Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 23rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, లక్ష్మీలకు సంబంధం ఉందని రచ్చ రచ్చ చేసిన పద్మాక్షి.. ఫుటేజ్‌లో అంబిక దొరికిపోతుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ, విహారిలను ఒకే గదిలో చూసిన సహస్ర ఇంట్లో అందరికి పిలిచి రచ్చ రచ్చ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ఉదయం సహస్ర బయట నుంచి వచ్చిన అంబికను విహారి గురించి అడుగుతుంది. విహారి ఇంట్లోనే ఉన్నాడని అంబిక చెప్తుంది. ఇక లక్ష్మీ గదిలో లక్ష్మీ ఒడిలో విహారి హ్యాపీగా పడుకొని ఉంటాడు. లక్ష్మీ విహారి తల నిమురుతూ రాత్రంతా నా గదిలో ఉన్నారని అందరికీ తెలిస్తే ఏమనుకుంటారో. నా మీద నింద పడినా పర్లేదు కానీ విహారి గారిపై ఎలాంటి నింద పడొద్దని లక్ష్మీ అనుకుంటుంది.
మరోవైపు సహస్ర బావ బావ అని పిలుస్తూ ఇళ్లంతా తిరుగుతుంది. సహస్ర మాటలు విని లక్ష్మీ విహారిని లేపుతుంది. లక్ష్మీ ఒడిలో పడుకున్నందుకు విహారి సారీ చెప్తాడు. ఇక రాత్రంతా ఇలాగే కూర్చొన్నావా అని అడుగుతాడు. అవును అని లక్ష్మీ చెప్తే లేపొచ్చు కదా అని అంటాడు. ఇక లక్ష్మీ ఇవన్నీ వదిలేయండి రూం నుంచి ఎలా బయట పడాలో అది ఆలోచించండి అంటుంది. ఇక అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. అందరూ రాత్రంతా విహారి కనిపించడం లేదని అంటే దానికి అంబిక యజమానులకు తెలియని విషయాలు పని వాళ్లకి తెలుస్తాయి.
లక్ష్మీనో పండునో అడిగితే సరిపోతుందని అంటుంది. పండు లేడని అంటే లక్ష్మీని అడగమని అంటుంది. దానికి సహస్ర తెల్లారి నుంచి ఆ మొద్దు ముఖం ఇంకా కనిపించలేదని చెప్పి సహస్ర, అంబికలు లక్ష్మీ గదికి వెళ్తారు. సహస్ర వచ్చి లక్ష్మీని పిలుస్తూ గది తలుపులు కొడుతుంది. అంబిక కూడా ఏం తెలీనట్లు లక్ష్మీని పిలుస్తుంది. తలుపులు రావడం లేదని రాయి తీసుకురమ్మని అంబిక సహస్రని పంపి తర్వాత తన దగ్గరున్న తాళంతో డోర్ తాళం తీస్తుంది. ఇక సహస్రని పిలుస్తుంది. సహస్ర లక్ష్మీ, విహారిలను ఒకే గదిలో చూసి షాక్ అయిపోతుంది. అందరినీ పైకి రమ్మని పిలుస్తుంది.
సహస్ర: బావ కనిపించడం లేదని మనం రాత్రి నుంచి కంగారు పడుతున్నాం కానీ బావ మాత్రం రాత్రంతా ఈ లక్ష్మీ గదిలో ఉన్నాడు. చెప్పు బావ నువ్వు లక్ష్మీ గదిలో ఎందుకు ఉన్నావ్. రాత్రంతా నువ్వు ఈ లక్ష్మీ గదిలోనే ఉన్నావా.
పద్మాక్షి: ఏం మాట్లాడుతున్నావే విహారి లక్ష్మీ గదిలో ఉండటం ఏంటి.
సహస్ర: అవునమ్మా బావ లక్ష్మీ గదిలోనే ఉన్నాడు.
విహారి: సహస్ర అసలేం జరిగిందో తెలీకుండా నువ్వు కంగారు పడకు.
పద్మాక్షి: నువ్వు మాట్లాడకు విహారి. ఏమే లక్ష్మీ నువ్వు వలలో వేసుకోవడానికి నా మేనల్లుడే దొరికాడా. అమాయకంగా ముఖం పెట్టుకొని ఇంత దారుణానికి పూనుకుంటావా. ఛీఛీ కనిపించే ప్రతీ మగాడి మీద కన్నేసే దాన్ని ఏమంటారో తెలుసా.
లక్ష్మీ: అమ్మగారు దయచేసి అలా అనకండి అంటే పద్మాక్షి నోరుముయ్యవే అని లక్ష్మీని కొడుతుంది.
విహారి: అత్తయ్య అనవసరంగా మీ కళ్లతో చూసేదాన్ని నిజం అనుకోవద్దు.
కాదాంబరి: ఎందుకురా మీ అత్త మీద అరుస్తావ్ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి చూసి ఎవరైనా ఇలాగే అనుకుంటారు. అసలు నువ్వు లక్ష్మీ రూంలో ఉన్నావ్.
విహారి: అసలు నన్ను ఎందుకు చెప్పనివ్వరు ఎందుకు మాట్లాడనివ్వకుండా ఇలా నిందలు వేస్తున్నారు.
సహస్ర: నువ్వు ఇలా రాత్రంతా పరాయి అమ్మాయి గదిలో ఉంటే ఎవరైనా ఇలాగే నిందలేస్తారు బావ. ఏమే లక్ష్మీ నువ్వు సైలెంట్‌గా ఉండి నా బావకే లైన్ వేస్తావా. నా బావనే లొంగ దీసుకుంటావా. అసలు నీ లాంటి వాళ్లు ఉండాల్సిన ఇంట్లో కాదే బజారున నీలాంటి దాన్ని బజారుది అంటారు. ఇలాంటి బజారు పనులు చేసుకునే.
విహారి కోపంతో సహస్రని కొట్టడానికి వెళ్లి కొట్టకుండా ఆగిపోతాడు. అందరూ చూసి షాక్ అయిపోతారు. సహస్ర ఏడ్చేస్తుంది. మాటలు జాగ్రత్త అని తప్పు లేకుండా నిందలు వేయడం తప్పు అని తెలుసుకో అని తిడతాడు. దాని కోసం నా మీద చేయి ఎత్తుతావా అని సహస్ర ఏడుస్తుంది. నిన్ను ఎంతగా ప్రేమించాను నీకోసం పడి చచ్చే నన్ను దాని ముందు లోకువ చేస్తావా అని ఏడుస్తుంది. లక్ష్మీని తక్కువగా చేసి మాట్లాడటం నాకు నచ్చడం లేదు అని విహారి అంటాడు. దాంతో పద్మాక్షి దాన్ని అంటే నీకు నచ్చకపోవడం ఏంటి సహస్ర కంటే నీకు అదే ఎక్కువ అయిపోయిందా అని అడుగుతుంది. నీకు ఇష్టమై లక్ష్మీతో తప్పు చేస్తున్నావ్ అంటుంది.
యమును కూడా విహారిని నువ్వు రాత్రంతా లక్ష్మీ గదిలో ఎందుకు ఉన్నావని అడుగుతుంది. నువ్వు కూడా నన్ను అందరిలా ప్రశ్నిస్తున్నావా అని అడిగితే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇలాగే అంటారని అంటుంది. లక్ష్మీని ఇంటికి తీసుకొచ్చింది నువ్వుని పద్మాక్షి యమున మీద అరుస్తుంది. అందరూ మళ్లీ మళ్లీ విహారి నువ్వు లక్ష్మీ గదిలో ఎందుకు ఉన్నావని అడుగుతారు. దాంతో మీరు నన్ను అనుమానిస్తున్నారని చెప్తున్నా అని చెప్పి నేను లక్ష్మీ నన్ను కాపాడిందని థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే బయట నుంచి ఎవరో లాక్ చేశారని చెప్తాడు. ఎవరో కావాలని డోర్ లాక్ చేశారని అది మీలో ఒకరే అని విహారి అంటాడు. డోర్ లాక్ చేసింది ఎవరో నాకు తెలియాలి అని అంటాడు.
సహస్ర కూడా నేను వచ్చే సరికే డోర్ లాక్ అయిందని అంటుంది. అంబిక చాలా టెన్షన్ పడుతుంది. ఇక చారుకేశవకి సీసీ టీవీ ఫుటేజీ తీసుకురమ్మని చెప్తాడు. లాక్ చేసింది నేనే అని తెలిస్తే అందరికీ నేను ఏం సమాధానం చెప్పాలని అంబిక టెన్షన్ పడుతుంది. ఇక చారుకేశవ సీసీ టీవీ ఫుటేజ్ తీసుకొస్తాడు. ల్యాప్‌టాప్‌లో విహారి గదికి వెళ్లడం కనిపిస్తుంది. తర్వాత అంబిక ఎంట్రీ రాకుండా ఎర్రర్ కనిపిస్తుంది. దాంతో విహారి షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: అసలు నువ్వు ఎవరు? నన్ను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు: త్రినేత్రికి విశాల్ ప్రశ్నలు