Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 9th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: ఆదికేశవ్‌కి దొరికిపోయిన లక్ష్మీ, విహారిలు.. అంబికకు సిద్దార్థ్ బెదిరింపులు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం విహారికి ఆదికేశవ్‌లు దారిలో కనిపించడం హాస్పిటల్‌కి తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, లక్ష్మీలు ఆఫీస్ పని మీద వెళ్తుంటారు. ఇక ఆదికేశవ్ ఆటోలో హాస్పిటల్‌కి వెళ్తుంటాడు. ఆదికేశవ్ హాస్పిటల్‌కి వెళ్లే దారిలో దిగి లక్ష్మీ, విహారి కారులో వెళ్లడం చూస్తాడు. కనకం కనకం అంటూ కారు వెనక పరుగులు తీసి కింద పడిపోతాడు. లక్ష్మీ అద్దంలో చూసి నాన్న అని అరుస్తుంది. విహారి కారు ఆపడంతో నాన్న దగ్గరకు పరుగులు పెడుతుంది.
కనకం, విహారి ఇద్దరూ ఆదికేశవ్‌ని పైకి లేపుతారు. కనకం తండ్రిని చూసి దెబ్బలు తగిలాయా అని కంగారు పడుతుంది. ఈ దెబ్బలు లెక్క కాదు నాకు మిమల్ని ఇలా చూడటం సంతోషంగా ఉంది.. అని అమెరిక నుంచి ఎప్పుడు వచ్చారమ్మా బయల్దేరినట్లు చెప్పనే లేదు అంటాడు. దానికి కనకం అమ్మతో మాట్లాడినప్పుడు మీరు బెంగ పెట్టుకున్నాం అని అమ్మ చెప్పింది.. మీ అల్లుడికి చెప్పగానే వెంటనే తీసుకొచ్చేశారు అంటుంది. ఏ జన్మలో ఏం అదృష్టం చేసుకున్నామో కనకం మనకు మంచి అల్లుడు దొరికాడు అని అంటారు.
విహారి హాస్పిటల్‌కి వెళ్దాం అని చెప్తే ఆదికేశవ్ తనకు తగ్గిపోయిందని ఏం అవసరం లేదు అంటే కనకం విహారి ఇద్దరూ ఆదికేశవ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. మరోవైపు అంబిక సహస్ర చేస్తున్న పనులు ఆలోచించి తన ఆలోచన చెప్పడం లేదు ప్లాన్స్ చెప్పడం లేదు.. అని అనుకుంటుంది. ఇంతలో అంబికకు ఓ ఫోన్ వస్తుంది. ఎవరు అని అంబిక అడిగితే నన్ను మర్చిపోయావా అంబికాదేవి అని అంటాడు. బీటెక్‌లో నీకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండే వాడు అని అంటాడు. దానికి అంబిక నువ్వు సిద్దార్థ్ కదా అని అంటుంది. సిద్దార్థ్ అంబికకు పది లక్షలు అడుగుతాడు. నేను ఎందుకు ఇవ్వాలి అంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది నేను చెప్పిన చోటుకి నువ్వు పది లక్షలతో రావాలి లేదంటే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా అంటాడు. అంబిక చాలా టెన్షన్ పడుతుంది.
లక్ష్మీ తండ్రిని డాక్టర్‌కి కలిపించి తీసుకొస్తారు. నాన్న నీకు ఇంకా తగ్గలేదు ఓకే అన్నారు డాక్టర్లు అని అంటుంది. లక్ష్మీ అమ్మ గురించి అడుగుతుంది. గౌరీకి కాలు బెనికిందని సహస్ర లాంటి మంచి అమ్మాయి ఇంట్లో ఉన్నామని చెప్తాడు. లక్ష్మీ అక్కడ నుంచి వచ్చేయమని చెప్తే ఆదికేశవ్ వద్దని సహస్ర చాలా మంచి అమ్మాయిని ఫీలవుతుందని అంటాడు. విహారి ఆదికేశవ్‌తో మామయ్య మీరు రెండు రోజులు ఆ ఇంట్లో ఉండండి మాకు పని ఉంది మేం ఇప్పుడు మిమల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్లిపోతాం అంటాడు.
మరోవైపు పద్మాక్షి యమునతో విహారి, సహస్రల అమెరికా ప్రయాణం కోసం మాట్లాడావా అని అడుగుతుంది. ఇంకా లేదని యమున అంటే కొడుకు కోడలి సంతోషం నీకు ఇష్టం లేదా అని నీకు సొంత వాళ్ల కంటే పని వాళ్ల సంతోషం ముఖ్యం కదా అని విహారితో మాట్లాడకపోతే నీకు ఈ గౌరవం కూడా ఇవ్వను అంటుంది. ఆ మాటలు గౌరీ వింటుంది. యమున కూర్చొని ఏడుస్తూ ఒక్కగానొక్క కొడుకుని కళ్ల ముందు ఉంచకుండా అమెరికా పంపేస్తాం అంటే మనసు రావడం లేదు అని ఏడుస్తుంది. యమున దగ్గరకు గౌరీ వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. మీ వదినకు కోపం ఎక్కువ అంటే యమున కోపం ఉన్నా మంచిది అని చెప్తుంది. ఇద్దరికీ ముహూర్త బలం మీదే పెళ్లి జరిగిందా అని అడిగితే లేదు అనుకోని పరిస్థితిలో కొడుకు తాళి కట్టాడు అని యమున అంటుంది.
గౌరీ యమునతో మీ కోడల్ని చూశా కానీ మీ కొడుకుని చూడలేదు అంటుంది. ఫొటో లేదా ఉంటే చూపించండి అంటుంది. పండు విని అమ్మో ఇంకేమైనా ఉందా అనుకుంటాడు. పండుని చూసి యమున ఆల్బమ్ తీసుకురమ్మని అంటుంది. ఎక్కడో పెట్టేశా అని పండు స్టోర్ రూంలో పెట్టేశానేమో అంటాడు. ఇప్పుడు ఫుల్ బిజీ అనేస్తాడు. దాంతో యమున తర్వాత చూపిస్తా అని చెప్పి వెళ్లిపోతుంది. కనకం వాళ్లు ఆదికేశవ్‌ని సహస్ర ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఆదికేశవ్ లోపలికి రమ్మని చెప్తే అర్జెంట్‌గా పని ఉందని చెప్పి వెళ్లిపోతారు. ఇక ఇద్దరూ కాస్త దూరంలో లక్ష్మీని డ్రాప్ చేసి ఇంటికి వెళ్లమని అంటాడు. తాను ఆదికేశవ్‌కి కారు కనిపించకుండా పెడతాను అంటాడు.
ఆదికేశవ్ ఇంటికి వెళ్లి గౌరీతో విషయం చెప్తారు. కూతురు అల్లుడు వచ్చారని తెలిసి గౌరీ హ్యాపీగా ఫీలవుతుంది. గౌరీ కాలు నొప్పి తగ్గడం కోసం మందు ఇచ్చారని ఇస్తాడు. కనకం చాటుగా విని తండ్రిని చూసి ఏడుస్తుంది. ఆదికేశవ్ విహారికి కాల్ చేస్తాడు. కనకానికి ఫోన్ ఇవ్వమని చెప్తాడు. ఆదికేశవ్ కనకంతో మీతో మన ఊరి పంతులు సంతానం కోసం వ్రతం చేయమని చెప్తారని అంటాడు. ఆ మాట సహస్ర వింటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రహస్యం ఆదికేశవ్‌కి తెలిసిపోతుందా.. క్షణక్షణం ఉత్కంఠ!





















