Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today july 21st: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి బతకడం ఇక కష్టమే.. నింద లక్ష్మీపై పడుతుందా! అంబిక ప్లానేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి కండీషన్ సీరియస్ అని ట్రీట్మెంట్‌కి బాడీ సహకరించడం లేదని డాక్టర్లు ఫ్యామిలీకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడని కండీషన్ సీరియస్‌గా ఉందని ఇంటికి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే చారు కేశవ విషయం తెలుసుకొని చాలా కంగారు పడతాడు. ఇంట్లో అందరికీ విషయం చెప్తాడు. అందరూ బిత్తరపోతారు. యమున, సహస్ర ఏడుస్తారు. అంబిక మాత్రం విహారి బతికేశాడా సంతకాలు పెట్టించాయో లేదో అని అనుకుంటుంది.
పద్మాక్షి యమున, సహస్రలతో విహారికి ఏం కాదని త్వరగా హాస్పిటల్‌కి వెళ్దామని చెప్తుంది. ఇక అంబిక మాత్రం ఇంటిలో ఉంటుంది. సుభాష్ లక్ష్మీ, విహారిల బాడీలు దొరుకుతాయేమో అని చెరువులో వెతుకుతుంటారు. ఇక అంబిక సుభాష్‌కి కాల్ చేసి ఏం చేస్తున్నారు అంటే విహారి వాళ్ల కోసం వెతుకుతున్నామని సుభాష్ అంటాడు. విహారి హాస్పిటల్‌లో ఉన్నాడని చెప్పి సుభాష్‌ని తిడుతుంది. తన చేతి నుంచి ఆదిపత్యం పోయిందని రగిలిపోతుంది.
లక్ష్మీ విహారి కోసం మందులు తీసుకొచ్చి విహారి వీపు మీద బులెట్‌ని తీస్తుంటే చూసి అంత గాయం అయినా నన్ను కాపాడటానికి ప్రయత్నించారా.. మీ కుటుంబం మిమల్ని నమ్ముకున్న సహస్రమ్మ, యమునమ్మలు ఏమైపోతారో అని ఆలోచించారా అని అనుకుంటుంది. ఇక డాక్టర్ విహారికి బులెట్ తీయాలి అంటే రక్తం ఎక్కించాలని అనుకొని రక్తం గురించి అడుగుతారు. లక్ష్మీ తనది అదే బ్లడ్ గ్రూప్ అని విహారికి రక్తం ఇస్తుంది.
సహస్ర, అంబిక, పద్మాక్షిలు హాస్పిటల్‌కి వస్తారు, రిసెప్షన్‌లో అడిగి ఐసీయూకి వెళ్తారు. అక్కడ నర్స్ విహారి కండీషన్ సీరియస్ అని నడుము దగ్గర బులెట్ తగిలిందని కత్తితో పొడిచిన గాట్లు ఉన్నాయని అంటారు. సహస్ర ఏడుస్తుంది. పద్మాక్షి చాలా బాధ పడుతుంది. అంబిక లక్ష్మీని చూసి నా ప్లాన్ అంతా నాశనం చేశావే అని అనుకొని పద్మాక్షి, సహస్రలకు లక్ష్మీని చూపిస్తుంది. సహస్ర సీరియస్‌గా వెళ్లి లక్ష్మీతో నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావే అని నిన్ను ఎవరు రమ్మన్నారు.. కోప్పడుతుంది. విహారి గారికి చాలా ప్రమాదం అని లక్ష్మీ అంటే అది పక్కన ఉంటేనే ప్రమాదం బయటకు తోసేయ్ సహస్ర అని అంబిక చెప్తుంది. దాంతో సహస్ర లక్ష్మీని మెడ పట్టుకొని గెంటేస్తుంది.
లక్ష్మీ వెళ్లి యమున కాళ్ల దగ్గర పడుతుంది. యమున స్వామీజీ చెప్పిన విషయాలు గుర్తు చేసుకొని విహారి లక్ష్మీని దొంగపెళ్లి చేసుకున్నాడని లక్ష్మీ వల్లే విహారికి ప్రమాదం అని అనుకుంటుంది. యమున ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. వసుధ లక్ష్మీని లేపి తనని ఎందుకు ఇబ్బంది పెడతారు అంటారు. లక్ష్మీ విహారికి ఏం జరిగిందో చెప్పబోతే అంబిక ఆపేస్తుంది. నేనే చెప్పేది వినండి అని లక్ష్మీ ఎంత చెప్పినా ఎవరూ వినడానికి ఆసక్తి చూపరు. సహస్ర కోపంగా నువ్వు లోపలికి వస్తే నిన్ను చంపినా చంపేస్తా అని అంటుంది. చారుకేశవ, వసుధ, పండులు లక్ష్మీ దగ్గర ఉంటారు. నీకు అవమానం జరిగినా ఏం చేయలేకపోతున్నాం సారీ అని చెప్పి వెళ్లిపోతారు.
పండు లక్ష్మీతో నువ్వు వాళ్లని ఒక్క మాట అననివ్వవు కానీ వాళ్లు నీకు ఎన్ని అంటున్నారో చూశావా అమ్మా.. యమునమ్మ గారు కూడా వీళ్ల మాటలకు మారిపోయినట్లున్నారమ్మా నిన్ను ఒక్క మాట అనడం లేదని అంటాడు. నీ బాధ చూస్తూ ఉండటం తప్ప ఏ సాయం చేయలేకపోతున్నా అమ్మా అని పండు ఏడుస్తాడు. విహారిని ఐసీయూలో చూసి యమున గుండె పగిలేలా ఏడుస్తుంది. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి విహారికి తగిలిన బులెట్ తీసేశాం కానీ ప్రస్తుతానికి ఆయన ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అవ్వడ లేదు బాడీ మొత్తానికి ఇన్‌ఫెక్షన్ వచ్చేసిందని అంటారు. ఎలా అయినా కాపాడండి అని యమున, సహస్ర డాక్టర్‌ని బలిమాలుతారు. లక్ష్మీ ఓ నర్స్‌కి విషయం అడిగి తెలుసుకుంటుంది. అక్కడే ఉన్న అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. విహారిని కాపాడమని త్రిశూలానికి చేయి గుచ్చుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ప్రమాదంతో మిథున, దేవా.. ఆదిత్య షూట్ చేసిందెవరిని? శివంగి ఎంట్రీ!





















