ఇంతలో పెద్ద గాలి వీచి ఇంట్లోకి ఓ బొమ్మ తీసుకొని గాయత్రీ దేవి వస్తుంది. నయని, తిలోత్తమలకు గాయత్రీ దేవి కనిపిస్తే మిగతా వాళ్లకి బొమ్మ మాత్రమే కనిపిస్తుంది. బొమ్మని చూసి మిగతా వాళ్లు షాక్ అవుతారు. అమ్మ నువ్వు ఇక్కడే ఉండటం వల్ల మాకు భయం ఉండదని నిన్ను ఎప్పుడైనా పసి బిడ్డగా చూడగలం అంటాడు విశాల్.
దానికి విక్రాంత్ పెద్దమ్మే చెప్తాను అంటే వాయిదా ఎందుకు బ్రో విశాల్ని అడుగుతాడు. ఎందుకు చెప్పొద్దని అంటున్నారని నయని విశాల్ని అడుగుతుంది. ఇక నయని గాయత్రీదేవితో నా గ్రహబలం సరిగ్గా లేదు ఎప్పుడు ఏమవుతుందో తెలీదు అందుకే చెప్పమన్నాను అంటుంది. నా కూతురిని చూసుకున్న తర్వాత నేను ఏమైపోయినా పర్లేదు అంటుంది. ఇక గాయత్రీదేవి తిలోత్తమతో నా కొడుకు అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు ఎందుకు నా కొడుకు మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నావని అంటుంది. గాయత్రీదేవి బిడ్డ గురించి చెప్పేస్తాను అంటుంది. హాసిని తిలోత్తమతో బిడ్డ గురించి చెప్తే నీకు అప్పుడు ఉంటుంది ఆట అని అంటుంది.
గాయత్రీదేవి నయని చేతిలో ఆ బొమ్మ పెట్టి అహల్యకు ఫోన్ చేసి ఈ బొమ్మ నీ చేతికి వచ్చిందని చెప్పమని అంటుంది. గాయత్రీ దేవి మాటలు తిలోత్తమ ఇంట్లో వాళ్లకి చెప్తుంది. ఇక గాయత్రీదేవి అహల్య బొమ్మ గాయత్రీ పాప చేతిలో పట్టుకొని పరమేశ్వరి గుడికి రమ్మని చెప్తుందని అప్పుడు నీకు నేను పసిపాపగా ఎలా ఉన్నానో తెలిసిపోతుందని గాయత్రీదేవి నయనితో చెప్తుంది. నయని చాలా సంతోషిస్తుంది. ఇక గాయత్రీదేవి నయనితో ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది. ఏంటని నయని అంటే పునర్జన్మ ఎత్తిన నాకు రేపు ప్రాణ గండం రావొచ్చు. నీకు నీ బిడ్డలకు గండం వస్తే నువ్వు తెలుసుకోలేవు కాబట్టి ఈ విషయం ముందే చెప్తున్నా అని చెప్పి వెళ్లిపోతుంది. నయని ఏడుస్తుంది. అమ్మ పాప గురించి చెప్పేసిందా అని నయనిని విశాల్ అడుగుతాడు. దాంతో తిలోత్తమ ఇంట్లో వాళ్లకి పరమేశ్వర గుడి దగ్గర గాయత్రీదేవి పసి పాపలా ఎలా ఉందో తెలుస్తుందని కొసమెరుపు ఏంటి అంటే రేపే ఆవిడకు ప్రాణ గండం కూడా ఉందని చెప్పారని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్ ప్రోమో: దమ్ముంటే ఆ విషయంలో చిన్నాని ఆపు: సత్యతో మహదేవయ్య ఛాలెంజ్