Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today july 15th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి కిడ్నాప్: లక్ష్మీ డౌట్ నిజమైందా.. సీసీటీవీ ఫుటేజ్‌లో షాకింగ్ దృశ్యం!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి కిడ్నాప్ అయ్యాడని లక్ష్మీ తెలుసుకొని విహారి కోసం మొత్తం వెతకడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ విహారి కోసం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎస్‌ఐతో ఎందుకో అనుమానంగా ఉందని విహారి కనిపించడం వెనక ఏదో మిస్టరీ ఉందని విహారి గారి నుంచి ఇంకా ఎలాంటి మెసేజ్ రాలేదని చెప్తుంది. దాంతో ఎస్‌ఐ విహారి ఏదో టెన్షన్‌లో ఉంటాడని అంటుంది. దాంతో లక్ష్మీ విహారి విషయంలో ఎంక్వైరీ చేయమని నేనే వెళ్లి వెతుకుతా అని అంటుంది. ఒక రౌడీ లక్ష్మీ వాళ్లని ఫాలో అవుతూ వాళ్ల మాటలు వింటూ ఉంటాడు. అంబికకు కాల్ చేసి విషయం చెప్తాడు.
అంబిక రౌడీని లక్ష్మీని ఫాలో అవుతూ ఉండమని అంటుంది. అంబిక మనసులో విహారిని లక్ష్మీ వెతకడానికి వెళ్తే కచ్చితంగా తన ప్లాన్ వేస్ట్ చేసేస్తుందని అనుకుంటుంది. లక్ష్మీ, ఎస్‌ఐ ఇద్దరూ విహారిని వెతకడానికి వెళ్తారు. లక్ష్మీకి విహారి నుంచి ఫోన్ వస్తుంది. లక్ష్మీ నేను వంద కోట్ల విషయంలో ఎంక్వైరీ చేయడానికి ఢిల్లీ వచ్చాను. నాకు రావడానికి టైం పడుతుంది. నువ్వు అక్కడ ఉండొద్దు రాజమండ్రి వెళ్లిపో అని అంటాడు. ఎస్‌ఐ లక్ష్మీతో నీ అనుమానం పోయింది కదా అంటే లేదు విహారి గారు నాకు అనుమానం పెరిగిందని విహారి నన్ను ఎప్పుడూ రాజమండ్రి వెళ్లిపోమని చెప్పరని అలా చెప్పారు అంటే ఏదో ప్రమాదంలో ఉన్నారని లక్ష్మీ చెప్తుంది.
లక్ష్మీ వెంటనే ఎస్‌ఐతో కలిసి విహారిని వెతకడానికి వెళ్తుంది. కారు ఉన్న దగ్గరకు వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్ చూడటానికి వెళ్తారు. వాళ్లంతా సీసీ ఫుటేజ్ లేదని అంటారు. కేసు పెడితే ఎంక్వైరీ చేయొచ్చని ఎస్‌ఐ అంటుంది. కేసు నేను పెడతా అని లక్ష్మీ అంటే నేను ఆయన భార్య అని చెప్పబోయి ఆగిపోతుంది. ఎస్‌ఐ లక్ష్మీతో విహారికి నిజంగా ఏమైనా అయితే వాళ్ల ఫ్యామిలీ ఊరుకుంటుందా అని అంటుంది. లక్ష్మీని తీసుకెళ్లిపోతుంది. లక్ష్మీని ఫాలో అవుతున్న రౌడీ అంబికకు కాల్ చేసి విషయం చెప్తాడు. లక్ష్మీ మనసులో విహారికి ఏదో ప్రమాదం జరుగుతున్నట్లు తెలుస్తుందని అనుకుంటుంది.
విహారిని సంతకం పెట్టమని సుభాష్ చితక్కొట్టి కొడతాడు. అయినా విహారి సంతకం పెట్టడు. లక్ష్మీ అనుమానంతో ఎస్‌ఐకి తెలీకుండా అర్థరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. అంబిక పెట్టిన రౌడీ అది గమనించకుండా ఫోన్ చూసుకుంటాడు. విహారి మనసులో లక్ష్మీ కచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తుందని అనుకుంటాడు. ఎస్‌ఐకి కానిస్టేబుల్ గొడవ జరుగుతుందని చెప్పి పిలుస్తారు. దాంతో ఎస్ఐ వెళ్లిపోతుంది. లక్ష్మీ సీసీ టీవీ ఫుటేజ్ కోసం హెడ్ ఆఫీస్‌కి వస్తుంది. అక్కడ వాచ్‌మెన్‌ని చూసి తెలీకుండా లోపలికి వెళ్లాలని అనుకుంటుంది. లక్ష్మీ సీక్రెట్‌గా సీసీ టీవీ ఫుటేజ్ కోసం వెళ్లి చూస్తుంది. విహారి కారు ఆపి ఓ వ్యక్తి కోపం వెళ్లడం విహారిని కిడ్నాప్ చేయడం చూస్తుంది.
విహారి కిడ్నాప్ అవ్వడం చూసి కంగారు పడుతుంది. ఎస్‌ఐకి కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేయరు. విహారిని ఎక్కడికి తీసుకెళ్లారా అనుకుంటూ అన్ని పెట్రోల్ బంకులు వెతుకుతూ ఉంటుంది. మొత్తం సీసీ టీవీ ఫుటేజ్ చూసి అడ్రస్లు గుర్తు పెట్టుకుంటుంది. కిడ్నాపర్ల కారు వెళ్లిన రూట్లోని మొత్తం వీధిలో వెతుకుతుంది. లక్ష్మీ విహారి కోసం వెతికి వెతికి ఓ టీ కొట్టు దగ్గర కూర్చొంటుంది. ఇంతలో విహారిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్లో ఓ వ్యక్తి అక్కడికి వస్తాడు. లక్ష్మీ అతన్ని చూసి గుర్తు పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: షాకింగ్.. విహారి కిడ్నాప్.. నడి రోడ్డు మీద కారు.. అర్థరాత్రి ఏం జరిగింది?






















